వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ భద్రతపై నిర్లక్ష్యం, బాబుకు వైసీపీ 100ప్రశ్నలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

మంగళగిరి: వైయస్సార్ కంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు మంగళగిరిలో ఏడాది చంద్రబాబు పైన సమర దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బాబు పైన నిప్పులు చెరిగారు.

కత్తి లేకుండానే చంద్రబాబు మహిళలకు బాబు వెన్నుపోటు పొడిశారని, రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారన్నారు. ఉన్న ఉద్యోగులు ఊడిపోయేలా చేస్తున్నారన్నారు. రాజధానికి భూములు లాక్కుంటున్ననారని ధ్వజమెత్తారు.

కాగా, సమర దీక్షకు గుంటూరు పోలీసులు భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ భద్రత పై నిర్లక్ష్యం వహించారన్నారు. ఎస్పీ కార్యాలయం ఎదుట వైసీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఏఎస్పీ హామీతో ధర్నాను విరమించారు.

 సమర దీక్ష

సమర దీక్ష

ఏ కత్తీ లేకుండా డ్వాక్రా మహిళలను వెన్నుపోటు పొడిచిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని జగన్ విమర్శించారు.

సమర దీక్ష

సమర దీక్ష


బుధవారం మంగళగిరి వై జంక్షన్ వద్దకు ఆయన ఉదయం 11.40 గంటలకు చేరుకుని సమరదీక్షను ప్రారంభించారు. ప్రాంగణానికి విచ్చేసిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

 సమర దీక్ష

సమర దీక్ష

డ్వాక్రా మహిళల అగచాట్లు చెప్పడానికి వీలు లేకుండా ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం చేసిన వాగ్దానాలను మరిచి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టివేసిందన్నారు.

ఐదు అంశాలపై సమరదీక్ష చేపడుతున్నట్లు జగన్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో 650 వాగ్దానాలు చేసి అధికారం కైవసం చేసుకున్న తర్వాత ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

సమర దీక్ష

సమర దీక్ష

రైతన్నలు చంద్రబాబును నమ్మి ఓట్లు వేసి దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందని ఊదరగొట్టిన చంద్రబాబు ఏడాది కాలంలో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పనిలో పడ్డాడన్నారు.

 సమర దీక్ష

సమర దీక్ష

రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్ల యమాజనులు ఉపాధి కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని గట్టిగా అడగలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు.

సమర దీక్ష

సమర దీక్ష

కేంద్రమంత్రి వర్గంలో తెలుగుదేశం పార్టీ వారిని ఎందుకు కొనసాగిస్తున్నారో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

సమర దీక్ష

సమర దీక్ష

సమరదీక్ష ప్రకటించిన తర్వాతే డ్వాక్రా రుణమాఫీపై కదలిక వచ్చిందని వైసీపీ నేతలు అన్నారు. అయితే 400 కోట్ల ముడుపుల కోసం పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

సమర దీక్ష

సమర దీక్ష

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు తీసుకుంటున్నారని రైతులు గ్రహించారన్నారు. అందువల్లే రాజధానిలో 33,500 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు ప్రస్తుతం 15 వేల ఎకరాలను మాత్రమే ఇచ్చారన్నారు.

English summary
YS Jagan Launches 'Samara Deeksha' against TD Govt, Releases Praja Ballot
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X