కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించండి: వివేకానంద హత్యపై హైకోర్టులో జగన్ పిటిషన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో హైకోర్టును ఆశ్రయించారు ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి. తన బాబాయ్ హత్యను ఓ సాధారణ హత్యగా పరిగణిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్న జగన్ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ పై తనకు నమ్మకం లేదని చెప్పిన జగన్... అసలు వాస్తవాలు బయటకు రావని పిటిషన్‌లో పేర్కొన్నారు. వైయస్ వివేకానంద హత్యను తమ వ్యక్తిగత ప్రయోజనాలకోసం రాజకీయం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు జగన్.

Jagan Reddy files Petition in AP High court over his uncles Murder,seeking probe by Independent agency

ఇక గత శుక్రవారం రోజున వైయస్ వివేకానంద హత్యకు గురయ్యారు. ఈ హత్యపై ఇప్పటికీ మిస్టరీ వీడలేదు. అయితే రాజకీయంగా మాత్రం సంచలనంగా మారింది. ఈ హత్య చేసింది జగన్ కుటుంబ సభ్యులే అని టీడీపీ వాదిస్తుండగా వైయస్ జగన్ మాత్రం సీబీఐకి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రెండురోజుల్లో ప్రభుత్వం స్వతంత్ర సంస్థతో విచారణ చేయించేందుకు ముందుకు రాకపోతే తాము కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే వైయ‌స్ వివేకానంద హ‌త్య కేసులో సిట్ విచార‌ణ వేగంతం చేసింది పులివెందు లో సిట్ అధికారులు హ‌త్య జ‌రిగిన ప్ర‌దే శం సంద‌ర్శించ‌టంతో పాటుగా ప్రాధమిక స‌మాచారం సేక‌రించారు. ఇక‌, వివేకా ప్ర‌ధాన అనుచ‌రుడిని అదుపులోకి తీసు కొని విచార‌ణ చేస్తున్నారు. వివేకానంద ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, పీఏ కృష్ణారెడ్డిలను కూడా విచారణ చేస్తోంది సిట్. అయితే సిట్ విచారణపై తమకు నమ్మకంలేదన్నవైసీపీ... ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన అనేక విషయాలపై ప్రభుత్వం సిట్ వేసిందని ఇప్పటి వరకు ఒక్క కేసును కూడా సిట్ చేధించలేకపోయిందని చెబుతోంది.

English summary
AP opposition leader YS Jagan reddy had filed a petition seeking an independent agency enquiry over his uncles Murder. Jagan said that he had no faith in AP govt's sit that justice would be done.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X