వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛార్టర్డ్ ఫ్లైట్స్ లో స్వస్ధలాలకు ఏపీ వాసులు - అనుమతివ్వాలని కేంద్రానికి జగన్ లేఖ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ నిర్వహిస్తోంది. విదేశాలకు ప్రత్యేక విమానాలను పంపడం ద్వారా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను విడతల వారీగా తీసుకొస్తున్నారు. అయితే స్వస్ధలాలకు రావాల్సిన భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ విమానాలు సరిపోవడం లేదనే పిర్యాదులు పెరుగుతున్నాయి.

విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను వెనక్కి పిలిపించడం నానాటికీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విమానాల సంఖ్య పెంచాలంటూ విదేశాంగ మంత్రి జై శంకర్ కు సీఎం జగన్ లేఖ రాశారు. లేదా కిర్గిస్దాన్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్ నుంచి ఏపీకి ఛార్జర్ట్ విమానాలు నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

jagan requests mea to allow chartered flights to bring back stranded andhraites

వందే భారత్ మిషన్ కింద కేంద్రం చేపడుతున్న చర్యలను ప్రశంసించిన జగన్.. అదే సమయంలో ఈ మిషన్ కింద ఏపీకి కేటాయించిన విమానాలు సరిపోవడం లేదన్నారు. విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను ఏపీకి పంపేందుకు ఛార్టర్డ్ విమానాలకు అనుమతి ఇప్పించాలని అక్కడి తెలుగు సంఘాలు కోరుతున్నాయని, కేంద్రం అనుమతిస్తే వాటి ద్వారా ఏపీ వాసులను స్వస్ధలాలకు చేరుస్తామన్నారు.

English summary
andhra pradesh chief minister ys jagan requests externer affairs minister jai shankar to run more vande bharat flights or allow chartered flights to bring back stranded andhrites in various countries due to lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X