వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్కాగా ఆరోగ్య ఆసరా అమలు చెయ్యండి : సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఇక నేడు జరిగిన సమీక్షా సమావేశంలో తాజా పరిస్థితిలో ఎమెర్జెన్సీ సేవలకు కూడా ఏ లోటూ లేకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు .

బాలకృష్ణ నియోజకవర్గంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా .. హిందూపురంలో 100కి చేరువలో పాజిటివ్ కేసులుబాలకృష్ణ నియోజకవర్గంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా .. హిందూపురంలో 100కి చేరువలో పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 2 లక్షల మందికి పైగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం నాటికి 2,10,196 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 9284 టెస్టులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక రికవరీ లోనూ ముందే ఉన్నామని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళారు అధికారులు . కేసులు పెరుగుతున్న సంఖ్య కంటే డిశ్చార్జ్ ల సంఖ్య ప్రస్తుతానికి ఎక్కువగా ఉందని చెప్పారు.

Jagan has directed the officials to implement arogya asara

ఇక సీఎం జగన్ గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించామని పేర్కొన్న ఆయన ఎక్కడా ఎలాంటి లోటు, ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు . 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు .

అంతేకాదు పక్కాగా ఆరోగ్య ఆసరా పథకం అమలు చెయ్యాలని చెప్పారు. ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.ఇక నేడు కరోనా నియంత్రణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలపై జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

English summary
CM Jagan Mohan Reddy is conducting a daily review of corona control in Andhra Pradesh. At the review meeting held today, he said that the emergency situation should be looked at without any shortage. Chief Minister YS Jaganmohan Reddy has directed the officials to look into the issue of health support. The health care bills are said to be paid in a timely manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X