వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ కొత్త టీం రెడీ : డీజీగా స‌వాంగ్‌..ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ : సీఎంఓ అధికారులు సిద్దం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా బాద్య‌త‌లు చేప‌డుతున్న జ‌గ‌న్‌..త‌న పాల‌నా ప‌ర‌మైన టీంను సిద్దం చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే కీల‌క‌మైన సీఎస్‌..డీజీపీ పోస్టుల్లో ఎవ‌రిని నియ‌మించాలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్ర‌స్తుత సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. అదే విధంగా కొత్త డీజీపీగా గౌతం స‌వాంగ్ పేరు ఖ‌రారైంది. ఇక‌, కీల‌క‌మైన ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ ర‌వీంద్ర నియ‌మితులు కానున్నారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారుల‌ను జ‌గ‌న్ ఎంపిక చేసారు.

వైఎస్ జ‌గ‌న్ వెంట సీఎస్‌! చంద్ర‌బాబు హ‌యాంలో ఇలా ఎప్పుడూ చూడ‌లేదంటోన్న జ‌నంవైఎస్ జ‌గ‌న్ వెంట సీఎస్‌! చంద్ర‌బాబు హ‌యాంలో ఇలా ఎప్పుడూ చూడ‌లేదంటోన్న జ‌నం

సీఎస్‌గా స‌వాంగ్‌...నిఘా బాస్‌గా స్టీఫెన్‌

సీఎస్‌గా స‌వాంగ్‌...నిఘా బాస్‌గా స్టీఫెన్‌

ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే స‌మ‌యానికి జ‌గ‌న్ త‌న కోర్ టీంను సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఏపీ ప్ర‌భుత్వ నూత‌న పోలీస్ బాస్‌గా ప్ర‌స్తుతం ఉన్న డీజీపీ ఠాకూర్ స్థానంలో గౌతం స‌వాంగ్ పేరు ఖ‌రారు చేసారు. ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ గా ఉన్న స‌వాంగ్ ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 30వ తేదీ ఉద‌యానికి ఆయ‌న‌కు అధికారిక ఉత్త‌ర్వులు అంద‌నున్నాయి. అదే విధంగా ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ఇంట‌లిజెన్స్ చీఫ్ బాధ్య‌త‌లు ఎవ‌రికి ఇవ్వాల‌నే దాని పై త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతోంది. తొలుత సీతారామంజ‌నేయులు, రాజేంద్ర‌నాధ్ రెడ్డి, విశ్వ‌జిత్ పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. అయితే, అనూహ్యంగా ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న స్టేఫెన్ ర‌వీంద్రను ఏపీ ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా నియ‌మించాల‌న నిర్ణ‌యించారు. ఆయ‌న గ‌తంలో రాయ‌ల‌సీమ‌లో సుదీర్ఘ కాలం ప‌ని చేసిన అనుభ‌వంతో పాటుగా వైయ‌స్సార్‌కు భ‌ద్ర‌తాధికారిగా ప‌ని చేసారు.

సీఎస్‌గా ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం..సీఎంఓ బృందం సిద్దం..

సీఎస్‌గా ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం..సీఎంఓ బృందం సిద్దం..

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం కొన‌సాగ‌నున్నారు. ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన ఎల్వీని కొన‌సాగించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఇక‌, ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ఎవ‌రెవ‌రు ఉండాల‌నే దాని పైనా నిర్ణ‌యం జ‌రిగింది. ముఖ్య‌మంత్రి కార్యాల‌య ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పీవీ ర‌మేష్‌, అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణ‌బాబు, గిరిజా శంక‌ర్‌ను తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఆదిత్య నాధ్ దాస్, జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ధ‌ర్మారెడ్డిలు సైతం జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క స్థానాల్లో ఉండ‌నున్నారు. వైస్సార్ హ‌యాంలో సీఎం పేషీల కీల‌కంగా ప‌ని చేసిన భాస్క‌ర శ‌ర్మ‌ను సైతం ప్ర‌త్యేక పోస్టులో కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. ఆయ‌న ఇప్ప‌టికే రిటైర్ కావ‌టంతో..ఓఎస్డీగా అద‌న‌పు పోస్టులో కొన‌సాగించ‌నున్నారు. కీల‌క‌మైన టీటీడీ ఈవో..జేఈవోగా కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. ఈ నెల‌30 లోగానే వీట‌న్నింటికి సంబంధించి అధికారిక ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

స‌ల‌హాదారుల‌కు ప్రాధాన్యం..

స‌ల‌హాదారుల‌కు ప్రాధాన్యం..

ఇక‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా ఇప్ప‌టికే అజ‌య్ క‌ళ్లాం పేరును జ‌గ‌న్ ఖ‌రారు చేసారు. ఆయ‌న ఇప్ప‌టికే కేబినెట్ రూప‌క‌ల్ప‌న‌తో పాటుగా.. ప్ర‌భుత్వంలో ఎవ‌రు ఏ శాఖ బాధ్య‌త‌లు తీసుకోవాల‌నే అంశం పైన క‌స‌ర‌త్తు చేస్తున్నారు. త్వ‌ర‌లో ఆయ‌న‌తో పాట‌గా శామ్యూల్, ప్ర‌భాక‌ర రెడ్డి లాంటి వారు సైతం సేవ‌లు అందిచేందుకు సిద్దంగా ఉన్నార‌ని చెబుతున్నారు. దీంతో..ముందుగా తాను ప్రమాణ స్వీకారం చేసే స‌మాయానికి త‌న కార్యాల‌య అధికారులు .. స‌ల‌హాదారుల‌ను నియ‌మించాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యారు.

English summary
AP Designated CM Jagan team ready to take charge. Swawang as DGP and Stephen Ravindra as Intelligence D.g and LV Subramanyam as CS and four officers. Before Jagan oath these officers may take charge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X