వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనిషి పెరిగాడు కానీ బుర్ర , బుద్ధి పెరగలేదు ..అచ్చెన్నాయుడుని వాయించేసిన సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Budget 2019: అచ్చెన్నాయుడుని వాయించేసిన సీఎం జగన్ | Jagan Strong Punch To Achennayudu In Assembly

ఏపీ అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడిపై విరుచుకుపడ్డారు సీఎం జగన్ . అసెంబ్లీ వేదికగా నోరు జారి మాట్లాడారు. తాను మాట్లాడుతున్న సమయంలో అడ్డువస్తున్నారని ఆయనను అందరి ముందు ఎడాపెడా వాయించేశారు. చాలా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారు . మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మనిషి ఆ సైజులో ఉన్నాడు కానీ బుర్ర, బుద్ధి పెరగలేదు అంటూ సీఎం జగన్టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ప్రసంగించే సమయంలో అడ్డు తగలడంపై ఆయన క్లాస్ పీకారు.

సీఎం జగన్ మాట్లాడే సమయంలో అడ్డు తగిలిన అచ్సెన్న.. జగన్ సీరియస్

సీఎం జగన్ మాట్లాడే సమయంలో అడ్డు తగిలిన అచ్సెన్న.. జగన్ సీరియస్

ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం ఏమి చేసింది..అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం ఏం చేసింది..ఏం చేయబోతోందనే దానిపై సీఎం జగన్ వివరిస్తున్నారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా లెక్కలు చెప్పారు సీఎం జగన్. ఇక ఈ సమయంలోనే జోక్యం చేసుకున్న అచ్చెన్నాయుడు అధ్యక్షా , అధ్యక్షా అంటూ ఏదో మాట్లాడబోయారు. దీంతో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ..వేలెత్తి చూపెట్టారు. దీనిని స్పీకర్ తిరస్కరించారు. తర్వాత మాట్లాడాలని చెప్పారు. అయినా అచ్చెన్నాయుడు వినిపించుకోలేదు. దీనిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సహనం కోల్పోయిన జగన్ మాజీ మంత్రి అని కూడా చూడకుండా తిట్టి పోశారు.

వయస్సు పెరుగుతోంది కానీ బుద్ధి మాత్రం పెరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తిన సీఎం

వయస్సు పెరుగుతోంది కానీ బుద్ధి మాత్రం పెరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తిన సీఎం

ఏం మాట్లాడుతున్నాడో..ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు అంటూ అచ్చెన్నాయుడుని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ పక్కన మాట్లాడుతున్నాను..ఆయనకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడొచ్చు..ఎవరూ అడ్డుకోరు కదా .. సభాధ్యక్షుడు మాట్లాడుతుంటే..పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ అడగడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాల కింద ఏ సంప్రాదాయం పాటించారో..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు కదా .. ఇక మీరు మారరా..అంటూ ప్రశ్నించారు సీఎం జగన్ . వయస్సు పెరుగుతోంది కానీ బుద్ధి మాత్రం పెరగడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు .

ఎదిగే కొద్ది ఒదగి ఉండాలంటూ క్లాస్ .. సీఎం కుర్చీకి అయినా గౌరవం ఇవ్వండన్న జగన్

ఎదిగే కొద్ది ఒదగి ఉండాలంటూ క్లాస్ .. సీఎం కుర్చీకి అయినా గౌరవం ఇవ్వండన్న జగన్

ఎదిగే కొద్ది ఒదగాలి అంటూ ప్రతిపక్షానికి సూచించారు సీఎం జగన్. అది వయసులోనే కాదు పొజిషన్ లోనూ అన్నింటిలోనూ ఒదిగి ఉండటం నేర్చుకోవాలని సూచించారు. ఒక ముఖ్యమంత్రి సభానాయకుడు హోదాలో మాట్లాడుతుంటే కనీసం ఆ సీఎం కుర్చీకి అయినా గౌరవం ఇవ్వాలనే ఆలోచన కూడా రావడం లేదని కనీసం అదైనా నేర్చుకోండంటూ జగన్ మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు సూచించారు. అంతకు ముందు అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్ని నడులున్నాయో, ఎన్ని ప్రాజెక్ట్ లు ఉన్నాయో, అవి ఎలా ఏపీలోకి వస్తున్నాయో సీఎం జగన్ ద్వారా తెలుసుకునే దౌర్భాగ్యం ఆకు పట్టిందని అసహనం వ్యక్తం చేశారు.

English summary
AP CM YS Jagan has slipped his tongue and made body-shaming comments on Tekkali TDP MLA Atcchannaidu. While speaking about the measures, the government will take for farmers in this monsoon season, Jagan lost his cool when he was interrupted by Atcchannaidu."Aa Manishi Aa Sizelo Unnadu Kani Burra Matram Peragaledu," said Jagan directly hitting at the TDP leader. Ministers and MLAs of YSRCP erupted in laughter with Jagan's comments.Criticizing further, Jagan said, "When the leader of the house is talking, I don't know why they are continuously interrupting. He can talk when he gets an opportunity and he can't just disturb my speech with 'Point Of Order' rule. TDP did the same when they were in power and I don't think they will ever change."Then Jagan lectured the assembly that everyone should learn to be humble as they grow up instead of getting carried away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X