• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీకి ఫేవర్ చేసిన జగన్ .. జగన్ ఆ నిర్ణయమే బీజేపీకి జోష్ తెచ్చింది

|

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపికి ఫేవర్ చేస్తున్నారు. జగన్ ప్రతిపక్ష శాసనసభ్యులకు తలుపులు మూసేయడంతో ఇక అవకాశాన్ని బిజెపి అందిపుచ్చుకుంది. పార్టీ ఫిరాయింపులపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ దేశవ్యాప్తంగా పలువురి మన్ననలు పొందినప్పటికీ, రాష్ట్రంలో బిజెపి పుంజుకోవడానికి కారణంగా మారింది.

టీడీపీ ఎంపీల ఫిరాయింపుకు బీజేపీ కొత్త భాష్యం! ఆ నలుగురు అందుకే చేరారట

జగన్ నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ

జగన్ నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ

గతంలో వైసిపి నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టిడిపిలో చేరడంతో ఆ బాధను అనుభవించిన జగన్, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీల నుండి అధికార పార్టీలో ఎవరైనా పార్టీ ఫిరాయించాలి అనుకుంటే వారు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే తప్ప వైసీపీలో చేర్చుకోడానికి అంగీకరించమని చెప్పి తన సంచలన నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు జగన్. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా పార్టీలు స్వాగతించినా , బిజెపి మాత్రం జగన్ నిర్ణయాన్ని తనకనుకూలంగా మార్చుకుంది.

  చంద్రగిరి నియోజకవర్గం కమ్మపల్లిలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ
  జగన్ పార్టీలో చేరాలనుకున్నా జగన్ నిర్ణయంతో వెనకడుగు

  జగన్ పార్టీలో చేరాలనుకున్నా జగన్ నిర్ణయంతో వెనకడుగు

  ఇక టీడీపీ లో ఉంటే భవిష్యత్తు ఉండదని భావించి అధికార పార్టీ వైపు దృష్టి సారించిన నేతలకు జగన్ తీసుకున్న నిర్ణయం మింగుడు పడలేదు. జగన్ పార్టీలోకి వెళ్లాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అవ్వాలి. తిరిగి పోటీ చేసి గెలవాలి. ఇక ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేసి మరోమారు ఎన్నికల రంగంలోకి దిగడానికి ఆసక్తి చూపించరు. ఆ సాహసం చెయ్యరు . కాబట్టి జగన్ తీసుకున్న నిర్ణయం జగన్ పార్టీలోకి వెళ్లాలనుకున్న నేతలకు దాదాపుగా తలుపులు మూసేసినట్లేనని అర్థమవుతుంది.

  అసంతృప్త నేతలకు బీజేపీ గాలం .. జగన్ ఫేవర్ వల్లే బీజేపీలో జోష్

  అసంతృప్త నేతలకు బీజేపీ గాలం .. జగన్ ఫేవర్ వల్లే బీజేపీలో జోష్

  ఇక ఈ నేపథ్యంలోనే బిజెపి ఏపీలో చక్రం తిప్పింది. ఏపీలో టీడీపీ లో ఉంటే ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని అసంతృప్తితో ఉన్న టిడిపి నేతలను బిజెపి తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇక అందులో భాగంగా 16 మంది ఎమ్మెల్యేలను బిజెపి తమ వైపుకు లాగే ప్రయత్నం చేస్తుంది అని సమాచారం.

  రాజ్యసభలో నలుగురు టీడీపీ సభ్యులు బిజెపిలో చేరి టిడిపి రాజ్యసభ పక్షాన్ని బిజెపిలో విలీనం చేశారు. ఇక తాజాగా ఏపీలో రంగంలోకి దిగిన రామ్ మాధవ్ ఏపీ లోని కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. టిడిపి నుండి గంపగుత్తగా నేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు శాసనసభ్యులు తమ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటే తాజా పరిణామాలు టిడిపి కాపు నేతల రహస్య సమావేశాలు అందుకు ఊతమిస్తున్నట్టుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఏపీలో బీజేపీ లో జోష్ రావడానికి జగన్ తీసుకున్న నిర్ణయమే కారణమైంది. జగన్ చేసిన ఫేవర్ తో బిజెపి ఏపీలో పుంజుకునే అవకాశం కనిపిస్తుంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress chief and AP chief minister Jaganmohan Reddy is favoring the BJP. Jagan, who made a sensational decision on the party's defects, has been the recipient of the BJP's emergence in the state despite many accolades.BJP is trying to get TDP leaders to join their party, which is disappointed that the TDP will have a bad outcome. The BJP is trying to pull 16 MLAs as part of it.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more