వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేవీపీ..ఉండ‌వ‌ల్లికి జ‌గ‌న్ ఆహ్వానం: మేన‌ల్లుడు జ‌గ‌న్‌తో ఎందుకు దూర‌మ‌య్యారు..గ్యాప్ భ‌ర్తీ అయ్యేనా

|
Google Oneindia TeluguNews

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ఈ కార్య‌క్రమానికి జ‌గ‌న్ స్వ‌యంగా ప‌లువురు ప్ర‌ముఖ‌లును ఆహ్వానించారు. వీరితో పాటుగా త‌న తండ్రి ఆత్మ‌గా చెప్పుకొనే కేవీపీ రామ‌చంద్ర‌రావు..వైయ‌స్సార్ ముఖ్య అనుచ‌రుడు..మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ను సైతం జ‌గ‌న్ ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ ఇద్ద‌రు ఆహుతులుగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్నా..ఈ ఇద్ద‌రి మీద ఒత్తిడి పెరుగుతోంది. నాడు వైయ‌స్ త‌ర‌హాలో నేడు జ‌గ‌న్‌కు అండ‌గా నిల‌వాలంటూ ఉమ్మ‌డి మిత్రులు కోరుతున్నారు. మ‌రి..వీరు ఏం చేయ‌బోతున్నారు..

కేవీపీ ఎందుకు దూరంగా ఉంటున్నారు..
జ‌గ‌న్ త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావాలంటూ స్వ‌యంగా ఆహ్వానించ‌టంతో కేవీపీ రామ‌చంద్రరావు.. ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ హాజ‌రు కావాల‌ని నిర్ణ‌యించారు. అయితే, రాజ‌కీయంగా వైయ‌స్‌కు ఆత్మ‌గా వ్య‌వ‌హ‌రించిన కేవీపీ..వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత కాంగ్రెస్‌లోనే కొన‌సాగాల‌ని జ‌గ‌న్‌ను కోరారు. అయితే, జ‌గ‌న్ అప్పటి ప‌రిస్థితుల కార‌ణంగా కేవీపీ స‌ల‌హాల‌ను జ‌గ‌న్ విన‌లేదు. రాహుల్‌ను ప్ర‌ధాని చేయాల‌నేది వైయ‌స్ క‌ల అని..దాని కోసం తాను మాత్రం ప‌ని చేస్తాన‌ని కేవీపీ స్ప‌ష్టం చేసారు.

కాంగ్రెస్ అధినాయ‌క‌త్వంతో గొడ‌వ‌లు వ‌ద్ద‌ని.. మేమంతా అండ‌గా ఉంటాం.. కాంగ్రెస్ లోనే కొన‌సాగాల‌ని నాడు కేవీపీ కోరినా..జ‌గ‌న్ స‌సేమిరా అన్నారు. దాంతో..కేవీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతుండ‌గా..జ‌గ‌న్ సొంత పార్టీతో నేడు ముఖ్య‌మంత్రి అయ్యారు.

Jagan invited KVP and Undavalli for his swearing ceremony..in they work together in future..

నా మేన‌ల్లుడు అని చెప్పుకొనే కేవీపీ
కేవీపీ రామ‌చంద్ర‌రావు ఇప్పటికీ జ‌గ‌న్‌ను త‌న మేన‌ల్లుడిగానే చెప్పుకుంటారు. జ‌గ‌న్ పుట్ట‌క ముందు నుండే వైయ‌స్‌తో త‌న‌కు స్నేహం ఏర్ప‌డింద‌ని చెబుతారు. అటువంటిది కేవ‌లం చిన్న పాటి గ్యాప్ కార‌ణంగానే దూరంగా ఉండాల్సి వ‌చ్చింద‌ని విశ్లేషించిన సంద‌ర్భాలు ఉన్నాయి. రెండు కుటుంబాల‌కు చెందిన వారి శుభ‌కార్య‌క్ర‌మాలు మిన‌హా ఇద్ద‌రూ నేరుగా క‌లుసుకున్న సంద‌ర్భాలూ లేవు. ఇక‌, ఇప్పుడు మాత్రం జ‌గ‌న‌కు అండ‌గా ఉండి..స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేసేలా స‌హ‌కారం అందించాల‌ని కొంత మంది జ‌గ‌న్ కుటుంబ స‌న్నిహితులు కేవీపీని కోరుతున్నారు.

ఇక‌, ఉండ‌వ‌ల్లి సైతం అనేక సంద‌ర్భాల్లో జ‌గ‌న్‌ను అభినందించారు. తాను నేరుగా వైసీపీలో చేరే అవ‌కాశం లేద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసారు. అయితే, ఉండ‌వ‌ల్లి భ‌విష్య‌త్‌లో జ‌గ‌న్‌తో క‌లిసి ప‌ని చేయాల‌నుకుంటే స‌ముచిత స్థానం ల‌భిస్తుంద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. దీంతో..రేప‌టి ప్ర‌మాణ స్వీకారం ద్వారా వీరంతా తిరిగి ఒక్క‌ట‌య్యే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ రెండు రోజులుగా వైసీపీలో వినిపిస్తోంది.

English summary
Jagan invited KVP and Undavalli for his swearing ceremony. After YSR death gap between KVP and Jagan politically. Now mediators trying for fill the gap asking to work together.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X