వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ప్రజల అంచనాలను జగన్ సర్కార్ అందుకోలేకపోయింది : మురళీధరరావు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం : ఏపీలో జగన్ సర్కార్ విఫలమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు. రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు బ్రహారథం పట్టారు. కానీ జగన్ సర్కార్ ఆచరణలో మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదన్నారు. ఏక్‌తా అభియాన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు.

వామ్మో.. హస్తిన హోటళ్లో వర్ణవివక్ష.. తలపాగాతో లోపలికి వెళ్లనీయని వైనం... సోషల్ మీడియోలో పోస్ట్వామ్మో.. హస్తిన హోటళ్లో వర్ణవివక్ష.. తలపాగాతో లోపలికి వెళ్లనీయని వైనం... సోషల్ మీడియోలో పోస్ట్

గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ప్రజలు భారీ విజయం కట్టబెట్టారు. కానీ అధికారం చేపట్టిన వైసీపీ .. వందరోజుల పాలనలో చెప్పుకోదగ్గ పనులు చేసినట్టు అనిపించడం లేదన్నారు. సమర్థంగా పనిచేయాలనే తపన జగన్‌కు ఉందని .. కానీ అవసరమైన విధానాలే లేవని అర్థమవుతుందన్నారు. జగన్ సర్కార్‌కు మార్గదర్శనం లేదని .. ఏం చేయాల్లో నిర్ధారించుకొని ఆ దిశగా వెళ్లడం లేదన్నారు. దీంతో ఏపీలో జగన్ సర్కార్ విఫలమవుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

jagan govt away from people expectations : muralidhara rao

బీజేపీ ఏపీలో చాలా కీలకమైన రాష్ట్రమని చెప్పకనే చెప్పారు. ఆంధ్ర ప్రజలకు మేలు చేస్తే విపక్షంగా పనిచేస్తున్నామని గుర్తుచేశారు. కశ్మీర్ అంశం మత సమస్య కాదని .. కాంగ్రెస్ తన రాజకీయ అవసరాల కోసం సృష్టించిన సమస్య అని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు కోసం 1957 నుంచి బీజేపీ పోరాడుతుందని గుర్తుచేశారు. కేంద్రంలో వందరోజుల పాలనలో ట్రిపుల్ తలాక్, కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, కొత్త మోటారు వాహన చట్టం అమలు తదితర కీలక అంశాలకు ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. కానీ జగన్ 100 రోజుల్లో ఏం చేశారో తెలియడం లేదని విమర్శించారు.

English summary
BJP's national general secretary Muralidhara Rao predicted Jagan govt failure in AP. People hoped for the YCP in the state. But Jagan govt practice had little effect. He spoke to the media in Vizag as part of the Ekta Abhiyan campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X