• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ .. వైసీపీ ఓట్ల సునామీ

|

ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంది. జగన్ ఓట్ల సునామీలో దూసుకు పోతున్నారు. టీడీపీకి ఊహించని చావు దెబ్బ తగిలింది. ఇంతగా ఘోర పరాభవం చెందుతామని టీడీపీ కూడా ఊహించి ఉండదు కానీ చంద్రబాబు ఊహని రీతిలో ఏపీ ప్రజలు తీర్పునిచ్చారు. వైఎస్ జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ ఏపీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. తండ్రి బాటలో పాదయాత్ర చేసి ప్రజలకు చేరువైన జగన్ కు ఏపీ ప్రజలు జేజేలు పలికారు.

చంద్రబాబు సైతం ఊహించని విజయం సొంతం చేసుకున్న జగన్ పార్టీ

చంద్రబాబు సైతం ఊహించని విజయం సొంతం చేసుకున్న జగన్ పార్టీ

టెక్నికల్ అంశాల్లో తిరుగులేని పార్టీ అయిన టీడీపీ, టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవడంలో ఎక్స్ పర్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా ఫలితం శూన్యం అయ్యింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం ఐ ప్యాక్ తెరవెనుక వైసీపీ గెలుపుకోసం దాదాపు రెండేళ్ల నుంచీ కృషి చేసింది. సోషల్ మీడియాలో సైతం వైసీపీ అభిమానులందర్నీ ఒకే తాటిపైకి తెచ్చి... ముందుకు నడిపించింది. ఇక జగన్ పాదయాత్ర సక్సెస్ అయ్యింది. ఫలితం అదిరిపోయింది. జగన్ కూడా ఊహించనంతటి విజయం వైసీపీకి దక్కింది.

పాదయాత్ర ఎఫెక్ట్ .. తండ్రికి తగ్గ తనయుడిగా పాదయాత్ర

పాదయాత్ర ఎఫెక్ట్ .. తండ్రికి తగ్గ తనయుడిగా పాదయాత్ర

తెలుగురాష్ట్రాల్లో తొలిసారిగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ఉండేది. ఆ ఆధిపత్య పోరులో తాను ఏంటో నిరూపించుకునేందుకు అలాగే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, చంద్రబాబుపై ఉన్నవ్యతిరేకత ఆనాడు కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది. ప్రజాప్రస్థానం పాదయాత్రతో వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. అలాగీ జగన్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పాదయాత్ర చేసి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు .

అలుపెరుగకుండా జగన్ పాదయాత్ర .. ప్రజల ప్రేమ గెలుచుకున్న జగన్

అలుపెరుగకుండా జగన్ పాదయాత్ర .. ప్రజల ప్రేమ గెలుచుకున్న జగన్

ఇక తండ్రి మరణానంతరం ఓదార్పు యాత్ర నుండి మొన్నటి పాదయాత్ర వరకు జగన్ ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్ జగన్ కూడా దాదాపు ఏడాదిపాటు 3వేల కిలోమీటర్లుకు పైగా పాదయాత్ర చేస్తూ ప్రజలకు అత్యంత చేరువయ్యారు వైయస్ జగన్. తన పాదయాత్ర ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ విధానాలను తూర్పరబడుతూ ప్రతీ ఇంటి గడపను తట్టారు వైయస్ జగన్.2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఏడాదికి పైగా నిర్విరామంగా కొనసాగింది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలను, హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ జగన్‌ పాదయాత్ర సాగింది .

జగన్ పాదయాత్ర , నవరత్నాలు వైసీపీ విజయానికి కారణం

జగన్ పాదయాత్ర , నవరత్నాలు వైసీపీ విజయానికి కారణం

జగన్ పాదయాత్ర , ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించటానికి జగన్ తీసుకున్న నిర్ణయాలు. నవరత్నాలు పథకాలు వైసీపీ విజయానికి దోహదం చేశాయి. వైసీపీ ఓట్ల సునామీలో టీడీపీ కొట్టుకుపోయింది. జయజయధ్వానాలతో ఏపీ ప్రజలు రావాలి జగన్ కావాలి జగన్ అని తమ ఆకాంక్షను తెలియజేశారు.

English summary
It looks like Jagan will fulfil his long-cherished wish of becoming the chief minister which was the primary reason he fell out with the Congress high command. Jagan went on a 3,640 km long padayatra (foot march) across Andhra over the last 14 months to take his fight against Naidu’s TDP to the people. Initial results indicate he seems to have succeeded handsomely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more