ఎన్నికల్లో డబ్బు, మద్యానికి చెక్ పెట్టే కీలక చట్టం తెచ్చిన జగన్ సర్కార్ .. న్యాయశాఖ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది ఏపీ సర్కార్. పంచాయతీ ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురి చేసే వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన చట్టం ప్రకారం రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఉగ్రవాదం, జగన్ పాలనలో యువత భవిత అంధకారమయం : చంద్రబాబు ధ్వజం

ఇక ఈ చట్టం ప్రకారం 14 రోజుల్లోనే ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైసిపి ప్రభుత్వం
గతేడాది జనవరిలోనే పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైసిపి ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ బిల్లు శాసనసభ ఆమోదం పొందినప్పటికీ, శాసనమండలిలో ఆమోదం పొందలేదు. దీంతో రెండోసారి కూడా శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి, శాసన మండలికి పంపించారు. అయినప్పటికీ అది తిరస్కరించబడింది. రెండోసారి మండలి వ్యతిరేకించినా చట్టం చేయవచ్చని నిబంధన ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చింది

డబ్బులు, మద్యం పంచితే 10 వేలు జరిమానా, మూడేళ్ళ జైలు శిక్ష విధించేలా చర్యలు
ఇక ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ పంచాయితీ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. తర్వాత చర్యలకు పంచాయితీ రాజ్ శాఖ ,గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించింది . ఎవరైనా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువైతే 10 వేలు జరిమానా తో పాటుగా, మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించడం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే సర్పంచ్ ఉప సర్పంచ్ ను తొలగించే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుంది. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత 14 రోజుల లోపల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి.

రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ
ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను 16 రోజుల లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురి చేసే వారికి చెక్ పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేయడంపై కళ్లెం వేయడానికి తీసుకున్న ఈ నిర్ణయం పై రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ చట్టాలు అమల్లోకి రానున్నాయి.