వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మా వద్ద సమాచారం మేరకు.. జగన్ బిల్డింగ్‌లోని నేలమాళిగలో బ్లాక్‌మనీ'

|
Google Oneindia TeluguNews

అనంతపురం: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మొహంలో దిగులు కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య శుక్రవారం నాడు ఎద్దేవా చేశారు.

దేశవ్యాప్తంగా రూ.500, రూ.1000 నోట్లను కేంద్రం రద్దు చేయడం పట్ల అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు. వైసిపి, ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం అస్వస్థతకు గురయ్యారని ఎద్దేవా చేశారు. అక్రమంగా దోచుకున్న నల్ల ధనాన్ని తెల్ల డబ్బుగా ఎలా మార్చుకోవాలా అని జగన్ ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు.

మోడీకి నారా లోకేష్ గట్టి షాక్, భార్య సంపాదిస్తుంటే.. అవాక్కయ్యారుమోడీకి నారా లోకేష్ గట్టి షాక్, భార్య సంపాదిస్తుంటే.. అవాక్కయ్యారు

అందువల్లే ఆయనకు అస్వస్థత కలిగిందన్నారు. తమ వద్దనున్న సమాచారం మేరకు.. జగన్‌ విలాసవంతంగా కట్టుకున్న భవనాల నేల మాళిగల్లో అక్రమ సంపాదన దాచి పెట్టినట్లు తెలిసిందని షాకింగ్ కామెంట్లు చేశారు.

Jagan has Rs 43K crore black money: Varla Ramaiah

సీబీఐ నమోదు చేసిన కేసుల విలువ రూ.43వేల కోట్లని, అయితే జగన్‌ వద్ద వాటికి అదనంగా మరో రూ.43వేల కోట్ల అవినీతి సొమ్ము ఉందన్నారు. జగన్‌ తన అవినీతి సొమ్మును ఇప్పటికైనా బయటపెట్టాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

'రూ.500, రూ.1000 నోట్ల ఎఫెక్ట్, 'తెలియని వ్యాధితో ఆసుపత్రిలో చేరిన జగన్' 'రూ.500, రూ.1000 నోట్ల ఎఫెక్ట్, 'తెలియని వ్యాధితో ఆసుపత్రిలో చేరిన జగన్'

రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఎలాంటి నష్టం లేదని చెప్పారు. సంక్షేమ పథకాలకు ఇది ఉపకరిస్తుందని యనమల అభిప్రాయపడ్డారు.

English summary
Varla Ramaiah alleged that YSRCP chief YS Jaganmohan Reddy has Rs 43K crore black money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X