వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ సాక్షిగా జగన్ తొలి ఫిరాయింపు టార్గెట్..! ప్రతిపక్షాన్ని చీల్చుకెళ్లిన షరతుల బుల్లెట్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో ఓడలు బండ్లవుతాయి... బండ్లు ఓడలవుతాయి అంటారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అదే జరిగింది. ఓడలాంటి చంద్రబాబు... బండిగా మారారు. బండిలాంటి జగన్... ఓడగా మారారు. ఇప్పుడు విపక్షంలో కూర్చున్న టీడీపీలోని కొందరు శాసనసభ్యులు.. వైసీపీ చూపు చూస్తున్నారట. అధికార పార్టీలోకి వెళితే... ఏదో ఒక పదవి దక్కకపోతుందా... అని, ఆశగా ఎదురుచూస్తున్నారట. ఐతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం గత రాజకీయాలకు చాలా భిన్నంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సాద్యమైనంత వరకు పిరాయింపులను ప్రోత్సహించకుండా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ పార్టీ మారాల్సివస్తే రాజ్యాంగ బద్దంగా పార్టీ మాకరాలనే నిభంధన తెరమీదకు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపీ అసెంబ్లీ ఎఫెక్ట్‌: చంద్రబాబుకే కాదు: కేసీఆర్‌కు జ‌గ‌న్ షాక్‌: స‌మాధానం చెప్పుకోవాల్సిందేనా..! ఏపీ అసెంబ్లీ ఎఫెక్ట్‌: చంద్రబాబుకే కాదు: కేసీఆర్‌కు జ‌గ‌న్ షాక్‌: స‌మాధానం చెప్పుకోవాల్సిందేనా..!

జగన్ మార్క్ రాజకీయం..! ఫిరాయింపులపై వినూత్న వ్యాఖ్యలు..!!

జగన్ మార్క్ రాజకీయం..! ఫిరాయింపులపై వినూత్న వ్యాఖ్యలు..!!

రాజకీయాల్లో ఫిరాయింపులు సహజం. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి గెంతేస్తుంటారు కొందరు. విలువలను వదిలేస్తుంటారు. జగన్ కు ఈ విషయం బాగా తెలుసు. తన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు టీడీపీలోకి గెంతినప్పుడు, వారిని అనైతికంగా చంద్రబాబు దగ్గరకు తీసినప్పుడు... అసెంబ్లీ వేదికగా జగన్ సాగించిన పోరాటాన్ని జనులంతా చూశారు. 'మా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారు...? అంతగా కావాలనుకుంటే, వారితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో మీ టికెట్ పై పోటీ చేయించి, గెలిపించుకోండి' అని సవాల్ చేశారు. నాటి సీఎం చంద్రబాబుగానీ, స్పీకర్ కోడెలగానీ పట్టించుకోలేదు. ఆ సందర్భంలో శాసన సభాపతి వ్యవహారానికి నిరసనగా ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు.

చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్..! ప్రేక్షక పాత్ర వహించిన బాబు..!!

చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్..! ప్రేక్షక పాత్ర వహించిన బాబు..!!

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన పార్టీలోకి చేర్చుకున్నారు. దీనిపై వైసీపీ తీవ్ర పోరాటం సాగించింది. కోర్టుల్లో కేసులు వేసింది. ఎంత చేసినా ఫలితం కనిపించలేదు. చివరికి, ఫిరాయింపులపై సభలో మాట్లాడేందుకు కూడా వైసీపీ అధినేత జగన్ కు అవకాశం ఇవ్వలేదు. అన్ని మార్గాలు మూసుకుపోవడంతో.. చివరి అస్త్రంగా అసెంబ్లీ సమావేశాలను వైసీపీ నిరవధికంగా బహిష్కరించింది.

Recommended Video

14న ఢిల్లీ వెళ్లనున్న జగన్
ఫిరాయింపులపై అలుపెరగని పోరాటం చేసిన జగన్..! ఆ బాధ ఎవరికి వద్దంటున్న యువ సీఎం..!!

ఫిరాయింపులపై అలుపెరగని పోరాటం చేసిన జగన్..! ఆ బాధ ఎవరికి వద్దంటున్న యువ సీఎం..!!

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని తేల్చిచెప్పింది. ఆనాడు టీడీపీ చేసిన అనైతిక పనినే తాను కూడా చేస్తే... అప్పుడు ఇద్దరికీ తేడా ఏముంటుంది...? అందుకే, ఫిరాయింపులపై శాససనభ తొలి సమావేశాల్లోనే జగన్ స్పష్టతనిచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా, విపక్ష ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పార్టీలోకి రావాలనుకుంటే... ముందుగా తమ పదవులు రాజీనామా చేయాలని షరతు విధించారు. 'ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను పునరావృతం చేయబోము. అలా చేస్తే, నాకూ చంద్రబాబుకూ తేడా ఏముంటుంది..?' అని నిండు సభలోనే ప్రశ్నించారు.

పరిణతి చెందిన జగన్..! రాజకీయాల్లో యువ సీఎం హుందాతనం..!!

పరిణతి చెందిన జగన్..! రాజకీయాల్లో యువ సీఎం హుందాతనం..!!

గతంలో, నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ, వైసీపీలోకి వస్తానని కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కబురంపారు. అప్పుడు కూడా జగన్ ఇదే షరతు విధించారు. తన ఆరేళ్ల పదవీకాలాన్ని వదులుకుని వైసీపీలో చేరారు. టీడీపీలోని ఎంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ వైపు పక్క చూపులు చూస్తున్నారు...? వారిలో ఎంతమంది జగన్ షరతును అంగీకరించి, టీడీపీకి రాజీనామా చేస్తారు...? వారికి వైసీపీ టికెట్ ఇచ్చినా... జనం గెలిపిస్తారా...? ఓడించడం ద్వారా గుణపాఠం నేర్పుతారా...? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పట్లో దొరకడం కష్టం. వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఈ విషయంలో మాత్రం జగన్ పరిపక్వత చూపిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

English summary
Chief Minister Jagan Mohan Reddy seems to be thinking very differently from the past politics. It seems to have been determined not to encourage defermative politics. If the party is to change, the party seems to have plans to bring it to the constitutional way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X