• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ ఐఏఎస్ ల పనితీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి ..20 మంది ఐఏఎస్ లలో టెన్షన్

|
  ఐఏఎస్ అధికారుల అలసత్వం.. జగన్ తీవ్ర అసహనం ! || YS Jagan Mohan Reddy Gets Tough With IAS Officials

  ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి పాలనను పరుగులు పెట్టించాలని సీఎం జగన్ భావిస్తుంటే కొందరు ఐఏఎస్ అధికారుల అలసత్వం వల్ల అది సాధ్యం కావటం లేదని జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం .ప్రభుత్వం సక్సెస్ కావాలంటే అధికారుల పనితీరు ముందు మెరుగ్గా వుండాలని జగన్ భావిస్తున్నారు. తన పాలనలో యాక్టివ్ గా పని చేస్తారనుకున్న కొందరు ఐఎఎస్ అధికారుల పని తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ఐఎఎస్ అధికారులకు సీఎం జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న టెన్షన్ పట్టుకుంది.

  దరిద్రం పడితే తప్ప పోలీస్ స్టేషన్ కు వెళ్లొద్దు .. 7 నెలలు జైల్లో ఉన్న అనుభవం నాది .. కోటంరెడ్డి

  బదలీలు చేసి ప్రక్షాళన చేసినా ఇంకా పని తీరు మార్చుకోని ఐఏఎస్ లు .. సీఎం ఆగ్రహం

  బదలీలు చేసి ప్రక్షాళన చేసినా ఇంకా పని తీరు మార్చుకోని ఐఏఎస్ లు .. సీఎం ఆగ్రహం

  తాను అధికారంలోకి వచ్చిన వెంటనే శాఖాపరమైన ప్రక్షాళన చేపట్టిన సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారులను బదిలీ చేశారు. దాంతో సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా, వెంటనే ఆయా శాఖలు స్పందిస్తాయని ఆయన ఆశించారు. కానీ ఫలితాలు తాను ఆశించిన మేరకు లేవని జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అధికారులు ఇంకా అలసత్వం వీడలేదని ఆయన అసహనంతో ఉన్నట్టు సమాచారం .దాదాపు 20 మంది ఐఎఎస్ అధికారులపై ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాల పరిధిలో సమస్యలు వచ్చినప్పుడు తక్షణం స్పందించి పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం, పరిష్కార మార్గాలు చూడకపోవటం జగన్ కు నచ్చటం లేదని తెలుస్తుంది .

  విత్తనాల కొరత ఉన్న జిల్లాలో ప్రత్యామ్నాయం చూడని అధికారులపై జగన్ సీరియస్

  విత్తనాల కొరత ఉన్న జిల్లాలో ప్రత్యామ్నాయం చూడని అధికారులపై జగన్ సీరియస్

  విత్తనాల కొరతతో రైతులు రోడ్ల మీదికి వచ్చారు. చాలా జిల్లాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు . అయినప్పటికీ సమస్యపై ఐఎఎస్ అధికారుల్లో చలనం లేకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నట్లు చెబుతున్నారు. సమస్య వచ్చిన వెంటనే దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఐఎఎస్ అధికారులకు ఉంటుందని జగన్ చెబుతున్నారు. అయినా విత్తనాల సమస్యను అధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. విత్తనాల కొరత ఉందనేది తెలిసినప్పుడు వెంటనే ప్రత్యామ్నాయాలను చూపడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన భావిస్తున్నారు. ఇక తాను తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాల అమలులో కూడా అలసత్వం వహిస్తున్నారని ఆయన భావిస్తున్నారు.

  20 మంది ఐఏఎస్ అధికారులపై అసంతృప్తితో ఉన్న జగన్ .. టెన్షన్ లో అధికారులు

  20 మంది ఐఏఎస్ అధికారులపై అసంతృప్తితో ఉన్న జగన్ .. టెన్షన్ లో అధికారులు

  కొందరు ఐఏఎస్ లు తన నిర్ణయాలను అమలు చేయడంలో తన వేగాన్ని అందుకోలేకపోతున్నారని, ఇంకొందరు తన నిర్ణయాలను అమలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే జిల్లాల వారీగా ఇంచార్జ్ మంత్రులు బాధ్యతలు తీసుకుని అటు అధికారులను, వారే కావాలని డబ్బులు తీసుకుని మరీ అధికారుల పోస్టింగ్ కోసం ఒత్తిడి తెస్తున్న ఎమ్మెల్యేలను ఓ కంట కనిపెట్టాలని జగన్ చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే సర్కిల్ ఇన్ స్పెక్టర్ బదిలీ కోసం అతని వద్ద నుంచి రూ 10 లక్షలు తీసుకున్నాడు. అ విషయం తెలిసి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ డబ్బును తిరిగి ఆ అధికారికి ఇప్పించారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఇంచార్జీ మంత్రులకు సూచించారు. ఇక పనితీరు లేని అధికారుల పై జగన్ సీరియస్ గా ఉన్న నేపధ్యంలో ఆ ఐఏఎస్ లకు టెన్షన్ పట్టుకుంది. మరి జగన్ వీరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ..

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  CM Jagan thinks that the administration should be put on hold since the administration took over in AP, laziness of the some IAS officials ..that it is not possible . Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy seems to be deeply unhappy with the way some IAS officers are expected to be active in his administration.This has led many IAS officers to tense about when CM Jagan will take a decision. In many districts, the farmers have been agitated. However, the chief minister is said to be impatient with the lack of drift among IAS officers on the issue.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more