వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాకు జగన్ మార్క్ షాక్ .. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ఆపండి ; ఎన్జీటీలో అఫిడవిట్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ జల వివాదాలను మరింత పెంచుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టడంతో మొదలైన జల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. గతంలోనూ నదీజలాల వాటాల పంపకాల్లో వివాదాలు ఉన్నప్పటికీ ఇంతగా రచ్చ జరగలేదు. కానీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ ఉధృతంగా కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వరుస ఫిర్యాదులతో జలవివాదాలు పరిష్కారం సాధ్యమేనా అన్న అనుమానం కలుగుతుంది. చాలా కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వాటర్ వార్ పరిష్కారం కాకపోవటంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చెక్ పెట్టడానికి కేంద్రం రంగంలోకి దిగినా తెలుగు రాష్ట్రాల తీరు ఏ మాత్రం మారలేదు.

వృధా జలాలు తెలంగాణా కోటాలోనే ; శ్రీశైలం విద్యుదుత్పత్తిపై కృష్ణా బోర్డుకు ఏపీ మరో లేఖ !!వృధా జలాలు తెలంగాణా కోటాలోనే ; శ్రీశైలం విద్యుదుత్పత్తిపై కృష్ణా బోర్డుకు ఏపీ మరో లేఖ !!

ఏపీ ప్రభుత్వ ప్రాజెక్ట్ లపై తెలంగాణా ఫిర్యాదులు .. మొన్న తెలుగు గంగ, వెలిగొండ

ఏపీ ప్రభుత్వ ప్రాజెక్ట్ లపై తెలంగాణా ఫిర్యాదులు .. మొన్న తెలుగు గంగ, వెలిగొండ

మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టంలో ఉల్లంఘించిందని అనుమతి లేకుండా తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. వెంటనే ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేసేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కోరడంతో కృష్ణానది యాజమాన్య బోర్డు వెలిగొండ ప్రాజెక్టు తో పాటు తెలుగుగంగ ప్రాజెక్టు విస్తరణ పనులకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లను తక్షణమే కృష్ణా బోర్డు పంపించాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.

గతంలో హంద్రీ నీవా ప్రాజెక్ట్ నీటి వాడకంపై అభ్యంతరం

గతంలో హంద్రీ నీవా ప్రాజెక్ట్ నీటి వాడకంపై అభ్యంతరం


ఇక గతంలోనూ హంద్రీనీవా ప్రాజెక్టు నీటి వాడకం పై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది నుండి బేసిన్ నుండి నీటిని ఆవలకు తరలించటానికి అనుమతి లేదని బచావత్ ట్రిబ్యునల్ పేర్కొందని తెలిపింది. నీటిని ఆ విధంగా తరలించడం వల్ల బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతున్నాయని కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు ఏపీ చేపట్టిన అనేక ప్రాజెక్ట్ లపై తెలంగాణా నిత్యం ఫిర్యాదులు చేస్తూనే ఉంది . ఇక తెలంగాణా తీరుతో ఏపీ కూడా తామేమీ తక్కువ కాదన్నట్టు తెలంగాణా ప్రాజెక్ట్ లను టార్గెట్ చేస్తుంది.

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కూడా ఏపీ మెలికెలు

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కూడా ఏపీ మెలికెలు

ఇక ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెలికెలు పెడుతూనే ఉంది. తాజాగా తెలంగాణాకు జగన్ మార్క్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అక్రమమని, అనుమతుల్లేని ఆ ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ కు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీ ని కోరింది.

 రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం

కృష్ణా జల వివాదాలకు సంబంధించిన ట్రిబ్యునల్ 1, 2 లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు ఎలాంటి కేటాయింపు లేదని, పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో కూడా లేదని జాతీయ హరిత ట్రిబ్యునల్ పేర్కొంది. దీనివల్ల రెండు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం ఉంటుందంటూ ఎన్జీటీ ఎదుట రెండు అఫిడవిట్లను మంగళవారం దాఖలు చేసింది. చట్టాలను ఉల్లంఘించి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు కట్టే హక్కు లేదని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ దృష్టికి తీసుకు వెళ్ళింది.

తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని అఫిడవిట్

తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని అఫిడవిట్

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని దీనివల్ల రెండు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం పడుతుందని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఆంధ్రప్రదేశ్లోని తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ మినహా మిగిలిన ఏ ప్రాజెక్ట్ అయినా కొత్తదే అని పేర్కొంది.

విచారణ ముగిసే దాకా పనులు ఆపాలన్న ఏపీ

విచారణ ముగిసే దాకా పనులు ఆపాలన్న ఏపీ

తెలంగాణ సాంకేతిక సలహా కమిటీ నివేదిక లోనూ కృష్ణా ట్రిబ్యునల్ 2 ఎదుట సమర్పించిన అఫిడవిట్ లోనూ పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుగానే ఉందని పేర్కొన్నారు. 12.3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించడానికి శ్రీశైలం రిజర్వాయర్ నుండి 90 టిఎంసిల నీటిని ఎత్తిపోయడానికి పాలమూరు ప్రాజెక్టును చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారని అప్పటికే కొన్ని పనులను ఆపరేట్ చేసి ఈ ప్రాజెక్టు ఆపరేషన్ లో ఉందని చెప్పే ప్రమాదం ఉందని ఎన్జీటీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రాజెక్టు పై విచారణ ముగిసేదాకా ప్రాజెక్టును ప్రారంభించకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Recommended Video

Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
 రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెగని పంచాయితీ .. కేంద్రం గెజిట్ ఇచ్చినా మారని తీరు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెగని పంచాయితీ .. కేంద్రం గెజిట్ ఇచ్చినా మారని తీరు

ఇక తాజా పరిణామాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అక్రమ ప్రాజెక్టుల వ్యవహారాన్ని, పరిమితికి మించిన జల వాడకాన్ని, రెండు తెలుగు రాష్ట్రాలు చేస్తున్న జల చౌర్యాన్ని, అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరును స్పష్టంగా అర్థం అయ్యేలా చేస్తుంది. ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ జారీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని జల వివాదాలను, నీటి కేటాయింపులను తమ పరిధిలోకి తెచ్చుకున్నప్పటికీ మారని తెలుగు రాష్ట్రాల తీరు ముందు ముందు ఇలాంటి పరిణామాలకు కారణం అవుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

English summary
Jagan Mark shock to Telangana. The AP govt has appealed to the National Green Tribunal submitted affidavit to stop the Palamuru Rangareddy Upliftment Scheme being carried out by the Telangana govt as illegal and unauthorized project work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X