వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అపరిచితుడు, రాజీనామాకు రెఢీ, రామసుబ్బారెడ్డిపై ఆది సంచలన వ్యాఖ్యలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప: వైసీపీ చీఫ్ జగన్ అపరిచితుడుగా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి తనకు మధ్య విబేధాలు లేవన్నారు. కడప జిల్లాలో వైఎస్ రాజకీయ ఆధిపత్యాన్ని దెబ్బతీసినందుకు తనపై జగన్‌కు కోపం ఉందన్నారు. ఈ కారణంగానే జగన్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. 2019 ఎన్నికల్లో తాను టిడిపిలోనే ఉంటానని, రామసుబ్బారెడ్డి కూడ టిడిపిలో కొనసాగుతారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

రామసుబ్బారెడ్డి Vs ఆది: అయిపోలేదు, చంద్రబాబుకు తాజా తలనొప్పులురామసుబ్బారెడ్డి Vs ఆది: అయిపోలేదు, చంద్రబాబుకు తాజా తలనొప్పులు

కడప జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అనేక అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి గుర్తుచేశారు. నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతో తమ అభివృద్ది పనులను ప్రజలు విశ్వసిస్తున్నారని తేలిందన్నారు.

రెండేళ్ళు జైల్లో ఉన్నా, పార్టీ మారే ఆలోచన రాలేదు: రామసుబ్బారెడ్డిరెండేళ్ళు జైల్లో ఉన్నా, పార్టీ మారే ఆలోచన రాలేదు: రామసుబ్బారెడ్డి

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను ప్రతి పల్లెల్లో జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టు మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. పార్టీలో తనకు ఇతరులకు మధ్య విబేధాలు లేవన్నారు.

ఆది ఎఫెక్ట్‌తో రామసుబ్బారెడ్డికి, బైపోల్‌తో ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవులుఆది ఎఫెక్ట్‌తో రామసుబ్బారెడ్డికి, బైపోల్‌తో ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవులు

తన సోదరులకు తనకు మధ్య విబేధాలు లేవన్నారు. అందరిని కలుపుకొని పోతున్నట్టు ఆయన చెప్పారు. పలు అంశాలపై మంత్రి ఆదినారాయణరెడ్డి తెలుగుటివి చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు.

జగన్ అపరిచితుడు

జగన్ అపరిచితుడు


జగన్ అపరిచితుడుగా మాట్లాడుతున్నాడని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. తనకు అనుకూలంగా జగన్ మాట్లాడుతుంటారని ఆదినారాయణరెడ్డి చెప్పారు. అంతేకాదు గెలిస్తే తనవల్ల గెలిచినట్టు చెప్పుకొనే జగన్ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎందుకు ఓటమిపాలయ్యారో చెప్పాలని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. మంచిని తన ఖాతాలో వేసుకోవడం, చెడును ఇతర ఖాతాలోకి వేయడం జగన్‌కు మాత్రమే తెలుసునని చెప్పారు. జగన్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదన్నారు. ఒక రకంగా ఆయన అపరిచితుడని ఆదినారాయణరెడ్డి చెప్పారు.

కేశవరెడ్డిని కాపాడాల్సిన అవసరం లేదు

కేశవరెడ్డిని కాపాడాల్సిన అవసరం లేదు

తన వియ్యంకుడు కేశవరెడ్డిని కాపాడాల్సిన అవసరం తనకు లేదన్నారు మంత్రి ఆదినారాయణరెడ్డి. తన కూతురును కేశవరెడ్డి కొడుకును ఇచ్చి వివాహం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకొన్నారు. అయితే కేశవరెడ్డి జైల్లో ఉంటే ఇంతవరకు తాను ఆయనను కలువలేదన్నారు. జైలు రికార్డులను పరిశీలిస్తే అర్ధమౌతోందన్నారు. కేశవరెడ్డిని కాపాడాల్సిన అవసరం లేదన్నారు. కేశవరెడ్డి చేసిన ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులపై సిబిఐ విచారణ జరిపించాలని లేఖ రాస్తానని చెప్పారు.

రాజీనామా చేస్తానని చంద్రబాబునాయుడుకు చెప్పా

రాజీనామా చేస్తానని చంద్రబాబునాయుడుకు చెప్పా


టిడిపిలో చేరే ముందు రాజీనామా చేస్తాననే చంద్రబాబుకు చెప్పాను. కానీ, వైసీపీ ఖాళీ అవుతోందని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు చెప్పినట్టుగానే వైసీపీ ఖాళీ అవుతోందన్నారు. తాను రాజీనామా చేస్తే మిగిలినవారు కూడ రాజీనామా చేయాలని ఒత్తిడి పెరుగుతోందని బాబు చెప్పారు. రాజీనామాకు తాను సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో టిడిపి డిపాజిట్ కోల్పోయింది. కానీ, 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు విజయం సాధించారని, పార్టీ నడపడం ఎలాగో చంద్రబాబుకు తెలుసునని చెప్పారు.

 మేం ఓడిపోయి వైఎస్‌ఆర్‌ను గెలిపించాను

మేం ఓడిపోయి వైఎస్‌ఆర్‌ను గెలిపించాను


కడప పార్లమెంట్ స్థానం నుండి 1996 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేవలం నాలుగు వేల ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తాము జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఓడిపోయినట్టు చెప్పారు. తమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్‌కు 6 వేల మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీ కారణంగానే వైఎస్ఆర్ విజయం సాధించారు.

వ్యూహం తెలియదు

వ్యూహం తెలియదు


జగన్‌కు వ్యూహం తెలియదు. పార్టీని ఎలా నడపాలో తెలియదన్నారు. 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన ఐదు రోజులకే ఇడుపులపాయలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటుచేసి 2019లో తానే సిఎం అవుతానని జగన్ చెప్పారని ఆదినారాయణరెడ్డి గుర్తు చేశారు. అయితే సీఎం కావాలనే ఆశ తప్ప మరో ఉద్దేశ్యం లేదన్నారు. కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మెన్ కావాల్సిన బలమున్నా కానీ, వైసీపీ నిలుపుకోలేదన్నారు. 2014 ఎన్నికల్లో తల్లి విజయమ్మను గెలిపించలేదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాబాయిని గెలిపించలేదని చెప్పారు

 రామసుబ్బారెడ్డి పార్టీ విడిపోతారనుకోను

రామసుబ్బారెడ్డి పార్టీ విడిపోతారనుకోను

టిడిపిలో 16మాసాల పాటు తనకు అనుభవం ఉంది. టిడిపిలోనే పుట్టిన రామసుబ్బారెడ్డి పార్టీని వీడుతారని అనుకోను అని చెప్పారు. కానీ, పార్టీలో పాత, కొత్త అనేది లేదని ఆదినారాయణరెడ్డి చెప్పారు. తాను జగన్ పార్టీలోకి వెళ్ళే ప్రసక్తేలేదన్నారు. తన సోదరులతో కూడ తనకు విబేధాలు లేవని చెప్పారు ఆదినారాయణరెడ్డి.టిడిపి చంద్రబాబునాయుడు పార్టీ. తాను రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెబితే చంద్రబాబునాయుడు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.

English summary
I will write to conduct cbi enquiry on keshavareddy said Ap minister Adinarayana reddy. Jagan not a strategist said minister Adinarayana Reddy .Telugu channel interviewed minister Adinarayana reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X