• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌ మరో మాస్టర్‌ ప్లాన్‌- ఒకేసారి బీజేపీ, టీడీపీకీ చెక్‌- కేంద్ర పథకాల్లో అవినీతిపై కన్ను..

|

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సీబీఐ పేరు వినిపిస్తోంది. తాజాగా అంతర్వేది ఘటనలో విపక్షాలు కోరిన విధంగా సీబీఐ విచారణకు ఆదేశించిన సీఎం జగన్‌ .. అంతటితో ఆగకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవినీతి వ్యవహారాలను కూడా కేంద్ర దర్యాప్తు సంస్ధకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు తనయుడు లోకేష్‌ టార్గెట్‌గా ఫైబర్ గ్రిడ్‌ స్కాంను తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కారు.. చంద్రన్న కానుకల్లో అవినీతి పేరుతో చంద్రబాబునూ టార్గెట్ చేస్తోంది. ఈ రెండు అంశాలను సీబీఐకి అప్పగిస్తూ కేబినెట్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. తాజాగా కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మరిన్ని అంశాల్లో సీబీఐ దర్యాప్తు కోరబోతోంది.

రఘురామరాజుకు జగన్ బిగ్ షాక్‌- కీలక భేటీకి దూరం పెట్టిన వైనం...

 టీడీపీని వదల బొమ్మాళీ...

టీడీపీని వదల బొమ్మాళీ...

ఒకప్పుడు కాంగ్రెస్‌తో కలిసి అక్రమాస్తుల పేరుతో సీబీఐ విచారణ వేసి తనను జైలుకు పంపిన టీడీపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు జగన్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రన్న కానుక, ఫైబర్‌ గ్రిడ్‌ అవినీతిపై సీబీఐ విచారణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటిపై సాధ్యమైనంత త్వరగా సీబీఐ దర్యాప్తు జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం జగన్‌ తమ ఎంపీలను ఆదేశించారు. వీలైతే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునేలా వైసీపీ ఎంపీలు లాబీయింగ్‌కు సిద్దమవుతున్నారు. ఈ రెండు కేసుల్లో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తే చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరికీ చిక్కులు తప్పవు. అయితే సీఐడీ విచారణతో సరిపోయే ఈ కేసుల్లో సీబీఐ విచారణకు కేంద్రం చర్యలు తీసుకుంటుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్ధితి.

 కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్లాన్..

కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్లాన్..

చంద్రన్న కానుక, ఫైబర్‌ గ్రిడ్‌ అవినీతిపై తాము కోరిన విధంగా కేంద్రం సీబీఐ విచారణ చేపట్టకపోతే తదుపరి వ్యూహాన్ని కూడా జగన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా టీడీపీతో పాటు బీజేపీని కూడా ఇరికించేలా ఈ వ్యూహం ఉండబోతోందని చెబుతున్నారు. టీడీపీ హయాంలో విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రం అన్న కారణంతో బీజేపీ పలు కేంద్ర ప్రాయోజిత పథకాలను ఏపీకి కేటాయించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని గతంలోనే బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకుని, కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక కూడా జోడించి సీబీఐ విచారణ కోరేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే గతంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి బీజేపీ సీబీఐ విచారణకు సిద్దపడుతుందా లేక లైట్‌ తీసుకుని వైసీపీకి మరో అస్త్రం ఇస్తుందా చూడాల్సి ఉంది. బీజేపీ వీటిపై సీబీఐ విచారణ చేయించకపోతే టీడీపీతో కుమ్మక్కైందన్న ఆరోపణలు చేసేందుకు వైసీపీకి అవకాశం లభిస్తుంది.

 ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహం..

ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహం..

ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు తనను ఏ సీబీఐ కేసులైతే అడ్డు పెట్టుకుని ఇంత కాలం తీవ్ర స్థాయిలో విమ‌ర్శిస్తున్నారో ... ఇప్పుడు అవే అస్త్రాల‌ను వాళ్ల‌పై ప్ర‌యోగించేందుకు సీఎం జగన్ సిద్ధ‌మైన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అవకతవకలపై విచారించి నివేదిక సిద్ధం చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిన సీఎం.. ఐదుగురు మంత్రులు రాజేంద్రనాథ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతమ్ రెడ్డి, కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మన్మోహన్‌సింగ్‌

కమిటి ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలోనే సీబీఐ విచారణ చేపట్టాలని లేఖ సైతం రాయబోతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ప్రజాధనం వృధా కావడంతో పాటు సంక్షేమ పథకాలు అందించే క్రమంలో, ప్రాజెక్టు కాంట్రాక్టులు, లాంటి అంశాలలో జరిగిన అవినీతిపై

సబ్ కమిటి ఇప్పటికే నివేదికను సీఎంకు సమర్పించింది. ఇందులో అంశాలపై త్వరలోనే జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని జగన్‌ కోరబోతున్నారు.

 సీబీఐకి అప్పగించే అంశాలివేనా..

సీబీఐకి అప్పగించే అంశాలివేనా..

సీబీఐకి అప్పగించే కేసుల్లో ప్రధానంగా రాజధానిలో కేంద్రం చేసిన సాయం ఖర్చు చేయడంలో అవినీతి, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, కరెంటు కొనుగోళ్లలో అవినీతి వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. కరెంట్ కొనుగోళ్ల విషయంలో.. కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్ల కన్నా అధిక రేట్లకు కొనుగోలు చేయడం,సోలార్, విండ్ కంపెనీల మధ్య భారీ అవకతవకలు జరిగాయని జగన్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే

ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల విచారణలో వచ్చిన నివేదిక ఆధారంగానే త్వరలోనే సీబీఐకి అప్పగించబోతుంది. వీటిలో విద్యుత్ కొనుగోళ్లు,ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులలో ప్రభుత్వ ఖజానాకు 4వేళా కోట్లు దుర్వినియోగం అవడంతో పాటు నష్టం జరిగిందని, ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రాజకీయంగా విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఈ రెండు ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలు అయ్యేవి కావడంతో సీబీఐకి అప్పగించాలని సీఎం కోరుతున్నారు.

  Rains In AP : AP లో భారీ వర్షాలు.. మరో 3 రోజులు ఇంతే ! || Oneindia Telugu
   టీడీపీతో పాటు బీజేపీకి చెక్‌...

  టీడీపీతో పాటు బీజేపీకి చెక్‌...

  గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై అకస్మాత్తుగా సీబీఐ విచారణకు జగన్ సర్కార్ సిద్ధమవడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో జగన్ సర్కార్ ఏర్పాటు అయిన నాటి నుంచి గత ప్రభుత్వ పరిధిలో జరిగిన అన్ని అంశాలలో అవినీతి అనే అంశాలను పదే పదే ప్రస్తావిస్తూ ఉండటం వాటిని జగన్ సర్కార్ నిరూపించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వంపై రాజకీయ కక్ష అనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. అదే సమయంలో సరైన ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలకు టీడీపీ సవాల్ విసురుతూ ఉండటంతో పాటు బీజేపీ సైతం ఇదే అంశాన్నీ ప్రస్తావిస్తూ ఉండటంతో ఇరు పక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని జగన్‌ భావిస్తున్నారు. ఆయా అంశాల్లో కేంద్రం సీబీఐ విచారణకు సిద్ధం కాకపోతే టీడీపీ, బీజేపీ కుమ్మక్కు అయ్యాయన్న అజెండాను తెరపైకి తెచ్చేందుకు సైతం వైసీపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

  English summary
  andhra pradesh chief minister ys jagan mohan reddy now corners tdp and bjp in same time with handovering tdp regime corruption in centrally sponsored schemes to cbi.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X