• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీడీపీ నుంచి పోటీ చేశారు.. జగన్ సీఎం కావాలని కోరుకున్నారు! విజయనిర్మల రాజకీయ జీవితం అలా..

|

ప్ర‌ముఖ సినీ దిగ్గ‌జం విజ‌య‌నిర్మ‌ల రాజ‌కీయ రంగంలోనూ గుర్తింపు పొందారు. తెలుగుదేశం స్థాపించిన స‌మ‌యంలో నాడు ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ సినిమాలు తీసారు. కృష్ణ కాంగ్రెస్‌లో ఉండ‌టంతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ..ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా విజ‌య‌నిర్మ‌ల ఈ సినిమాలు తీసారు. ఇక‌..విజ‌య నిర్మ‌ల అదే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నుండి ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా పోటీ చేసారు. త‌రువాతి కాలంలో వైయ‌స్సార్‌కు కృష్ణ‌-విజ‌య నిర్మ‌ల దంప‌తులు ద‌గ్గ‌ర అయ్యారు. ఆయ‌న మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్ సీఎం కావాల‌ని ఓపెన్‌గానే విజ‌య నిర్మ‌ల ఆకాంక్షించారు. ఇక‌, జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌తోనూ విజ‌య నిర్మ‌ల క్లోజ్‌గా ఉండేవారు. ఇప్పుడ అనారోగ్యంతో మ‌ర‌ణించిన విజ‌య నిర్మ‌ల కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంతాపం ప్ర‌క‌టించారు.

జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం: అమ్మఒడి వారికీ వ‌ర్తింపు

  పారదర్శకత, అవినీతిపై సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు
   కృష్ణ కోసం కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా..

  కృష్ణ కోసం కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా..

  విజ‌య నిర్మ‌ల సినీ రంగంలోనే కాదు..రాజ‌కీయంగానూ ఎన్టీఆర్ పైన సెటైరిక‌ల్ సినిమాలు తీసి ఆ రోజుల్లోనే పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో పేరు సంపాదించారు. భ‌ర్త కృష్ణ కాంగ్రెస్‌లో ఉండ‌టంతో..ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా విజ‌య నిర్మ‌ల వ్య‌వ‌హ‌రించే వారు. దీంతో నాడు టీడీపీ స్థాపించిన రోజుల్లో ఎన్టీఆర్‌పైన పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ సినిమాల్లో మండ‌లాధీశుడు.. గండిపేట ర‌హ‌స్యం.. సాహ‌స‌మే నా ఊపిరి..వంటి సినిమాలు సంచ‌ల‌నంగా మారాయి. ఇందులో కొన్ని సినిమాల‌కు విజ‌య నిర్మల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాను తీసిన సినిమాల గురించి ఎన్టీఆర్ సైతం ప్ర‌స్తావించి నా..వ్య‌తిరేకంగా మాత్రం ఒక్క మాట మాట్లాడ‌లేదు. ఎన్టీఆర్‌తో బాల న‌టిగా న‌టించిన విజ‌య నిర్మ‌ల ఆయ‌న మీదే సినిమాల‌ను తీసి గుర్తింపు పొందారు. త‌రువాతి కాలంలో రాజ‌కీయంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో టీడీపీ నుండే ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా విజ‌య నిర్మ‌ల పోటీ చేసారు.

   బాబు హయాంలో టీడీపీ నుండి..

  బాబు హయాంలో టీడీపీ నుండి..

  చంద్రబాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో విజ‌య నిర్మ‌ల ఆయ‌న‌తో స‌ఖ్య‌త‌గా ఉండేవారు. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కు టీడీపీలో చేరిన విజ‌య‌నిర్మ‌ల 1999 ఎన్నికల్లో కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.అమెపై స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా ఎర్నేని రాజా రామ‌చంద‌ర్ పోటీ చేసారు. నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగిన ఆ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్ది 1109 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ త‌రువాత విజ‌య నిర్మ‌ల టీడీపీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసారు. ఇక రాజ‌కీయాల‌కూ దూరంగా ఉన్నారు. 2004లో వైయ‌స్ ఏపీ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత మ‌రోసారి విజ‌య నిర్మ‌ల రాజ‌కీయాల పైన ఆసక్తి ప్ర‌ద‌ర్శించారు. వైయ‌స్ కుటుంబ స‌భ్యుల‌తో పాటుగా వైయ‌స్‌తోనూ కృష్ణ‌- విజ‌య నిర్మ‌ల దంపతులు చాలా స‌న్నిహితంగా ఉండేవారు. వైయ‌స్ నిర్ణ‌యాల‌ను అభినందించిన సంద‌ర్భా లు అనేకం ఉన్నాయి. వైయ‌స్ మ‌ర‌ణం స‌మ‌యంలోనూ ఆయ‌న కుటుంబ సభ్యులకు అండ‌గా నిలిచారు.

   జ‌గన్ సీఎం కావాల‌ని..వైసీపీ వైపు చూసినా..

  జ‌గన్ సీఎం కావాల‌ని..వైసీపీ వైపు చూసినా..

  వైయ‌స్సార్ ఆక‌స్మిక మృతితో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కృష్ణ దంపతులు ప్ర‌తీ సంద‌ర్భంలోనూ అండ‌గా నిలుస్తూ వ‌చ్చారు. కృష్ణ‌- వైయ‌స్సార్ మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయ‌న మ‌ర‌ణం త‌రువాత ఆయ‌న కుటుంబంతో ఇదే ర‌కంగా సంబంధాలు కొన‌సాగాయి. జ‌గ‌న్ అంటే కృష్ణ దంపతులు ఇష్ట‌ప‌డే వారు. జ‌గ‌న్ సీఎం కావాల‌ని విజ‌య నిర్మల ఓపెన్‌గానే చెప్పారు. అనేక సంద‌ర్భాల్లో జ‌గ‌న్‌ను క‌లిసిని కృష్ణ దంప‌తులు వైసీపీలో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌టంతో వారు పార్టీలో చేర‌లేదు. కృష్ణ సోద‌రుడు ఆదిశేష‌గిరి రావు మాత్రం జ‌గ‌న్‌తో గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కూ క‌లిసి న‌డిచారు. త‌మ కుటుంబంతో అంత స‌న్నిహితంగా ఉండే విజ‌య నిర్మల అనారోగ్యంతో మ‌ర‌ణించ‌టం పైన సీఎం జ‌గ‌న్ సంతాపం ప్ర‌క‌టించారు. విజ‌య నిర్మ‌ల జీవ‌న ప్ర‌స్థానాన్ని జ‌గ‌న్ త‌న సంతాప సందేశంలో గుర్తు చేసారు.

  English summary
  Ap Cm Jagan paid tributes to cine actress Vijaya Nirmala. She was closely moved with YSR family members. After YSR sudden death Vijaya Niramala expressed her opinion that Jagan to become CM of AP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X