విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ నేతలకు 21న విజయవాడ రావాలని ఆదేశించిన జగన్ .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

Recommended Video

వైసీపీ నేతలను... విజయవాడ రావాలని ఆదేశించిన జగన్ || Oneindia Telugu

వైసీపీ అధినేత జగన్ అమరావతి కేంద్రంగా తమ పార్టీ కార్యాకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక నుండి అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించాలని లోటస్ పాండ్ ఖాళీ చేసి మరీ అమరావతికి చేరుకున్నారు జగన్ . పూర్తి స్థాయిలో మకాం ఎన్నికల ఫలితాల తర్వాత మార్చనున్నట్టు సమాచారం. జగన్ అమరావతి రాకతో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక జగన్ నివాసంపై విమర్శలకు చెక్ పెట్టినట్టయ్యింది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించిన జగన్ వైసీపీ అభ్యర్థులు , ఇతర ముఖ్య నేతలు కౌంటింగ్ కు రెండు రోజుల ముందు విజయవాడ రావాలని ఆదేశించారు.

స్టాలిన్‌..కేసీఆర్ మ‌ధ్య‌లో జ‌గ‌న్ : చ‌ంద్ర‌బాబుకు చిర్రెత్తుతోంది : వేగంగా మారుతున్న స‌మీక‌ర‌ణాలుస్టాలిన్‌..కేసీఆర్ మ‌ధ్య‌లో జ‌గ‌న్ : చ‌ంద్ర‌బాబుకు చిర్రెత్తుతోంది : వేగంగా మారుతున్న స‌మీక‌ర‌ణాలు

జగన్ నివాసంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

జగన్ నివాసంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

అమరావతి ప్రాంతంలో తన నివాసాన్ని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న జగన్, ఫిబ్రవరి 27న గృహప్రవేశం చేశారు జగన్ . నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే వైసీపీ అధినేత జగన్ నివాసంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయం ఉంటాయి. కానీ జగన్ ఎక్కువగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉండటంపై పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు . ప్రత్యర్థి పార్టీల నేతలు జగన్ నివాసం టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.

 అమరావతి కేంద్రంగా వైసీపీ కార్యాకలాపాలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తరలింపు

అమరావతి కేంద్రంగా వైసీపీ కార్యాకలాపాలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తరలింపు

ఇక ఆ విమర్శలకు సమాధానం చెప్పటంతో పాటు ఏపీ కేంద్రంగా వైసీపీ కార్యాకలాపాలు నిర్వహించటం కోసం కేంద్ర కార్యాలయం శరవేగంగా సిద్ధం అవుతుంది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తరలింపు ప్రస్తుతం జరుగుతోంది . ఇక్కడున్న ఫర్నీచర్ ను ఉండవల్లికి చేరుస్తున్నారు. ఈ పనులు బుధవారం నాటికి పూర్తవుతాయని తెలుస్తుంది. ఇక ఆ తరువాత 16వ తేదీన పార్టీ కౌంటింగ్ ఏజంట్ల శిక్షణ ఉండవల్లిలోనే జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి .

21వ తేదీ నాటికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యనాయకులు విజయవాడ రావాలని జగన్ ఆదేశం

21వ తేదీ నాటికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యనాయకులు విజయవాడ రావాలని జగన్ ఆదేశం

కౌంటింగ్ ప్రారంభానికి రెండు రోజుల ముందుగా 21వ తేదీ నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అన్ని నియోజకవర్గాల్లో నిలబడిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు విజయవాడకు రావాలని వైఎస్ జగన్ ఆదేశించినట్టు సమాచారం. అమరావతి ప్రాంతంలో నిర్మించిన కొత్త పార్టీ కార్యాలయంలో ఈ నెల 22 నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్న జగన్, ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఏజంట్ల శిక్షణ , కౌంటింగ్ ఏర్పాట్లు వంటి ఎన్నో అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు జగన్.

English summary
Jagan ordered all the YCP leaders to assemble in Vijayawada 2 days before the counting on 21st may . They are going to start the activities from this 22nd of this month in Amaravathi's new party office. They are giong to discuss about the agents training and counting arrangements . The Lotus Pond has been evacuated and Jagan is going to focus on the politics from Amaravati .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X