వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం: టీడీపీ హ‌యాంలో జ‌రిగినా..బాబు చేయ‌లేనిది: లెక్క‌ల‌తో స‌హా..!

|
Google Oneindia TeluguNews

మ‌నిషే పోయాడు..మ‌నం తోడులేక పోతే ఎలా. ఇది మాన‌వ‌త్వం ఉన్న ప్ర‌భుత్వం. బాధ‌లో ఉన్న‌వారికి అండ‌గా లేక పోతే ఎందుకీ ప్ర‌భుత్వం...అంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో చేసిన వ్యాఖ్య‌లు. ప్ర‌తీ సోమ‌వారం అన్ని జిల్లా ల్లో స్పంద‌న కార్య‌క్ర‌మం కోసం ముఖ్య‌మంత్రి ఇప్ప‌టికే ఆదేశాలు ఇచ్చారు. ప్ర‌ధానంగా ఎటువంటి స‌మ‌స్య‌లు మీ దృష్టికి వ‌స్తున్నాయంటూ క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వీడియా కాన్ఫిరెన్స్ నిర్వ‌హించారు. అదే స‌మ‌యంలో టీడీపీ హయాంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో జ‌రిగినా..ఆయ‌న చేయ‌లేనిది..ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌కటించారు.

Recommended Video

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షలు: సీఎం జగన్
టీడీపీ హాయంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల‌కు..

టీడీపీ హాయంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల‌కు..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌కటించారు. ఇప్ప‌టికే త‌న తండ్రి జ‌న్మ‌దినాన్ని రైతు దినోత్స‌వంగా ప్ర‌క టించిన జ‌గ‌న్‌..తాజాగా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేసారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌తీ జిల్లాలో క‌లెక్ట‌ర్లు..ఎస్పీల‌తో స్పంద‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసారు. ప్ర‌తీ సోమ‌వారం బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకొని వారికి ర‌సీదులు ఇవ్వాల‌ని సీఎం ఆదేశించారు. ఆ కార్య‌క్ర‌మం స‌మీక్ష కోసం క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వీడియో కాన్ఫిరెన్స్ నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వ హాయంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్పందిస్తూ గ‌త ప్రభుత్వ హయాంలో జిల్లా క్రైం రికార్డుల మేర‌కు 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రికార్డులు చెప్తున్నాయని.. కానీ 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయని జగన్ పేర్కొన్నారు. గ‌త ప్ర‌భుత్వం వారిని ప‌ట్టించుకోక‌పోయినా..మ‌నం వారికి అండ‌గా నిలుద్దాం అంటూ కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. దీని అమ‌లు బాధ్య‌త క‌లెక్ట‌ర్లే అప్ప‌గించారు.

రైతు కుటుంబానికి ఏడు ల‌క్ష‌ల సాయం..

రైతు కుటుంబానికి ఏడు ల‌క్ష‌ల సాయం..

చంద్ర‌బాబు పాల‌న స‌మ‌యంలో 2014-2019 వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం ఈ రైతు కుటుంబాలకు పరిహారాన్ని నిరాకరించినట్టుగా దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. జిల్లాల్లో డేటాను పరిశీలించి.. ఎవరైనా అర్హులున్న రైతు కుటుంబాలు ఉంటే.. వెంటనే వారికి పరి హారం ఇవ్వండని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ సూచించారు. ఎక్కడైనా సరే... రైతు కుటుంబాల్లో జరగ రానిది జరిగితే.. వెంటనే కలెక్టర్‌ స్పందించాలన్నారు. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లండని తెలిపారు. రైతులు కాని, కౌలు రైతులు కాని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్ప‌డితే ఖ‌చ్చితంగా కలెక్టర్‌ ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని.. మళ్లీ సీఎం కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదని సీఎం జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌కు స్ప‌ష్టం చేసారు.

ఇది మాన‌వ‌త్వం ఉన్న ప్ర‌భుత్వం..

ఇది మాన‌వ‌త్వం ఉన్న ప్ర‌భుత్వం..

జ‌గ‌న్ ఇదే అంశంలో మాట్లాడుతూ ఇప్పుడున్న ప్ర‌భుత్వం ప్ర‌జ‌లద‌ని..మాన‌వ‌త్వం ఉన్న ప్ర‌భుత్వ‌మ‌ని స్ప‌ష్టం చేసారు. రైతు జీవ‌నం సాగించ‌లేక మ‌ర‌ణిస్తే..ఆ కుటుంబానికి అండ‌గా నిల‌వాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వం పైన ఉంద‌ని తేల్చి చెప్పారు. ఆ దిశ‌గానే పాల‌న ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసారు.చనిపోయిన వారి కుటుంబాల పట్ల సానుభూతితో ఉండాలని, మానవత్వంతో మెలగాలన్నారు. మనిషే చనిపోయి బాధ‌ల్లో ఉన్న ఆ కుటుంబానికి మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాదని జగన్ స్పష్టం వివరించారు. అదే విధంగా అవినీతిని క్షేత్ర స్థాయి నుండి పూర్తిగా రూపు మాపే విధంగా క‌లెక్ట‌ర్లు చొర‌వ తీసుకోవాల‌ని..ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇవ్వాల‌ని సూచించారు. రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల్లో డ‌బ్బులు ఇవ్వ‌కుండా ప‌నులు జ‌ర‌గ‌టం లేద‌ని సీఎం వ్యాఖ్యానించారు.

English summary
CM Jagan announced sensational decision. Jagan ordered district collectors to give financial support for farmers who committed suicide in Chandra babu tenure. Jagan explained with figures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X