విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అశోక్‌ను మళ్లీ సాగనంపుతారా ? కలిసొస్తున్న శబరిమల తీర్పు- అప్పీలు ఆలస్యం వెనుక ?

|
Google Oneindia TeluguNews

విజయనగరం జిల్లాలోని పూసపాటి వంశీయులకు చెందిన మాన్సాస్‌ ట్రస్టు ఛైర్‌పర్సన్ నియామకంపై తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు వైసీపీ సర్కార్‌ పలు దారులు అన్వేషిస్తోంది. తొలుత మాన్సాస్ అక్రమాలను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం..అవి కాస్తా బూమరాంగ్‌ అయ్యే ప్రమాదం ఉండటంతో మరో కొత్త అస్త్రాన్ని తెరపైకి తెస్తోంది. తాజాగా ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ప్రభుత్వం అశోక్‌ తొలగింపుకు చేస్తున్న ప్రయత్నాలు సులువుగానే అర్ధమవుతాయి.

 అశోక్ ఉద్వాసనకు వైసీపీ మరో అస్త్రం

అశోక్ ఉద్వాసనకు వైసీపీ మరో అస్త్రం

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా ఉన్న సంచైత గజపతిరాజు స్ధానంలో హైకోర్టు తీర్పుతో అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టడంతో ఆయన్ను ఎలాగైనా సాగనంపేందుకు వైసీపీ సర్కార్ దారులు వెతుకుతోంది. అందులో భాగంగా తొలుత మాన్సాస్‌ అక్రమాలను తెరపైకి తెచ్చింది. అలాగే మాన్సాస్‌లో కొన్నేళ్లుగా ఫోరెన్సిక్‌ ఆడిట్ జరగని విషయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం తెరపైకి తెస్తున్న అంశాలకు అశోక్‌ గట్టిగానే బదులిస్తుండటం, సొంత ట్రస్టులో అశోక్‌ అక్రమాలకు పాల్పడ్డారంటూ చేసిన డొల్ల వాదనను కోర్టులు అంగీకరించే పరిస్ధితి లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై వైసీపీ సర్కార్ దృష్టిపెట్టింది.

అప్పీలు ఆలస్యానికి కారణమిదే

అప్పీలు ఆలస్యానికి కారణమిదే

మాన్సాస్ ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజు నియామకానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత ఆయన తొలగింపు కోసం తిరిగి అప్పీలుకు వెళ్తామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉండటంతో ఆయన తొలగింపు అంత సులువు కాదనే విషయం సర్కారుకు అర్దమైంది. అక్రమాల పేరుతోనో, మరో పేరుతోనో ఆయన్ను తొలగించేందుకు ప్రయత్నిస్తే అది కాస్తా ఎదురుతన్నే ప్రమాదముందని అర్ధమైంది. దీంతో ప్రభుత్వం అప్పీలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఓ బలమైన పాయింట్‌తో అప్పీలుకు వెళ్లేందుకు సర్కార్ దారులు వెతుకుతోంది.

 మాన్సాస్‌పై లింగ వివక్ష అస్త్రం

మాన్సాస్‌పై లింగ వివక్ష అస్త్రం

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా పూసపాటి రాజవంశానికి చెందిన మగ వారసులే ఉండాలన్న నిబంధనల నేపథ్యంలో అశోక్ గజపతిరాజు తిరిగి కోల్పోయిన పదవిని దక్కించుకున్నారు. ఆ నిబందనను సవాల్‌ చేసే అవకాశం లేకపోవడంతో ఏకంగా లింగ వివక్ష అంశాన్ని తెరపైకి తీసుకురావాలని వైసీపీ సర్కార్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఇవాళ ఓ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. గతంలో శబరిమలతో పాటు పలు దేవాలయాలు, సంస్ధల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఆమె ప్రస్తావించారు. వీటి ఆధారంగా అప్పీలుకు వెళ్లి అశోక్‌ గజపతిరాజుకు ఉద్వాసన పలకాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు.

మాన్సాస్‌లో లింగ వివక్ష కోర్టులు అంగీకరిస్తాయా ?

మాన్సాస్‌లో లింగ వివక్ష కోర్టులు అంగీకరిస్తాయా ?


పూసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్‌ ట్రస్టులో లింగ వివక్ష కొనసాగుతుందని, కాబట్టి సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్ధానంలో తిరిగి సంచైత గజపతిరాజుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ సర్కారు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేసే సమయంలో లింగవివక్షను తరెపైకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకంటే ముందే లింగవివక్షపై సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పుల్ని కారణంగా చూపుతూ అశోక్‌ను తొలగించినా ఆశ్చర్యం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అంతిమంగా రాజవంశంలో లింగవివక్ష ఆరోపణల్ని కోర్టులు అంగీకరిస్తాయా అన్నది ఇక్కడ కీలకంగా మారనుంది.

English summary
andhrapradesh women commision chairperson vasireddy padma on today suggests the state govt to implement sabarimala verdict which restricts gender descrimination in mansas trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X