వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ పేరు ఉండేది: జగన్ పార్టీ నేత, దుమారమని..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరుండేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పెట్టకపోవడం అప్పట్లో దుమారాన్ని రేపిందని ఆయన తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడతామంటూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రామానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పై విధంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది ఇలా ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ శాసనసభ్యులెవరూ అనర్హత వేటు ఎరుగరని అన్నారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన శాసనసభ్యులెవరిపైనా అనర్హత వేటు పడలేదని, పార్టీలో చేరిన వెంటనే వారంతా శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేశారని గుర్తుచేశారు.

తమ పార్టీకి ఎమ్మెల్యేలు దూరం అవుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తమపై పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని మైసూరా రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎంపి ఎస్పివై రెడ్డికి నిర్ణీత గడువులోగా నోటీసు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 16 మంది శాసనసభ్యులు తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేసి ఉప ఎన్ని కల్లో పోటీ చేసి గెలుపొందారని చెప్పారు. దేశంలోనే అత్యధికం గా వైసిపికి చెందిన 16 మంది శాసనసభ్యులపై వేటు పడిన విషయాన్ని ప్రస్తావించగా.. అలాంటిదేమీ లేదన్నారు.

 Jagan Party leader response on NTR name to Shamshabad airport

English summary
YSR Congress Party leader Ummareddy Venkateswarlu has responded on NTR name to Shamshabad Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X