వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ క్యాబినెట్ భేటీ .. ఆంక్షలతో మందడంలో ఉద్రిక్తత .. భారీగా పోలీసు బలగాలు

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు సచివాలయంలో జగన్ క్యాబినెట్ భేటీ కొనసాగుతున్న నేపథ్యంలో మందడం గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మందడం గ్రామంలోని దుకాణాలను మూసి వేయించారు. ముఖ్యమంత్రి సచివాలయంలో భేటీ నిర్వహిస్తున్న నేపథ్యంలో రాజధాని అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులను దీక్షా శిబిరాలను ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. దీంతో పోలీసులకు, మందడం గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

 మాపై ఎందుకీ ఆంక్షలు .. మందడం రైతులు ఫైర్

మాపై ఎందుకీ ఆంక్షలు .. మందడం రైతులు ఫైర్

మూడు రాజధానుల కోసం దీక్షలు చేస్తున్న వారు శిబిరాల్లో ఉండగా, వారికి అనుమతి ఇచ్చి , మమ్మల్ని ఎందుకు దీక్షా శిబిరాలు ఖాళీ చెయ్యమంటారు అంటూ మందడం మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న తమను భయభ్రాంతులకు గురి చేయడం కోసం భారీగా పోలీసు బలగాలను మోహరించారని మందడం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశానికి భారీ భద్రత మధ్య సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళ్లాల్సిన అవసరం ఏమిటి అంటూ మందడం ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 జగన్ క్యాబినెట్ భేటీ .. మందడంలో దీక్షా శిబిరాలను ఖాళీ చేయిస్తున్న పోలీసులు

జగన్ క్యాబినెట్ భేటీ .. మందడంలో దీక్షా శిబిరాలను ఖాళీ చేయిస్తున్న పోలీసులు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించడం లేదంటూ మందడం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ముఖ్యమంత్రి జగన్ సచివాలయం వచ్చి తిరిగి వెళ్లే వరకూ శిబిరంలో ఉండకూడదంటూ అమరావతి రైతులపై ఒత్తిడి తీసుకు వచ్చిన పోలీసులపై నిప్పులు చెరిగిన రైతులు దీక్షా శిబిరాలను ఖాళీ చేయబోమని పోలీసులపై మండిపడ్డారు. దీంతో ప్రస్తుతం మందడంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

జగన్ కాన్వాయ్ వెళ్తుండగా జై అమరావతి నినాదాలు .. మందడంలో ఉద్రిక్తత

జగన్ కాన్వాయ్ వెళ్తుండగా జై అమరావతి నినాదాలు .. మందడంలో ఉద్రిక్తత

సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ భేటీ నేపథ్యంలో సచివాలయానికి వెళ్లేదారిలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా, రైతులను శిబిరాల వద్దకు రావద్దంటూ ఒత్తిడికి గురి చేసినా, ఈరోజు సచివాలయానికి సీఎం జగన్ కాన్వాయ్ వెళుతుండగా పెద్దఎత్తున జై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు . రాజధాని అమరావతి కోసం నినదించిన రైతులు సీఎం జగన్ కు తమ నిరసనను తెలియజేశారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దాదాపు 10 నెలలుగా పోరాటం చేస్తున్నారు రాజధాని ప్రాంత ప్రజలు . కానీ సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.

English summary
tension prevailed in Mandadam village under AP capital Amravati. Police were heavily deployed in Mandadam village in the wake of the ongoing Jagan cabinet meeting at the secretariat today. The shops in Mandadam village were closed. Police have ordered the evacuation of protest camps for farmers agitating for the capital Amravati in the wake of a meeting at the Chief Minister’s Secretariat. This led to an altercation between the police and the villagers of Mandadam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X