ఏలూరు మేయర్‌గా మళ్లీ నూర్జహాన్ -పవన్-బీజేపీ తుస్, టీడీపీకి 3 -ఎన్నికల పూర్తి ఫలితాలివే
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తుది ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార వైసీపీ మరోసారి ఏలూరు బల్దియాను కైవసం చేసుకుంది. కోర్టు వివాదాల నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగా ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు జరగ్గా, విపక్ష టీడీపీ కేవలం 3 సీట్లుకు పరిమితమైంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన-బీజేపీ కూటమికి ఒక్క సీటూ దక్కలేదు.
సాయిరెడ్డి, సజ్జల మధ్య ఆధిపత్య పోరు -జగన్ 100 తప్పులను మోదీ కాస్తారా? -వైసీపీ ఎంపీ రఘురామ తాజా

జగన్ ప్రభంజనం..
ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లున్నాయి. అందులో మూడు సీట్లను ఎన్నికలను ముందే వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా, ఇవాళ 47 స్థానాలకు కౌంటింగ్ జరిగింది. తుతి ఫలాతాలు కలిపి, వైసీపీ మొత్తం 47 డివిజన్లను గెలుచుకోగా, టీడీపీ కేవలం 3 డివిజన్లలోనే సత్తా చాటుకుంది. సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు జై కొట్టారని వైసీపీ నేతలు చెప్పారు.
షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్

చంద్రబాబు 3, పవన్-సోముకు 0
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల సినారియో ప్రకారం ఏలూరు కార్పొరేషన్ లో వైసీపీ గెలుపు ఊహించిందే అయినప్పటికీ, టీడీపీ అంతో ఇంతో పోటీ ఇస్తుందని, గుంటూరు, విశాఖపట్నం మాదిరిగా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ చివరికి 3 సీట్లతోనే టీడీపీ సరిపెట్టుకుంది. 28, 37, 47వ డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక పవన్ కల్యాణ్, సోము వీర్రాజులు ఉధృతంగా ప్రచారం చేసినా, జనసేన-బీజేపీ కూటమికి ఒక్క సీటూ దక్కలేదు. కాగా,

మేయర్ గా మళ్లీ నూర్జహాన్..
రిజర్వేషన్ ప్రకారం ఏలూరు మేయర్ పదవిని ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. వైసీపీ తన మేయర్ అభ్యర్థిగా మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పేరును ఖరారు చేసింది. 50 డివిజన్ నుంచి నూర్జహాన్ బేగం విజయం సాధించారు. ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యతతో ఆమె గెలుపొందారు. కాగా, మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన వారిని సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగు రు డిప్యూటీ మేయర్లను కూడా వైసీపీ ప్రకటించింది.ఈ నెల 30న ఏలూరు మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. డివిజన్ల వారీగా ఏలూరు కార్పొరేటర్లుగా విజేతలైనవారి జాబితా ఇదే..
1వ డివిజన్ ఎ.రాధిక (వైసీపీ) విజయం
2వ డివిజన్ : వైసీపీ అభ్యర్ధి నరసింహారావు 787 ఓట్ల మెజార్టీతో విజయం.
3వ డివిజన్: బి.అఖిల (వైసీపీ) విజయం
4వ డివిజన్: డింపుల్ (వైసీపీ) 744 ఓట్ల మెజార్టీతో గెలుపు
5వ డివిజన్: జయకర్ (వైసీపీ) 865 ఓట్ల మెజార్టీతో విజయం
6వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ 1753 ఓట్ల తేడాతో గెలుపు
7వ డివిజన్: పి.శ్రీదేవి (వైసీపీ) 822 ఓట్ల తేడాతో విజయం
8వ డివిజన్: వి.ప్రవీణ్ (వైసీపీ) 28 ఓట్ల మెజారిటీతో గెలుపు
9వ డివిజన్: జి.శ్రీనివాస్ (వైసీపీ) 534 ఓట్ల తేడాతో గెలుపు
10వ డివిజన్ లో పైడి భీమేశ్వరరావు(వైసీపీ) 812 ఓట్లతో గెలుపు
11వ డివిజన్: కోయ జయగంగ (వైసీపీ) 377 ఓట్ల మెజార్టీతో విజయం
12వ డివిజన్: కర్రి శ్రీను (వైసీపీ) 468 ఓట్ల తేడాతో విజయం
13వ డివిజన్: అన్నపూర్ణ (వైసీపీ) 13339 ఓట్ల మెజార్టీతో గెలుపు
14వ డివిజన్: అనూష (వైసీపీ) 711 ఓట్ల తేడాతో గెలుపు
15వ డివిజన్: రామ్మోహన్రావు (వైసీపీ) 83 ఓట్ల తేడాతో గెలుపు
16వ డివిజన్: వైసీపీ అభ్యర్థి గెలుపు
17వ డివిజన్: టి.పద్మ (వైసీపీ) 755 ఓట్ల తేడాతో గెలుపు
18వ డివిజన్: కేదారేశ్వరి(వైసీపీ 1012 ఓట్ల మెజార్టీతో విజయం
19వ డివిజన్: వై.నాగబాబు (వైసీపీ) 1012 ఓట్ల మెజార్టీతో గెలుపు
20వ డివిజన్: ఆదిలక్ష్మి(వైసీపీ) 4,320 ఓట్ల మెజార్టీతో గెలుపు
21వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి ఎ.భారతి 835 ఓట్ల మెజార్టీతో విజయం
22వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి సుధీర్‌బాబు గెలుపు
23వ డివిజన్: కె.సాంబ (వైసీపీ) 1823 ఓట్ల మెజార్టీతో గెలుపు
24వ డివిజన్: మాధురి నిర్మల (వైసీపీ) 853 ఓట్లతేడాతో గెలుపు
25వ డివిజన్: గుడుపూడి శ్రీను (వైసీపీ) గెలుపు
26వ డివిజన్: అద్దంకి హరిబాబు(వైసీపీ) 1,111 ఓట్ల మెజార్టీతో గెలుపు
27వ డివిజన్: బి.విజయ్ కుమార్ (వైసీపీ 687 ఓట్ల తేడాతో గెలుపు
28వ డివిజన్: టీడీపీ అభ్యర్థి గెలుపు
29వ డివిజన్: పి.భవానీ(వైసీపీ) 1267 ఓట్ల తేడాతో విజయం
30వ డివిజన్: పి. ఉమామహేశ్వరరావు(వైసీపీ) 38 ఓట్ల మెజార్టీతో విజయం
31వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి లక్ష్మణ్ 471 ఓట్ల తేడాతో గెలుపు
32వ డివిజన్: సునీత రత్నకుమారి (వైసీపీ) గెలుపు
33వ డివిజన్: రామ్మోహన్రావు (వైసీపీ) 88 ఓట్ల మెజార్టీతో విజయం
34వ డివిజన్: వై.సుమన్(వైసీపీ) 684 ఓట్ల తేడాతో గెలుపు
35వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి జి.శ్రీనివాస్ 724 ఓట్ల తేడాతో గెలుపు
36వ డివిజన్: హేమ సుందర్ (వైసీపీ) గెలుపు
37వ డివిజన్: టీడీపీ అభ్యర్థి విజయం
38వ డివిజన్: హేమా మాధురి(వైసీపీ) 261 ఓట్ల మెజార్టీతో గెలుపు
39వ డివిజన్ లో వైసీపీ క్యాండిడేట్ కె. జ్యోతి 799 ఓట్ల తేడాతో గెలుపు
40వ డివిజన్: టి.నాగలక్ష్మి (వైసీపీ) 758 ఓట్ల తేడాతో గెలుపు
41వ డివిజన్: కల్యాణి (వైసీపీ) 547 ఓట్ల మెజార్టీతో విజయం
42వ డివిజన్: ఏ. సత్యవతి (వైసీపీ) 79 ఓట్ల మెజార్టీతో గెలుపు
43వ డివిజన్: జె.రాజేశ్వరి (వైసీపీ) గెలుపు
44వ డివిజన్: పి.రామదాస్(వైసీపీ) 410 ఓట్ల తేడాతో గెలుపు
45వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి ముఖర్జీ 1058 ఓట్ల తేడాతో గెలుపు
46వ డివిజన్: ప్యారీ బేగం(వైసీపీ) 1,232 ఓట్ల మెజార్టీతో గెలుపు
47వ డివిజన్: టీడీపీ అభ్యర్థి విజయం
48వ డివిజన్: స్వాతి శ్రీదేవి (వైసీపీ) 483 ఓట్ల తేడాతో విజయం
49వ డివిజన్: డి.శ్రీనివాసరావు (వైసీపీ) 1271 ఓట్ల తేడాతో గెలుపు
50వ డివిజన్: షేక్ నూర్జహాన్ (వైసీపీ) 1495 ఓట్ల మెజార్టీతో గెలుపు