రాధేశ్యామ్ కు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ - ప్రభాస్ మూవీతో మొదలు : ఆ నిర్ణయం వెనుక..!!
ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదం తరువాత ప్రభుత్వం తొలి నిర్ణయం తీసుకుంది. ప్రభాస్ సినిమాకు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. సినిమా టికెట్ల ధరల పెంపు పైన టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా వివాదం సాగింది. మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా హీరోలు సీఎం జగన్ తో చర్చలు చేసిన తరువాత టికెట్ ధరల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వం కొన్ని కండీషన్లను ప్రస్తావిస్తూ సినిమా టికెట్ ధరలను పెంచుతూ జీవో జారీ చేసింది. దీని పైన సినీ ఇండస్ట్రీ నుంచి హర్షం వ్యక్తం అయింది.

రాధేశ్యామ్ కు అనుమతి
ఆ
జీవో
తరువాత
ఇప్పుడు
ప్రభాస్
హీరోగా
పాన్
ఇండియా
మూవీ
రాధేశ్యామ్
విడుదల
అయింది.
అయితే
ఏపీలో
ఈ
మూవీ
టిక్కెట్
రేట్లపై
తొలుత
సందిగ్ధత
నెలకొంది.
ఏపీలో
20
శాతం
షూటింగ్
జరిపిన
సినిమాలకే
టిక్కెట్
రేట్లు
పెంచుకునే
అవకాశం
కల్పిస్తామని
గతంలో
ప్రభుత్వం
ప్రకటించింది.
అయితే
రాధేశ్యామ్
షూటింగ్
20
శాతం
మేర
జరపకపోవడంతో
ఈ
సినిమా
టిక్కెట్
రేట్లపై
ఎలాంటి
నిర్ణయం
వస్తుందో
అని
గురువారం
సాయంత్రం
వరకు
ఆన్లైన్లో
కూడా
టిక్కెట్ల
విక్రయాలు
ప్రారంభం
కాలేదు.

రూ 170 కోట్లు బిల్లులు సమర్పణ
చివరకు సినిమా నిర్మాతలు ప్రభుత్వం కోరిన విధంగా తమ బిల్లులు సమర్పించటంతో టికెట్ ధరలను పెంచుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియం టిక్కెట్ ధరపై రూ.25 పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. ఈ సినిమా బడ్జెట్ రూ. 170 కోట్లుగా జీఎస్టీ ఇతర అకౌంట్ల బిల్లును యూవీ క్రియేషన్స్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. నటీనటుల రెమ్యూనరేషన్ కాకుండా రూ. 100 కోట్ల సినిమా నిర్మాణానికైతే టిక్కెట్ రేట్లను పెంచే వెసులుబాటు ఇస్తామని గతంలో స్వయంగా సీఎం జగన్ ప్రకటించగా.. ఆ మేరకు రాధేశ్యామ్ మూవీకి టిక్కెట్ రేట్లు పెరిగాయి. బుక్ మై షో, పేటీఎంలలో కూడా విక్రయాలు ప్రారంభమయ్యాయి.

ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్
విజయవాడలోని అన్ని మల్టీప్లెక్సుల్లో ఈ మూవీ టిక్కెట్ రూ.177గా ఉండగా.. రిక్లయినర్ సీట్ల ధర రూ.295గా ఉంది. గతంలో ఈ ధరలు రూ.150, రూ.250గా ఉండేవి. లవర్‌బాయ్‌గా ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' పైన భారీ అంచనాలు ఉన్నాయి. 1970 నాటి పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటించింది. దీంతో.. ఇక త్వరలో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ తో పాటుగా ఇతర సినిమాల విషయంలోనూ ఇదే తరహాలో నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. కానీ, భీమ్లానాయక్ ముందే ప్రభుత్వం ఈ జీవో జారీ చేసి ఉంటే ఇటువంటి వివాదాలకు అవకాశం ఉండేది కాదనే అభిప్రాయమూ వినిపిస్తోంది.