• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ సర్కారు అరుదైన రికార్డు - ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు- చైర్మన్లు ఎవరో తెలుసా?

|

వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం జగన్ సర్కారు ప్రకటించిన 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ఏర్పాటు చేశారు. బీసీ కార్పొరేషన్‌ల చైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. కులాల ప్రాతిపదికన ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొదటిసారి కావడం, ఆయా పాలక మండళ్లను కూడా ఒకేసారి ప్రకటించడం జగన్ సర్కారు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 56 కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైనవారి పూర్తి జాబితా ఇలా ఉంది..

సీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామ

50 శాతం పదవులు మహిళలకే

50 శాతం పదవులు మహిళలకే

ఏపీలో మొత్తం 139 బీసీ కులాలు ఉండగా.. 30వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న కులాల కోసమే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. అంటే.. 56 మంది చైర్మన్లుగా, డైరెక్టర్లుగా 672 మంది పదవులు చేపడుతున్నారు. మొత్తం పదవుల్లో సగానికి సగం, అంటే 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. అంతేకాదు, చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించారు.

మూడు కేటగిరీలు..

మూడు కేటగిరీలు..

10లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లను ఏ-కేటగిరీ కింద, లక్ష-10లక్షల వరకు జనాభా ఉన్నవాటిని బీ-కేటగిరీ కింద, లక్ష లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను సీ-కేటగిరీ కింద విభజించారు. ప్రతి కార్పొరేషన్ కు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్‌ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమితులైనవారి జాబితా ఇలా ఉంది..

బంగాళాఖాతంలో మరో అల్ప‌పీడ‌నం - ఏపీకి భారీ వర్ష సూచన - తెలంగాణపైనా ప్రభావం

కులాల వారీగా కార్పొరేషన్ల చైర్మన్లు వీళ్లే..

కులాల వారీగా కార్పొరేషన్ల చైర్మన్లు వీళ్లే..

1. రజక: రంగన్న (అనంతపురం)

2. కురుబ : కోటి సూర్యప్రకాశ్‌ బాబు (అనంతపురం)

3. తొగట ‌: గడ్డం సునీత (అనంతపురం)

4. కుంచిటి వక్కలిగ: డా.నళిని(అనంతపురం)

5. వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు)

6. పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు)

7. ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు)

8. ఈడిగ : కె.శాంతి (చిత్తూరు)

9. గాండ్ల : భవానీ ప్రియ (తూర్పుగోదావరి)

10. పెరిక : పురుషోత్తం గంగాభవానీ (తూర్పుగోదావరి)

11. అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూర్పుగోదావరి)

12. అయ్యారక: రాజేశ్వరం (తూర్పుగోదావరి)

13. షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు)

14. వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు)

15. కుమ్మరి శాలివాహన: పురుషోత్తం(గుంటూరు)

16. కృష్ణ బలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు)

17. యాదవ: హరీష్‌కుమార్ (కడప)

18. నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప)

19. పద్మశాలీ: విజయలక్ష్మి (కడప)

20.నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్‌బి (కడప)

21. సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప)

22. విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా)

23. గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా)

24. వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా)

25. భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా)

26. వాల్మీకి బోయ: డా.మధుసూదన్ (కర్నూలు)

27. కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు)

28. వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు)

30. బెస్త : తెలుగు సుధారాణి (కర్నూలు)

31. ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు)

31. జంగం: ప్రసన్న (నెల్లూరు)

32. బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు)

33. ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు)

34. చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్‌కుమార్ (ప్రకాశం)

35. ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి(ప్రకాశం)

36. దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం)

37. మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం)

38. కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం)

39. కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం)

40. రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం)

41. పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం)

42. కురకుల/పొండర: రాజపు హైమావతి(శ్రీకాకుళం)

43. శ్రీసైన: చీపురు రాణి( శ్రీకాకుళం)

44. మత్స్యకార : కోలా గురువులు (విశాఖ)

45. గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ)

46.నగరాల: పిల్లా సుజాత (విశాఖ)

47. యాత: పి.సుజాత (విశాఖ)

48. నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)

49. తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం)

50. కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు(విజయనగరం)

51. శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం)

52 .దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం)

53. సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (పశ్చిమగోదావరి)

54. శెట్టి బలిజ: తమ్మయ్య (పశ్చిమగోదావరి)

55. అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న (పశ్చిమగోదావరి)

56. అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్‌ రావు (పశ్చిమగోదావరి)

English summary
The government of Andhra Pradesh has announced governing bodies of 56 BC Corporations set up for the development of BCs. The names of the chairmen and directors of BC Corporation were announced by the ministers at Tadepalli on Sunday. At present 56 corporations have been formed for a total of 139 BC castes. The government has appointed 12 directors along with a chairman for each of these corporations with 50 per cent reservation for women, all the districts are represented in the posts of Chairman and Director.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X