• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సొంత పార్టీ ఎంపీకి షాకిచ్చిన జగన్ ..ఎంతటి వారైనా వదలబోమన్న సంకేతాలు.. నెవర్ బిఫోర్...

|

గతేడాది ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అంతా అవినీతికి దూరంగా ఉండాలని పార్టీ అధినేత కమ్ సీఎం హోదాలో జగన్ ఆదేశాలు ఇచ్చారు. తన నిర్ణయాన్ని ధిక్కరిస్తే వెంటనే పదవులు కోల్పోతారని తొలి కేబినెట్ లోనే మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పటివరకూ ప్రభుత్వంపై పలుమార్లు ఆరోపణలు వచ్చినా ఎక్కడా స్పందించినట్లు కనిపించని జగన్.. తాజాగా సొంత పార్టీకి చెందిన ఎంపీ కుటుంబంపై వచ్చిన అక్రమాల ఆరోపణలపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది.

 రేషన్ బియ్యం అక్రమ రవాణా... ఎంపీ కుటుంబం పాత్ర..

రేషన్ బియ్యం అక్రమ రవాణా... ఎంపీ కుటుంబం పాత్ర..

అది విశాఖపట్నం జిల్లా అనకాపల్లి. కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ రోడ్లపై నిత్యావసరాలు, అధికారుల వాహనాలు మినహా మరే వాహనాలు తిరగడం లేదు. అనూహ్యంగా రేషన్ బియ్యం తీసుకెళ్తున్న ఓ లారీ... స్ధానిక ఎంపీ బీశెట్టి సత్యవతి ఇంటి ముందు వచ్చి ఆగింది. రేషన్ డిపోకు వెళ్లి బియ్యం అన్ లోడ్ చేయాల్సిన లారీ ఎంపీ ఇంటి ముందుకు వచ్చి ఎందుకు ఆగిందని స్ధానికంగా ఉన్న విపక్ష పార్టీల నేతలకు అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ ను ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోవడంతో స్ధానిక ఆర్డీవోకు ఫోన్ చేశారు. వెంటనే ఆయన ఎంపీ ఇంటి వద్దకు వచ్చారు. లారీ డ్రైవర్ తో పాటు ఎంపీని, ఆమె ఇంట్లోని వారిని సైతం సదరు లారీ గురించి ప్రశ్నించారు. కానీ ఎవరి దగ్గరా సమాధానం లేదు. దీంతో వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే లారీని స్వాధీనం చేసుకుని ఆర్డీవో ఆఫీసుకు తరలించారు.

ఎంపీ భర్త ఆధ్వర్యంలో పనిచేస్తున్న ట్రస్టు కోసమే ?

ఎంపీ భర్త ఆధ్వర్యంలో పనిచేస్తున్న ట్రస్టు కోసమే ?

అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి భర్త డాక్టర్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో వివేకానంద ఛారిటబుల్ ట్రస్టు పనిచేస్తోంది. ట్రస్టు తరఫున ఇప్పటికే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే కరోనా సమయం కావడంతో మిగతా అందరితో పాటు ఈ ట్రస్టుకు కూడా నిత్యావసరాలు అందడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన 500 కేజీల బియ్యాన్ని ఎంపీ ఇంటికి సమీపంలోని ట్రస్టు కార్యాలయానికి స్టేజ్ 2 వాహనంలో నేరుగా తరలించినట్లు అధికారులు గుర్తించారు.

ఎంపీ కుటుంబం నిర్వాకంపై విచారణ...

ఎంపీ కుటుంబం నిర్వాకంపై విచారణ...

అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి కుటుంబం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ట్రస్టు నిర్వాకం తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చి రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించారు. లారీలో తరలిస్తున్న 105 క్వింటాళ్ల బియ్యంలో 100 క్వింటాళ్లకు రిలీజ్ ఆర్డర్ ఉందని గుర్తించారు. మిగతా 500 కేజీలు ఎంపీ కుటుంబ ట్రస్టుకు అక్రమంగా తరలివెళ్తున్నట్లు తేల్చారు. ఇందుకు కారణమైన ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ ఛార్జ్ తో పాటు ఓ రేషన్ డీలర్ ను సస్పెండ్ చేశారు. అక్రమాలు తేలడంతో ఎంపీ కుటుంబానికి చెందిన ట్రస్టుపై 6ఏ కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

  COVID-19 : Coronavirus Didn't Even Leave Supreme Court,1 Test Positive,2 In Quarentine
   ప్రభుత్వ ఆదేశాలతోనే.. ఎంతటి వారైనా...

  ప్రభుత్వ ఆదేశాలతోనే.. ఎంతటి వారైనా...

  ఈ వ్యవహారం బయటపెట్టింది అనకాపల్లిలోని సీపీఏం నేతలు. బయటికి రాగానే అక్కడికి చేరుకున్న ఆర్డీవో వెంటనే సమాచారాన్ని జేసీకి చేరవేశారు. అయితే స్వయంగా అధికార పార్టీ ఎంపీ కావడంతో చర్యలు తీసుకునేందుకు తిరిగి ప్రభుత్వ పెద్దలను సంప్రదించారు. కరోనా విపత్తు సమయంలో పేదలకు అందాల్సిన బియ్యాన్ని తరలించడం ఏమాత్రం సరికాదని భావించిన ప్రభుత్వ పెద్దలు సీఎం జగన్ తో మాట్లాడి వెంటనే చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో సొంత పార్టీ ఎంపీ అయినా వదిలిపెట్టేది లేదన్న సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే జేసీకి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు ఇదో గుణపాఠం కావాలని జగన్ భావించినట్లు ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది.

  English summary
  in a shocking incident in andhra pradesh, where visakhapatnam district officials files a case on a trust run by anakapalli ysrcp mp satyavati's family for allegedly diverting pds rice. on govt's orders joint collector ordered to file a case on mp's husband, who is running the trust.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X