వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకన్న సన్నిధికి జగన్, షెడ్యూల్ లో మార్పు, రెచ్చిపోతున్న నేతలు, పరస్పరం విమర్శలు

వైసీపీ అధినేత , ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన మహాపాదయాత్రపై టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయినా జగన్ లెక్కచేయడం లేదు. శుక్రవారం ఆయన వెంకన్న సన్నిధికి బయలుదేరారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

శ్రీవారిని దర్శించుకున్న జగన్:మళ్లీ వివాదం ! ఎందుకంటే? | Oneindia Telugu

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల వెంకన్న సన్నిధికి బయలుదేరారు. అక్రమాస్తుల కేసులో శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. రోజంతా జరిగిన విచారణ అనంతరం విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.

వైఎస్ జగన్ పేరు మారిందా!? ఇకనుంచీ 'జేఎమ్ఆర్'.. ఇదీ 'పీకే' వ్యూహమేనా?వైఎస్ జగన్ పేరు మారిందా!? ఇకనుంచీ 'జేఎమ్ఆర్'.. ఇదీ 'పీకే' వ్యూహమేనా?

దీంతో జగన్ హైదరాబాద్ నుంచి తిరుమలకు పయనమయ్యారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ రాత్రికి జగన్ తిరుమలకు చేరుకుంటారు. శనివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. సోమవారం నుంచి జగన్ తలపెట్టిన మహా పాదయాత్ర ప్రారంభం కానుంది.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు..

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు..

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన మహా పాదయాత్ర నవంబరు 6 నుంచి ప్రారంభం కానుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర సాగనుంది.

మూడు మతాలకూ ప్రాధాన్యం...

మూడు మతాలకూ ప్రాధాన్యం...

సోమవారం ఉదయం 6 గంటలకు ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించాలని మొదట షెడ్యూల్‌లో ఉంది. అయితే పాదయాత్రకు రెండు రోజుల ముందు తిరుమల వెంకన్నను దర్శించుకొని అనంతరం అక్కడ్నుంచి సొంత జిల్లాలో ఉన్న దర్గాకు వెళ్లి అక్కడ్నుంచి నేరుగా తన సొంత ఊరు పులివెందులకు వెళ్లి చర్చిలో ప్రార్థనలు చేయాలని జగన్ అనుకున్నారు.

మారిన జగన్ షెడ్యూల్...

మారిన జగన్ షెడ్యూల్...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర షెడ్యూల్ లో కొన్ని మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. శ్రీవారి దర్శనం కోసం జగన్ శుక్రవారం తిరుమలకు బయలుదేరారు. శనివారం ఉదయం వెంకన్న దర్శనం తరువాత ఆయన నేరుగా కడప జిల్లాకు వెళ్లాల్సి ఉంది.. కానీ జగన్ తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.

వరుస కార్యక్రమాలతో...

వరుస కార్యక్రమాలతో...

ఇటీవల లండన్ పర్యటన, శుక్రవారం కోర్టులో హాజరుకావడం ఇలా వరుసగా కార్యక్రమాలు ఉండటంతో విశ్రాంతి లేకుండా పోయింది. దీంతో ఒకరోజు విశ్రాంతి తీసుకుని అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా కడప జిల్లాకు చేరుకుని మొదట దర్గా అనంతరం పులివెందుల చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాతే ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.

పాదయాత్రపై విమర్శలు...

పాదయాత్రపై విమర్శలు...

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్రపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మీడియా ముందుకొచ్చి జగన్ పాదయాత్రపై తమదైన శైలిలో మాట్లాడుతున్నారు.

వైఫల్యాలు బయటపడతాయనే: గౌరు

వైఫల్యాలు బయటపడతాయనే: గౌరు

టీడీపీ నేతల విమర్శలకు అదేరీతిలో వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైసీపీ నేత గౌరు వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ పాదయాత్ర అంటే సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే టీడీపీ కుట్రలు చేస్తోందని గౌరు మీడియాకు వివరించారు.

ఏ1గా ప్రజలకేం చెబుతారు?:వర్ల రామయ్య

ఏ1గా ప్రజలకేం చెబుతారు?:వర్ల రామయ్య

జగన్ ది అడ్డగోలు రాజకీయం అని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. పాదయాత్రకు రక్షణ కావాలని అర్జీ పెడతారే తప్ప, అనుమతి మాత్రం అడగరని ఆయన విమర్శించారు. చట్టాలను గౌరవించని జగన్ కు పాదయాత్ర చేసే అర్హత లేదని, సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ ప్రజలకు ఏం చెబుతారని వర్ల రామయ్య ప్రశ్నించారు.

వాయిదాలు తప్పించుకునేందుకే: కళా వెంకట్రావు

వాయిదాలు తప్పించుకునేందుకే: కళా వెంకట్రావు

కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని ఏపీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. జగన్ పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, త్వరలోనే వైసీపీ అధినేత జైలుకెళ్లడం ఖాయమంటూ ఆయన జోస్యం చెప్పారు.

English summary
After facing trail in the CBI Court here in Hyderabad on Friday YCP Chief YS Jagan Mohan Reddy directly went to Tirupati for Venkanna Darshan. He is going to start his Maha Padayatra from 6th November. But there is some changes in Jagan's Schedule. On the other hand, TDP leaders are critisizing his Padayatra while talking to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X