వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబోయే మంత్రి అన్న ప్రచారంపై జగన్ క్లాస్ పీకారట .. అందుకే ఉదయభాను అలర్ట్ అయ్యారట

|
Google Oneindia TeluguNews

Recommended Video

నేను కాబోయే మంత్రిని.. ఉదయభానుకు క్లాస్ పీకిన జగన్..!! || Oneindia Telugu

ఏపీలో ఎన్నికలు ముగిశాయి కానీ ఫలితాలు ఇంకా రానేలేదు . ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తమపార్టీ విజయం సాధిస్తుంది అన్న ధీమా ఉండటం మంచిదే అయినా శృతి మించి కాబోయే మంత్రి అని ప్రచారం చేసుకోవటం కాస్త ఎక్స్ ట్రానే . అలా జరిగిన ప్రచారంపై వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయ్యారని సమాచారం . ఎమ్మెల్యేల అనుచరులు కాస్త కంట్రోల్ లో ఉండకుంటే మొదటికే మోసం వస్తుందని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట వైసీపీ అధినేత జగన్ .

జ‌గ‌న్ స‌రికొత్త ట్విస్ట్ : అధికారంలోకి వ‌చ్చినా..పాల‌న అక్క‌డ కాదా..! ఏం చేయాలో నిర్ణ‌యించారా..!!జ‌గ‌న్ స‌రికొత్త ట్విస్ట్ : అధికారంలోకి వ‌చ్చినా..పాల‌న అక్క‌డ కాదా..! ఏం చేయాలో నిర్ణ‌యించారా..!!

వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రచారం

వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రచారం

ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయబావుటా ఎగరవేస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ధీమాగా ఉంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్వయంగా చేయించుకున్న సర్వేలో వైసీపీ భారీ మెజార్టీ సాధిస్తుందని ఈ సారి ఏర్పడేది వైసీపీ ప్రభుత్వమే అని ఆ పార్టీ నేతలు చాలా గట్టిగా నమ్ముతున్నారు . ఇక తాజాగా జరుగుతున్న సర్వేలు కూడా వైసీపీ కే విజయం అని చెప్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు చిక్కంతా వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఇక తాము మంత్రులు అయ్యినట్టేనని ప్రచారం చేసుకోవటంతోనే వచ్చింది .

జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను కాబోయే మంత్రి అని జరుగుతున్న ప్రచారం

జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను కాబోయే మంత్రి అని జరుగుతున్న ప్రచారం

ఏకంగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను అనుచరులు తమ నాయకుడు మంత్రి అని సంబరపడిపోతే పర్వాలేదు ఏకంగా ఫ్లెక్సీలు, వాటర్ బాటిల్స్ మీద స్టిక్కర్లు వేసి కాబోయే మంత్రి అంటూ మరీ రాసేసి లేని పోని చిక్కులు తెచ్చారు .మునిసిపల్‌ చైర్మన్‌ ఇంటూరి రాజగోపాల్‌ ఉచితంగా పంపిణీ చేస్తున్న మంచినీటి బాటిల్స్‌పై కాబోయే మంత్రిగా పేర్కొనడం పెద్ద దుమారమే రేపింది .

ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ ... పదవుల రాద్దాంతంపై క్లాస్

ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ ... పదవుల రాద్దాంతంపై క్లాస్

దీంతో జగన్ ఆలు లేదు చూలు లేదు అప్పుడే మంత్రి పదవుల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం . ఎలాగూ అధికారంలోకి వస్తున్నాం అప్పుడే పదవుల రాద్ధాంతం ఎందుకు అంటూ క్లాస్ పీకారట జగన్ . అభిమానులు, కార్యకర్తలు సైతం కాబోయే మంత్రి, కాబోయే ఎమ్మెల్యే అంటూ ఎక్కడా ఎలాంటి ఫ్లెక్సీలు గానీ స్టిక్కర్ల ద్వారా గానీ ప్రచారం చేయోద్దని కాస్త సంయమనం పాటించాలని జగన్ చెప్పారని టాక్ .

అలెర్ట్ అయిన ఎమ్మెల్యే ఉదయభాను .. అనుచరులను కట్టడి చేసే యత్నం

అలెర్ట్ అయిన ఎమ్మెల్యే ఉదయభాను .. అనుచరులను కట్టడి చేసే యత్నం

దీంతో జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను అలర్ట్ అయ్యారు. అనుచరులను కట్టడి చేసే పనిలో పడ్డారు. ఎవరూ ఎక్కడా మంత్రి అని ప్రస్తావన తేవద్దని , అలాంటి ప్రచారం ఇంకోసారి ఎవరూ చెయ్యొద్దని , కాబోయే మంత్రి అని ప్రకటించడం సరికాదని కార్యకర్తలకు సూచించారట ఉదయభాను .

English summary
Elections are over, but the results have not yet come. Results will be announced on the 23rd of this month. It's a good idea to have a idea of ​​the party's success as a prospective minister. It was reported that the YCP chief Jagan was serious about the campaign. Jaggyya Pet MLA adheres to the Udayabhanu sticks Udaya bhanu as upcoming minister on water bottles. Because of this reason jagan warned the MLA's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X