• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్,ఎమ్మెల్యే ఆర్కే.వైసిపి మాఫియాను దింపారు:బుద్ధా సంచలనం,ఇలా ఎందుకు చేస్తున్నారు?:కాంగ్రెస్

|

అమరావతి:వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి‌, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దుష్టగ్రహాలు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

సోమవారం మధ్యాహ్నం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కేపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతోందని వీరిద్దరూ ఒక జాతీయ ఛానల్‌తో కుమ్మక్కై, తద్వారా తప్పుడు సర్వేలు నిర్వహించి వైసీపీకి ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించాలని ప్రయత్నం చేస్తున్నారని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆర్కే శాసన సభ సమావేశాలు సజావుగా జరుగుతుంటే భరించలేకపోతున్నారని దుయ్యబట్టారు.

Jagan,MLA RK dumped YCP mafia in Vijayawada:Buddha Venkanna Sensation

అందుకే జగన్ తో సంప్రదించి ఆళ్ల రామకృష్ణారెడ్డి అసెంబ్లీ ముట్టడి అనే కుట్రకు తెర లేపారని బుద్ధా వెంకన్న వెల్లడించారు. ఈ కుట్ర ప్రకారం రాష్ట్రంలో ఉన్న వైసీపీ మాఫియా గ్యాంగ్‌ లను మారువేషాలతో విజయవాడ హోటళ్లలో దింపి నాటకాలు ఆడుతున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ మాఫియా ముఠాలు ప్రస్తుతం విజయవాడ హోటల్స్ లో ఉన్నాయన్నారు. తునిలో రైళ్లు తగులబెట్టారు...ఇక్కడ ఏమి చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు.

వైసీపీ వాళ్ళు అసెంబ్లీ ,పార్లమెంట్ లకు వెళ్ళరని ఎద్దేవా చేశారు. అందువల్లే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషిస్తున్నామన్నారు.జగన్ ,బొత్స ,భూమన అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.జగన్ అతని బ్యాచ్ దొనకొండ లో వేల ఎకరాలు భూములు కొన్నారని...రాజధాని దొనకొండ లో వస్తుందని జగన్ రైతుల్ని నమ్మించారని విమర్శించారు.

అమరావతి పేరుతో ఏపీ ప్రభుత్వం అవినీతి, అరాచకాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ నేత రామచంద్రయ్య మండిపడ్డారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని...ప్రతి పథకంలోనూ అవినీతి, అక్రమాలే జరుగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. అప్పులు తేకుండా రాజధాని నిర్మిస్తానని చెప్పిన టిడిపి ప్రభుత్వం ఇప్పుడు బాండ్ల రూపంలో ఎందుకు అప్పులు తెస్తున్నారో తెలియడం లేదన్నారు.

మీ హయాంలో తెచ్చిన అప్పులు...పథకాల అమలు కోసం చేసిన ఖర్చులపై టిడిపి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తాయనే ఆర్టీఐ కమిషన్‌ను టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని ఆయన ఆరోపించారు.

English summary
Amaravathi: TDP MLC Buddha Venkanna has described that the YCP Chief Jagan and Mangalagiri MLA RK are the evils of the state of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X