విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాలో మూసేసినట్లే ఎపిలో కూడా జగన్ పార్టీకి మూత:మంత్రి ఆది;బీజేపీపై కుటుంబరావు ధ్వజం

|
Google Oneindia TeluguNews

విజయవాడ:జగన్ పార్టీని తెలంగాణలో మూసేసినట్లు ఏపీలో కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఉందని మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

జగన్‌కు సీఎం పదవి మీద ఆసక్తి తప్ప మరో ధ్యాసే కనిపించలేదని మంత్రి ఆది ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. జగన్‌పై విమర్శలు చేస్తున్నందుకే వైసిపి నేతలు తనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని...అయితే ఏ ఆధారంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆది ప్రశ్నించారు. జగన్‌కు అన్నింటిలో కుట్రలు తప్ప మరేమీ కనిపించడం లేదని మంత్రి ఆది దుయ్యబట్టారు.

అందుకే...నాపై కక్ష

అందుకే...నాపై కక్ష

అలాగే జగన్‌కు ఎక్కడ ఏం జరిగినా అది చంద్రబాబు కుట్రే అంటున్నారని మంత్రి ఆది దుయ్యబట్టారు. వైఎస్‌ వివేకానంద రెడ్డిని ఓడించాననే తనపై కక్ష గట్టారని మంత్రి ఆది చెప్పుకొచ్చారు. తనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి అది కూడా ఒక కారణం అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదని జగన్‌కు ఇష్టం లేదని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు.

నివేదిక...ఎందుకు ఇవ్వలేదు

నివేదిక...ఎందుకు ఇవ్వలేదు

మరోవైపు ఏపీ ప్రణాళికా ఉపాధ్యక్షుడు కుటుంబరావు మరోసారి బిజెపి పై విమర్శల వర్షం కురిపించారు. రాజ్యాంగ సంస్థలను బిజెపి నిర్వీర్యం చేస్తోందని కుటుంబరావు దుయ్యబట్టారు. ఎస్పీవీ ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తామన్న కేంద్రం...ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని కుటుంబరావు నిలదీశారు. నోట్ల రద్దు వల్ల పన్ను ఆదాయం ప్రభావితం కావడం, ఆర్బీఐ సంఘటిత నిధి తదిదర అంశాలపై నివేదిక ఇస్తామని...శశికాంత్ శర్మ ఇప్పటి వరకు ఎందుకు నివేదిక ఇవ్వలేదని కుటుంబరావు ప్రశ్నించారు.

జివిఎల్...నిరాధార ఆరోపణలు

జివిఎల్...నిరాధార ఆరోపణలు

ఆ నివేదిక బయట పెడితే బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటుందనే దానిని ఇవ్వలేదన్నారు. బీజేపీ చేతిలో కాగ్ రిమోట్ కంట్రోల్‌గా మారిందని కుటుంబరావు విమర్శించారు.
రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులకు, కాగ్ అధికారులకు మధ్య జరిగిన రహస్య సంభాషణ జీవీఎల్‌ నరసింహరావుకు ఎలా తెలిసిందని కుటుంబరావు ప్రశ్నించారు. ప్రస్తుతం మత్స్య శాఖలో కుంభకోణం జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్న జివిఎల్...ఎపి ప్రభుత్వంపై అన్నీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

పవన్...ఆ విషయం తెలుసుకో

పవన్...ఆ విషయం తెలుసుకో

సిఎం చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను కుటుంబరావు తప్పుబట్టారు.సెజ్‌లు కాంగ్రెస్ హయాంలో వస్తే చంద్రబాబు ఎలా భూదోపిడీ చేస్తారని ప్రశ్నించారు...చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎలాంటి మైనింగ్‌ అనుమతులు ఇవ్వలేదన్నారు...కాకినాడ సీ పోర్ట్ అధినేత కె.వి.రావు ఇంట్లో మాజీ మంత్రి చిరంజీవి ఎన్ని రోజులు గడిపారో ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.

English summary
Minister Adidanayana Reddy has said that the Jagan party will be closed in Andhra pradesh same like as Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X