అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమీర్‌పేట్‌ టు అమరావతి: జగన్ ప్రకటనతో సీన్ రివర్స్ ...ఏం జరుగుతోంది?

|
Google Oneindia TeluguNews

దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. ఒక మంచి ఉద్యోగం సంపాదించాలన్న యువత ఆశలు ఆవిరవుతున్నాయి. ఓ వైపు ఆర్థికమాంద్యం దెబ్బతో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు దొరక్కపోవడం మరోవైపు ప్రభుత్వం నుంచి ఉద్యోగ ప్రకటనలు భారీ స్థాయిలో రాకపోవడంతో యువత నిరాశలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సీన్ రివర్స్ అయ్యింది. అమరావతిలో ప్రకటనలతో అమీర్‌పేట్‌లో ప్రకంపనలు వచ్చాయి.

జగన్ నయా రాజకీయం: ప్రభుత్వ స్కీములకు మోడీ పేరు,టార్గెట్ చంద్రబాబు పవన్

 అమరావతిలో జగన్ ప్రకటన..అమీర్‌పేట్‌లో వైబ్రేషన్స్

అమరావతిలో జగన్ ప్రకటన..అమీర్‌పేట్‌లో వైబ్రేషన్స్

దేశంలో నిరుద్యోగం అంశం యువతను ఆందోళనలోకి నెట్టివేస్తోంది. ఇళ్లను వదిలి వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నప్పటికీ యువతకు మాత్రం ఉద్యోగాలు రావడం లేదు. సరిగ్గా అదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రామసచివాలయాలకు సంబంధించి ఉద్యోగ ప్రకటన వెలువడింది. రెండు నెలల సమయంలో నోటిఫికేషన్ నుంచి అప్పాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చే ప్రక్రియ పూర్తయ్యింది. మళ్లీ ఏపీ ప్రభుత్వం నుంచి మరో ప్రకటన అమీర్‌పేట్‌లో ప్రకంపనలు సృష్టించింది. నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లు దాదాపు ఖాళీ అవుతున్నాయి.

ఖాళీ అవుతున్న కోచింగ్ సెంటర్లు హాస్టళ్లు

ఖాళీ అవుతున్న కోచింగ్ సెంటర్లు హాస్టళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో యువత డిగ్రీ పూర్తి చేసుకుని నేరుగా తెలంగాణలో ఉద్యోగాల కోసం వాలిపోతున్నారు. ఇక్కడ హాస్టళ్లలో ఉంటూ కోచింగ్‌లు తీసుకుంటున్నారు. అయితే ఆర్థికమాంద్యం దెబ్బకు కొత్తవారికి ఉద్యోగాలు రావడం లేదు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి ఉద్యోగ ప్రకటనలు వస్తుండటంతో అమీర్‌పేట్‌లోని కోచింగ్ సెంటర్లు ఖాళీ అవుతున్నాయి. నారాయణగుడాలోని హాస్టళ్లు ఖాళీ అవుతున్నాయి. ఇకపై ప్రతి జనవరిలో ఉద్యోగ ప్రకటలను ఇస్తామన్న సీఎం జగన్ హామీతో హైదరాబాదుకు ఉద్యోగం కోసం వచ్చిన యువత పీచే మూడ్ అంటోంది. 4 లక్షల ఉద్యోగాలకు ప్రకటన ఇస్తామని సీఎం జగన్ చెప్పడంతో తెలంగాణలోని కోచింగ్ సెంటర్లు భారీ కుదుపునకు గురయ్యాయి.

ఒకప్పుడు హైదరాబాదు.. ఇప్పుడు సీన్ రివర్స్

ఒకప్పుడు హైదరాబాదు.. ఇప్పుడు సీన్ రివర్స్

ఇదిలా ఉంటే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేసే ఊసే ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు యువత తల్లిదండ్రులు ఏపీలోనే పనిచేస్తున్నా, వారి మూలాలు ఆంధ్రాలోనే ఉన్నప్పటికీ తెలంగాణ స్థానికతను కోరుకునేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఏపీ యువత స్థానికతను కోరుకుంటోంది. ఏపీలోనే సెటిల్ అవ్వాలని భావిస్తోంది. మరోవైపు తెలంగాణలో యువత కూడా ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఏపీలో నాన్‌లోకల్ కోటాపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా జగన్ సర్కార్‌ను కోరుతోంది. నాన్‌లోకల్‌ కోటాపై క్లారిటీ ఇస్తే తెలంగాణ యువత కూడా అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇది ఊహించని పరిణామం అని నాలుగు నెలల్లో పెను మార్పులే వచ్చాయని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు చెబుతున్నారు.

 తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుంది..?

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుంది..?

ఒక్క ఐటీని మినహాయిస్తే మిగిలిన విద్యార్హతలు కలిగి ఉన్న వారంతా ఏపీపైనే ఫోకస్ పెట్టారు. జనవరి నెలకోసం నిరీక్షిస్తున్నారు. సీఎం జగన్ ప్రకటనలు నిరుద్యోగుల్లో ఆశలు చిగురించేలా ఉన్నాయి. మరి ఇదే ఒత్తిడి తెలంగాణ ప్రభుత్వంపై వస్తే కేసీఆర్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు నియామకాలు నిధులు అనే మూడు అంశాలపైన. మరి నియామకాల పరిస్థితి ఏంటని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

 90 రోజుల్లో మరో భారీ నోటిఫికేషన్‌కు

90 రోజుల్లో మరో భారీ నోటిఫికేషన్‌కు

జనవరి నెలకు మరో 90 రోజుల మాత్రమే సమయం ఉంది. ఈలోగా తెలంగాణలో ఉద్యోగ ప్రకటన రాకుంటే సర్కార్‌ను నిలదీసేందుకు విద్యార్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఏపీలో జగన్ యువతను ఎలా ఆకర్షించనున్నారు..?తెలంగాణ సీఎం దీనికి అడ్డుకట్ట వేయగలరా.. అమరావతిలో ప్రకటనలు అమీర్‌పేట్‌లో ప్రకంపనలు సృష్టించకుండా అడ్డుకోగలరా అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది.

English summary
AP Chief Minister had anounced that there would be a job notification in the month of January every year. With this AP youth who had been trying for a job in Hyderabad are now vacating their hostels and returning to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X