వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఎగ్జిట్ ప్లాన్ రూపొందిస్తున్న జగన్ సర్కార్ .. రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా ఒకపక్క కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే మరోపక్క ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం . కరోనా ఇప్పట్లో తగ్గదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా తేల్చి చెప్పిన విషయం తెలిసిందే . ఇక ఇదే విషయాన్ని గతంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కరోనాతో సహజీవనం చెయ్యాల్సిన పరిస్థితి ఉందని ముందే చెప్పారు సీఎం జగన్ . ఇక ఈ క్రమంలో కరోనా కట్టడికి కృషి చేస్తూనే సామాన్యులకు కాస్త రిలీఫ్ ఇచ్చే ఎగ్జిట్ ప్లాన్ రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే జనజీవనం పనుల్లేక , బతుకు భారంగా మారుతూ అస్తవ్యస్తం అవుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్ .

అనంతపురం పొలాల్లో పీపీఈ కిట్ల కలకలం .. కరోనా భయంతో ఏం చేశారో తెలుసా !!అనంతపురం పొలాల్లో పీపీఈ కిట్ల కలకలం .. కరోనా భయంతో ఏం చేశారో తెలుసా !!

కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులతో పాటు రాష్ట్రం కొత్త గైడ్ లైన్స్

కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులతో పాటు రాష్ట్రం కొత్త గైడ్ లైన్స్

ఇప్పటికే కేంద్రం లాక్ డౌన్ ౩.o కొనసాగిస్తున్నప్పటికీ లాక్ డౌన్ నుండి పలు రంగాలకు సడలింపు ఇచ్చింది . ఇక ఇదే క్రమంలో కేంద్రం ఇచ్చిన సడలింపులే కాకుండా అటు ఏపీ ప్రభుత్వం సైతం కొత్త గైడ్ లైన్స్ రూపొందించింది . కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా చోట్ల షాపులను తెరుచుకోవచ్చునని ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటలకు అన్ని షాపులు తెరుచుకోవచ్చునని తెలిపింది. షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్సులు, రూరల్, అర్బన్ ప్రాంతాల్లో షాపులు తెరవకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇక గ్రామాల్లో ఉన్న షాపులు, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న షాపులను తెరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనుమతినిచ్చింది.

లాక్ డౌన్ ప్రభావం సాధ్యమైనంత తక్కువ మందిపై ఉండేలా నిర్ణయం

లాక్ డౌన్ ప్రభావం సాధ్యమైనంత తక్కువ మందిపై ఉండేలా నిర్ణయం

ఇక లాక్ డౌన్ ప్రభావం సాధ్యమైనంత తక్కువ మందిపై ఉండేలా నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం . అందుకే ఎగ్జిట్ ప్లాన్ చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. ఏపీలో 290 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు ఉండగా వీటిలో కఠినంగా ఆంక్షలు అమలవుతున్నాయి. వీటిలో 75 కస్లర్టలో 28 రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. కాబట్టి వీటిని డీనోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వాలని నిర్ణయించారు.

క్లస్టర్ ల వారీగా లాక్ డౌన్ సడలింపు యాక్షన్ ప్లాన్

క్లస్టర్ ల వారీగా లాక్ డౌన్ సడలింపు యాక్షన్ ప్లాన్

అలాగే కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న 22 క్లస్టర్లలో ఆంక్షలు కఠినతరం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 103 క్లస్టర్ లలో 10 అంతకంటే కేసులు తక్కువ నమోదు అవుతున్నాయి . ఇక ఈ క్లస్టర్ లలో 200 మీటర్లు మేర కంటైన్‌మెంట్, 200 మీటర్ల బఫర్‌ ఏరియాలు ఉంటాయి. అవి తప్ప మిగతా అంతా సాధారణ కార్యాకలాపాలకు అనుమతి ఇవ్వాలని భావిస్తుంది.ఎగ్జిట్ ప్లాన్ లో భాగంగా కేసులు తగ్గుతున్న, కేసులు పెరుగుతున్న , కేసులు మధ్యస్తంగా ఉన్న ప్రాంతాలను బట్టి రకరకాల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు అధికారులు .

 ఇతర రాష్ట్రాలకు భిన్నంగా సాధారణ కార్యాకలాపాలు సాగించటానికి ఏపీ కసరత్తు

ఇతర రాష్ట్రాలకు భిన్నంగా సాధారణ కార్యాకలాపాలు సాగించటానికి ఏపీ కసరత్తు

ఇక హోటళ్ళు, రెస్టారెంట్ లు , థియేటర్లు , విద్యాసంస్థలు, ప్రజా రవాణా వంటి అంశాలలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ కార్యాకలాపాలు కొనసాగిస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు . ఇప్పటికే బస్సులు నడపాలని , 18 వ తేదీ నుండి ఆర్టీసీ బస్సు సర్వీసులను కొనసాగించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు భిన్నంగా చాలా పెద్ద కసరత్తు చేస్తూ ఎగ్జిట్ ప్రణాళిక రూపొందిస్తుంది . అటు రోజువారీ కార్యాకలాపాలకు భంగం జరగకుండా, అదే సమయంలో కరోనా నియంత్రణ దృష్టితో అధికారులు ఈ ప్రణాళిక రూపొందిస్తున్నారు.

English summary
The Jagan government's exit plan is being carefully crafted to ensure that the lock-down effect is on as few people as possible. Action plans are being prepared based on the clusters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X