వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ ...కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లోని యువత లోనూ , నిరుద్యోగులలోనూ నైపుణ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్ర స్థాయిలో నైపుణ్య అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న జగన్ ఇక తాజాగా రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఏపీలో యువతలో, నిరుద్యోగులలో హర్షం వ్యక్తం అవుతుంది .

 ఏపీలో నేటి నుంచి కొత్త పెన్షన్‌ కార్డులు.. తొలగించిన జాబితాపై సీఎం జగన్ కీలక నిర్ణయం ఏపీలో నేటి నుంచి కొత్త పెన్షన్‌ కార్డులు.. తొలగించిన జాబితాపై సీఎం జగన్ కీలక నిర్ణయం

స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్షలో జగన్ కీలక నిర్ణయం

స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్షలో జగన్ కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి వేదికగా ఇవాళ ఐటీ పాలసీ, స్కిల్ డెవలప్‌మెంట్ పై అధికారులతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఏపీలోనినిరుద్యోగులలో స్కిల్స్ మరింత పెంచాలని అందుకోసం ప్రభుత్వం వైపు నుండి అందుకు కావాల్సిన సహాయ సహకారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఐటీఐ కాలేజీల్లో నాడు నేడు కార్యక్రమం కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.

4 ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా 4 స్కిల్స్ డెవలప్ మెంట్ కేంద్రాలు

4 ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా 4 స్కిల్స్ డెవలప్ మెంట్ కేంద్రాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఏపీలో నిరుద్యోగులు, విద్యార్థులు చక్కటి స్కిల్స్ తో శిక్షణ పొంది ఉద్యోగావకాశాలు పొందడానికి వీలుగా 4 ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా 4 స్కిల్స్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పులివెందుల జెఎన్ టీయూకు అనుబంధంగా మరొక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు .విశాఖలో ఐటీ రంగం కోసం హై-ఎండ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ఈ సమీక్షలో తెలిపారు .

Recommended Video

AP CM YS Jagan's Mega Check to Pawan Kalyan | Chiranjeevi May Nominated to Rajyasabha || Oneindia
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కమిటీలు

రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కమిటీలు


ఇక అంతే కాకుండా భవిష్యత్ లో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో మరో 2 నైపుణ్యాభివృద్ధి సంస్థలు స్థాపించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ఖాళీల భర్తీపైనా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.ఇక అంతే కాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా నిరుద్యోగులకు శిక్షణ ద్వారా అందించాలని నిర్ణయించిన వైసీపీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది.

English summary
Chief Minister YS Jagan Mohan Reddy has made a key decision to improve the skills of the unemployed in Andhra Pradesh. CM Jagan good news for the unemployed in AP. AP CM decided to set up 30 centers for skill development at the state level. Moreover, the decision to establish Skill Development centers will now be a boon for the unemployed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X