వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ హత్య చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి..?, చంద్రబాబు నాయుడుపై గోరంట్ల మాధవ్ విసుర్లు

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఉన్న కియా ప్లాంట్‌ను వెళుతోంది అని ప్రచారం చేసిన గొప్ప సమర్థుడు అని విమర్శించారు. అంతేకాదు పోలీసుస్టేషన్ కెళ్లి తనను సీఎం జగన్మోహన్ రెడ్డి హత్య చేశారని ఫిర్యాదు కూడా చేసే అవకాశం ఉందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని.. జాకీ పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదన్నారు.

మేనేజ్ చేయడంలో దిట్ట..

మేనేజ్ చేయడంలో దిట్ట..


చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే గొప్ప వ్యక్తి అని గోరంట్ల మాధవ్ విమర్శించారు. ఇందుకు కియా అంశం ఉదహరణ అని పేర్కొన్నారు. రేపో మాపో పోలీసుస్టేషన్‌కు వెళ్లి తనను జగన్ హత్య చేశారని ఆరోపించే అవకాశం ఉందన్నారు. అదేంటి బతికే ఉన్నావ్ కదా అని పోలీసులు అడిగితే.. తనను ఎప్పుడో జగన్ హత్యచేశారని, తాను ఆత్మ అని చెప్పి నమ్మించే ఘనుడు అని కామెంట్ చేశారు.

20 ఏళ్ల శిక్ష..?

20 ఏళ్ల శిక్ష..?

పోలీసుల చేత బలవంతంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తారని గోరంట్ల మాధవ్ చెప్పారు. అంతటితో ఆగకుండా కేసు చార్జీషీట్ దాఖలు చేసి.. కోర్టులో విచారణ కూడా జరిపించే మేధావి అని చెప్పారు. కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష కూడా వేయించేవరకు చంద్రబాబుకు నిద్రపట్టదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ఇకనైనా చావు రాజకీయాలు, దివాలాకోరు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

సరికాదు..

సరికాదు..

కియా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తాను బెదిరించలేదని ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టంచేశారు. తమ భూమి, నీళ్లు వాడుకొని, రాయితీ తీసుకొంటున్న కంపెనీ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని మాత్రమే కోరానని చెప్పారు. దానిని వారు తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. లోక్‌సభలో కూడా ఇదే విషయంపై చేయి చూపి మాట్లాడితే.. వారు దాడి చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పసి పిల్లవాడి లాంటి చర్యను.. తప్పుగా ప్రమోట్ చేయడంలో టీడీపీకి టీడీపే సాటి అన్నారు.

అసత్య కథనం..

అసత్య కథనం..


కియా ప్లాంట్ వెళ్తుందని రాయిటర్స్ పత్రికతో కథనం రాయించి.. కుళ్లు, కుట్ర, కుతంత్రంతో లోక్‌సభలో ఎంపీలతో వివాదం చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పారు. కానీ వారికి సభలో శృంగభంగం తప్పలేదని.. దీంతో తాము చేసిన చర్యను ఇకనైనా సమర్థించుకొవద్దని సూచించారు.

English summary
cm jagan killed me.. please file FIR, chandrababu may ask police ycp mp gorantla madhav said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X