వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగనే చెప్పారు కదా... మరీ ఆయన తప్పుకోవాల్సిందేగా: మంత్రి సోమిరెడ్డి

జగన్ దొంగ కంపెనీలు పెట్టి వందల కోట్లు బదిలీ చేశారని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టాప్‌-10 జాబితాలో జగన్‌ పేరుందని అన్నారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్‌ వేల కో

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: అవినీతిపరులు రాజకీయాల్లో ఉండొద్దని జగనే అంటున్నారని, మరి ఈ లెక్కన ఆయన ప్రతిపక్ష నేత పదవి నుంచి వైదొలగాలి కదా? అని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

జగన్ దొంగ కంపెనీలు పెట్టి వందల కోట్లు బదిలీ చేశారని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టాప్‌-10 జాబితాలో జగన్‌ పేరుందని అన్నారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్‌ వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారన్నారు.

Jagan itself told.. Then he must quit from Politics, says Minister Somireddy

ఏపీకి జగన్ కళంకం: వర్ల ఫైర్

ఏపీకి జగన్‌ కళంకంగా మారారని టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్ఠను జగన్‌ దిగజార్చుతున్నారన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ కరెప్షన్‌లో జగన్‌ నెం.1 అని, ప్యారడైజ్‌ పేపర్లలో జగన్‌ పేరు వచ్చిందన్నారు.

దీనిపై పాదయాత్రలో జగన్‌ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లోగా కేసుల నుంచి శిక్ష పడకుండా తప్పించుకోవాలన్నదే జగన్‌ వ్యూహమని వర్ల రామయ్య పేర్కొన్నారు. కానీ ఆయన అనుకున్నది జరగదని, జగన్‌ తన శేష జీవితం జైలులో గడపడం ఖాయమన్నారు.

English summary
Telugudesam Party leaders Somireddy Chandra Mohan Reddy and Varla Ramaiah slammed YCP Chief YS Jagan Mohan Reddy regarding his name appeared in the shell companies list provided by Enforcement Directorate. Both leaders while talking to Press Reporters critisized YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X