వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం మెడలు వంచుతామని చెప్పి జగన్ కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు సాష్టాంగపడ్డారన్న లోకేష్

|
Google Oneindia TeluguNews

ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ వైసీపీ సర్కార్ పై అవకాశం దొరికితే చాలు విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను వచ్చేలా చేస్తానని , కేంద్రం మెడలు వంచితానని చెప్పారని చివరకు ఆయనే కాదు రాష్ట్ర ప్రజల మెడలు కూడా వంచేలా చేశారని ఆయన మండిపడ్డారు.

జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలీదు .. నాదెండ్ల షాకింగ్ కామెంట్జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలీదు .. నాదెండ్ల షాకింగ్ కామెంట్

Recommended Video

జులై 11నుంచి ప్రారంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు
జగన్ తన కేసుల మాఫీ కోసం కేంద్రానికి సాష్టాంగ నమస్కారం చేశారన్న నారా లోకేష్

జగన్ తన కేసుల మాఫీ కోసం కేంద్రానికి సాష్టాంగ నమస్కారం చేశారన్న నారా లోకేష్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి మొండి చెయ్యి ఇచ్చిందని వ్యాఖ్యానించిన లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ‘కేసుల మాఫీ కోసం సాష్టాంగ నమస్కారం చేశారని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు గాలికి వదిలేశారన్నారు. 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ గారు... కేంద్రం ముందు సాష్టాంగపడి ఏపీ ప్రజల మెడలు వంచారు. మీకు 22 ఎంపీలను ఇచ్చినందుకు కేంద్రం నుంచి జీరో బేస్డ్ నేచురల్ బడ్జెట్ సాధించారు జగన్ గారు' అని లోకేష్ చాలా ఘాటుగా ట్వీట్ చేశారు.

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మెుండి చేయి చూపిన కేంద్రం .. కారణం జగన్ తీరే అని ఫైర్

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మెుండి చేయి చూపిన కేంద్రం .. కారణం జగన్ తీరే అని ఫైర్

మాజీమంత్రి నారా లోకేష్ కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మెుండి చేయి చూపడానికి సీఎం వైయస్ జగన్ వ్యవహార శైలియే కారణమంటూ ట్వీట్ చేశారు. జగన్ కేంద్రం నుండి ఏమీ సాధించలేరని ఎందుకంటె ఆయనకు కావాల్సింది ఆయన కేసుల మాఫీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఏపీకి రావాల్సిన నిధులు,హక్కులు గాలికొదిలేశారని కేంద్ర బడ్జెట్ లో రాష్టానికి అన్యాయం జరిగిందని
పేర్కొన్న ఆయన జరిపిన కేటాయింపులపై ట్విట్టర్ లో మండిపడ్డారు నారా లోకేష్ .

రైతుల సమస్య పరిష్కరించలేక హరికథలు చెప్తున్న ప్రభుత్వం అని జగన్ సర్కార్ పై ఫైర్ అయిన లోకేష్

రైతుల సమస్య పరిష్కరించలేక హరికథలు చెప్తున్న ప్రభుత్వం అని జగన్ సర్కార్ పై ఫైర్ అయిన లోకేష్

ఇక అంతేకాదు రాష్ట్రంలో రైతుల సమస్యను పరిస్కరించలేక హరికథలు చెప్తున్నారని మండిపడ్డారు. ఇదేమన్నా ఇడ్లీనా, ఉప్మానా, ప్రభుత్వం రాగానే విత్తనాలు రావటానికి అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం...ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇవ్వాల్సిన విత్తనాలను తెలంగాణకు ఎలా ఇచ్చేశారో సమాధానం చెప్తారా ? అని ప్రశ్నించారు . మీరు కొని రైతులకు సరఫరా చెయ్యలేక హరికధలు వినిపిస్తున్నారు. ఇప్పటికైనా కాస్త బాధ్యతగా నడుచుకోండి, రైతుని ఇబ్బంది పెడితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది అని వ్యాఖ్యానించారు. ఇక మరో పోస్ట్ లో కొంచెమన్నా సోయి ఉండి మాట్లాడాలి. విత్తన కొరత గత ప్రభుత్వ తప్పిదమా? ఏపీ లో పుష్కలంగా విత్తనాలు ఉన్నాయనడానికి ఇదిగో నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుండి 10,000 క్వింటాళ్ల విత్తనాలు కొని రైతులకు సరఫరా చేస్తోంది అని ఆయన తనపోస్ట్ తో పాటు తెలంగాణా సర్కార్ కొనుగోలు చేసిన బిల్లును పోస్ట్ చేశారు.

English summary
Lokesh responded via Twitter, commenting that the budget introduced by Union Finance Minister Nirmala Sitharaman had given AP a stubbornness. Apparently, the unfair injustice of the AP in the central budget. Jagan said that if the 25 MPs win, the center will bend their necks ... but AP people prostrate in front of the center and bowed the necks because of CM Jagan . Lokesh tweeted that AP got Zero Based Natural Budget from the Center for giving 22 MPs for YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X