వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి ప్రభుత్వానికి 100 రోజుల సమయం ... మంచి చేస్తే స్వాగతిస్తాం...పవన్ కళ్యాణ్...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గతంలో కూడ టీడీపీ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేందుకు వంద రోజుల సమయం తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు కూడ అదే చేస్తున్నామని అన్నారు. మరోవైపు తెలంగాణకు భవనాలు కేటాయించడంపై ఏపి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

తెలంగాణకు భవనాల కేటాయింపుపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి...

తెలంగాణకు భవనాల కేటాయింపుపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి...

జనసేన రాష్ట్ర్ర కమిటీలు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు..జనసేన పార్టీ చాల బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. మరోవైపు వైసీసీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై నిర్మాత్మక విమర్శలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తే కీర్తిస్తామని లేదంటే నిలదీస్తామని అన్నారు. ఈనేపథ్యంలోనే వంద రోజుల తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ప్రశ్నిస్తామని అన్నారు. అయితే జగన్ ప్రభుత్వం తెలంగాణకు బదాలాయింపు చేసిన బిల్డింగ్‌లపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఏ బేస్ మీద భవనాలు ఇచ్చారో ప్రజలకు తెలపాల్సిన అవరముందని అన్నారు.

నెలరోజుల్లో ఏం మార్పు వచ్చిందని పార్టీ మారుతున్నారు..?

నెలరోజుల్లో ఏం మార్పు వచ్చిందని పార్టీ మారుతున్నారు..?

ఇక ఎన్నికల్లో పార్టీ మారుతున్న సభ్యుల గురించి మాట్లాడిన ఆయన జనసేన నుండి మాత్రం ఎవరు పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అయినా పార్టీ మారే వారు నెలరోజుల్లోనే ఎం జరుగుతుందని పార్టీ మారుతున్నారని ఆయన ప్రశ్నించారు. . ఇక తాను పార్ట్ టైం కార్యకలాపాల కోసం పార్టీని కొనసాగిస్తారనే వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. జనసేన పార్టీని గ్రౌండ్‌ లెవల్ పటిష్టపరుస్తున్నామని చెప్పారు.ఇలాంటీ పరిస్థితుల్లో ఇతరులైతే పారీపోయేవారని ...తాను మాత్రం పార్టీ నిర్మాణానికే కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇక టీడీపీ నుండి పార్టీ మారిన ఎంపీలపై వారు, వ్యక్తిగత కారణాలతో వెళ్లారా, లేక భయపడి వెళ్లారా అంటూనే..అది ఇతర పార్టీల అంతర్గత అంశమని పేర్కోన్నారు.

కూల్చివేతల్లో రెండు కోణాలున్నాయి...

కూల్చివేతల్లో రెండు కోణాలున్నాయి...

ఇక క్రిష్ణానది వెంట ప్రభుత్వం కూల్చనున్న నిర్మాణాలు ప్రభుత్వం చిత్తశుద్దితో చేస్తూందా.. లేక కొన్ని నిర్మాణాలనే టార్గెట్ చేసి కూల్చుతుందా అనేది తేలాల్సి ఉందని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జమిలీ ఎన్నికలు పవన్ స్వాగతించారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలను తాము మార్చలేమని ప్రస్థుతం తీసుకున్న జమిలీ నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తుందని తెలిపారు. పార్టీ భవిష్యత్‌పై సుధీర్ఘ సమయం చర్చించిన పవన్ కళ్యాన్ పలు కమిటీలు వేశారు. ఇక పార్టీని ముందుకు తీసుకువెళ్లేవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.

English summary
the newly formed Jagan government in Andhra Pradesh would give 100 days,Janasena chief Pawan Kalyan said, and also questioned that the government's decision on shifting of buildings to telangana governament
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X