వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న .. రీపోలింగ్ ఏమైనా అప్రజాస్వామికమా ? రిగ్గింగా ? జంకెందుకు ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న... రీపోలింగ్ అంటే అంత జంకెందుకు ? || Oneindia Telugu

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ పై జరుగుతున్న రాద్ధాంతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రీ పోలింగ్ జరపాలనే నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేస్తుంది. దీన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు.

రీ పోలింగ్ అప్రజాస్వామికమా ? లేకా రిగ్గింగా ... ?రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు అని ప్రశ్నించిన జగన్

రీ పోలింగ్ అప్రజాస్వామికమా ? లేకా రిగ్గింగా ... ?రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు అని ప్రశ్నించిన జగన్

ఇక ఈ నేపధ్యంలోనే చంద్రబాబుకు సూటి ప్రశ్నలు సంధించారు వై ఎస్ జగన్. చంద్రబాబుగారూ రీపోలింగ్‌ అప్రజాస్వామికమా?లేక రిగ్గింగా? అంటూ నిలదీశారు. చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయటం అప్రజాస్వామికమా?లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డు పడటమా? అంటూ ప్రశ్నించారు. అసలు రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు? అని నిలదీశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు ప్రశ్నాస్త్రాలు సంధించిన వై ఎస్ జగన్ రిగ్గింగ్ జరిగిన ఆ ఐదు పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇకపోతే చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో ఈనెల 19న రీ పోలింగ్ జరగనుంది. అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

లేకా తాము అడిగిన స్థానాల్లో రీపోలింగ్ పెట్టలేదనా ?

లేకా తాము అడిగిన స్థానాల్లో రీపోలింగ్ పెట్టలేదనా ?

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు చోట్ల రీ పోలింగ్ వ్యవహారంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలు జరిగిన ఇన్ని రోజుల తర్వాత రీ పోలింగ్ నిర్వహించడంపై న్యాయస్థానాలను సైతం ఆశ్రయించింది. న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యింది. తాము రీపోలింగ్ జరిపించాలన్న స్థానాలలో కాకుండా వైసీపీ రీపోలింగ్ జరిపించాలని కోరిన స్థానాలలో ఎన్నికలు తిరిగి నిర్వహించటంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారం ఢిల్లీ చేరింది. అసలు టీడీపీ అభ్యంతరం ఆ ఐదు స్థానాల్లో రీపోలింగ్ పైనా ? లేకా తాము అడిగిన స్థానాల్లో రీపోలింగ్ పెట్టలేదనా ? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజాస్వామ్యయుతంగా రీపోలింగ్ జరగాలని కోరిన జగన్

ప్రజాస్వామ్యయుతంగా రీపోలింగ్ జరగాలని కోరిన జగన్

ఏపీలో 19 చోట్ల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని , కానీ వైసీపీ ఫిర్యాదు చేస్తే మాత్రం స్పందించి రీ పోలింగ్ నిర్వహించనుందని .. ఇందులో ఆంతర్యం ఏముందో అందరికీ అర్థమవుతుందని టీడీపీ నేతలు తీవ్ర అసహనంలో ఉన్నారు. ఎన్నికల సంఘంతో వైసీపీ కుమ్మక్కైందని .. తర్వాత సీఎస్‌కు ఫిర్యాదు చేయడంతో రీ పోలింగ్ నిర్వహించారని ఆరోపిస్తున్నారు . టీడీపీ చంద్రగిరి రీపోలింగ్ విషయంలో ఆందోళన బాట పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రీ పోలింగ్ ను స్వాగతిస్తోంది. అయిదు పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని కోరుతున్నా అని జగన్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయం తెలియజేశారు.

English summary
Jagan questioned Chandra Babu Whether the issue of re polling is un democracy or rigged ? why are you afraid of re polling. The rigged poling station are to be democratically repolled again .twitter as platform jagan raised the questions to chandrababu . On chandragiri re polling issue TDP is planning to do legal fight . but YS Jagan welcomes the decision f election commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X