వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కు దిమ్మతిరిగేలా.. తెలంగాణాకు జరిమానా వెయ్యాలని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ, తగ్గేదే లేదు!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. ఏపీ తెలంగాణ రాష్ట్రాల వరుస లేఖలతో రెండు రాష్ట్రాల మధ్య అగాధం మరింత పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకి రాసిన లేఖ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం, కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తెలంగాణకు జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

 తెలంగాణాకు జగన్ మార్క్ షాక్ .. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ఆపండి ; ఎన్జీటీలో అఫిడవిట్ తెలంగాణాకు జగన్ మార్క్ షాక్ .. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ఆపండి ; ఎన్జీటీలో అఫిడవిట్

ఆదేశాలు బేఖాతరు చేస్తున్న తెలంగాణాపై కఠిన చర్యలు తీసుకోండి

ఆదేశాలు బేఖాతరు చేస్తున్న తెలంగాణాపై కఠిన చర్యలు తీసుకోండి

తాజాగా మరోమారు కృష్ణా నదీ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం, కృష్ణా బోర్డు పద్నాలుగవ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు లలో తెలంగాణ ప్రభుత్వం యధేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆరోపించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును, కృష్ణా బోర్డు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. నిబంధనల మేరకు జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది.

తెలంగాణా విద్యుత్ ఉత్పత్తికి వాడిన నీటిని నీటి వాటాలో లెక్కించండి

తెలంగాణా విద్యుత్ ఉత్పత్తికి వాడిన నీటిని నీటి వాటాలో లెక్కించండి

శ్రీశైలం , నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిన తర్వాతనే వరద జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో అనుమతి తీసుకోకుండా విద్యుత్ ఉత్పత్తి చేయరాదని మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ సర్కార్ అక్రమంగా వాడుకున్న 113.57 టీఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్ర నీటి వాటాలో లెక్కించాలని ఏపీ ప్రభుత్వం లేఖలో విజ్ఞప్తి చేసింది.

ఆ విద్యుత్ లో 50 శాతం ఏపీకి ఇవ్వండి

ఆ విద్యుత్ లో 50 శాతం ఏపీకి ఇవ్వండి


అంతేకాదు నాగార్జునసాగర్, పులిచింతల నుండి అక్రమంగా వాడుకుని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసిన విద్యుత్ లో 50 శాతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలని లేఖలో కోరింది. కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణ సర్కార్ ను కట్టడి చేయాలని లేఖ ద్వారా కృష్ణా బోర్డు కు విజ్ఞప్తి చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఈ అంశంపై చర్చించడానికి కృష్ణా బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఏపీ సర్కార్ కోరింది.

 కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చెయ్యండి

కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చెయ్యండి


నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కారణంగా శ్రీశైలంలో నీటిమట్టం పడిపోతుందని లేఖ ద్వారా పేర్కొంది ఏపీ. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి వల్ల వృధా అయిన నీటిని తెలంగాణ ఖాతాల్లో లెక్కించాలని విజ్ఞప్తి చేసిన ఏపీ, ఇప్పుడు విద్యుత్తు ఉత్పత్తి కోసం వినియోగించిన నీటిని కూడా తెలంగాణ నీటి వాటాలో లెక్కించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కోర్టును కోరింది. కేంద్రం ఆదేశాలను, కృష్ణా బోర్డు ఆదేశాలను ధిక్కరించిన తెలంగాణ సర్కార్ కు విభజన చట్టం ప్రకారం జరిమానా విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయడం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ముదిరిపోతున్న జల వివాదానికి అద్దం పడుతుంది. మరి ఈ వ్యవహారంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చెయ్యాలని ఏపీ కోరింది.

ఏపీ లేఖపై కృష్ణా బోర్డు స్పందిస్తుందా కేసీఆర్ ఏం చెయ్యనున్నారు ? ఉత్కంఠ

ఏపీ లేఖపై కృష్ణా బోర్డు స్పందిస్తుందా కేసీఆర్ ఏం చెయ్యనున్నారు ? ఉత్కంఠ


ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖలోని అంశాలపై కృష్ణా బోర్డు స్పందిస్తుందా ? అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందా ? ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య నీటి వాటాల విషయంలో, విద్యుత్ ఉత్పత్తి విషయంలో తలెత్తిన వివాదాలను కేంద్రం చొరవ తీసుకుని పరిష్కరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కార్ ఏ మాత్రం తగ్గకుండా కేసీఆర్ సర్కార్ కు షాక్ లు ఇస్తుంటే నీటి లెక్కలపై మెలికలు పెడుతుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తారో ? తెలంగాణా ప్రభుత్వం ఏం చెయ్యబోతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

English summary
The AP government has written a letter asking the Krishna Board to impose fines on the Telangana government for disobeying the central government's directives that Telangana is generating electricity contrary to the Krishna Board's decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X