• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యాక్ట‌ర్..పార్ట‌న‌ర్ : ప‌వ‌న్ ను జ‌గ‌న్ పేరుతో పిల‌వ‌రా :పొలిటిషియ‌న్ గా గుర్తించ‌రా : ఎందుకంటే..!

|

వైసిపి అధినేత జ‌గ‌న్ కొంత కాలంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను ఎక్క‌డా పేరు పెట్టి ప్ర‌స్తావించ‌టం లేదు. కేవ‌లం ప‌వ‌న్ ను యాక్ట‌ర్..చంద్ర‌బాబు పార్ట‌న‌ర్ అంటూ మాత్ర‌మే ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌స్తావిస్తున్నారు. దీని పై ప‌వ‌న్ సైతం సీరియ స్ గానే రియాక్ట్ అవుతున్నారు. అయితే, జ‌గ‌న్ ఉద్దేశ పూర్వ‌కంగానే ప‌వ‌న్ ను ఈ ర‌కంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇందులో పెద్ద వ్యూహ‌మే ఉంద‌ని చెబుతున్నారు వైసిపి నేత‌లు..

యాక్ట‌ర్‌..పార్ట‌న‌ర్ అంటూనే..

యాక్ట‌ర్‌..పార్ట‌న‌ర్ అంటూనే..

వైసిపి అధినేత జ‌గ‌న్ తాజా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను పేరు పెట్టి విమ‌ర్శ‌లు చేయ లేదు. యాక్ట‌ర్‌..పార్ట‌న‌ర్ అంటూ మాత్రం ప‌రోక్షంగా ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబుకు కు పార్ట‌న‌ర్ గా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని..ఆయ‌న‌కు ఎన్నిక‌ల్లో మేలు చేసేందుకే ప‌వ‌న్ ర‌హస్య మిత్రుడిగా న‌డుచుకుం టున్నారంటూ జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఎక్క‌డా జ‌న‌సేన అధినేత‌గా..లేదా ఒక నేత‌గా ప‌వ‌న్ ను తాను గుర్తించ టం లేద నే సంకేతాలు ఇస్తున్నారు. గ‌తంలో ప‌వ‌న్ వైవాహిక జీవితం పై విమ‌ర్శ‌లు చేసిన జ‌గ‌న్‌..ఆ త‌రువాత అస‌లు ఎక్క‌డా ప‌వ‌న్ పేరు ఎత్త‌టం లేదు. తాజా ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాత్రం చంద్ర‌బాబు పార్ట‌న‌ర్ గా ..ఒక సినిమా యాక్ట‌ర్ గా మాత్ర మే తాను ప‌రిగ‌ణిస్తున్నాన‌నే సంకేతాలు ఇస్తున్నారు. జ‌గ‌న్ పొలిటిషియ‌న్ గా వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌నేది జ‌గ‌న్ అభిప్రా యంగా వైసిపి నేత‌లు చెబుతున్నారు. త‌న‌ను యాక్ట‌ర్‌..పార్ట‌న‌ర్ అంటూ పిల‌వ‌టం పై ప‌వ‌న్ సైతం సీరియ‌స్ అవుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

వ్యూహాత్మ‌కంగానే జ‌గ‌న్‌...

వ్యూహాత్మ‌కంగానే జ‌గ‌న్‌...

జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌కంగానే ప‌వ‌న్ ను యాక్ట‌ర్ గా పిలుస్తున్నార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ ను ఓ పార్టీ అధినేత‌గా గు ర్తించి ఈ ఎన్నిక‌ల్లో పోటీగా భావించాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఎన్నిక‌లు ఏపి లో టిడిపి..వైసిపి మ‌ధ్య మాత్ర‌మే అని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఎక్క‌డా ప‌వ‌న్ త‌న‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధిగా జ‌గ‌న్ భావించ‌టం లేద‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు. అయితే, వ‌ప‌న్ పూర్తిగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రా యం జ‌గ‌న్ లో బ‌లంగా ఉంద‌న్న‌ది ఆ పార్టీ నేత‌ల వాద‌న‌. ప‌వ‌న్ గురించి తాను విమ‌ర్శ‌లు చేయ‌టం..తిరిగి ప‌వ‌న్ స్పందించ‌టం వ‌ల‌న త‌న ప్ర‌చార స‌ర‌ళి డైవ‌ర్ట్ అవుతుంద‌ని..అది ప‌వ‌న్ అభిమానులు..వైసిపి అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియా కేంద్రంగా ఆ వ్య‌వ‌హారం ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతుంద‌న్నది వైసిపి నేత‌ల విశ్లేష‌ణ‌. దీంతో కేవ లం.. ప‌వ‌న్ ను చంద్ర‌బాబుకు పార్ట‌న‌ర్ గా మాత్ర‌మే ప్రజ‌ల్లో నిల‌బెట్టాల‌నేది జ‌గ‌న్ వ్యూహం.

ప‌వ‌న్ సీరియ‌స్ రియాక్ష‌న్..

ప‌వ‌న్ సీరియ‌స్ రియాక్ష‌న్..

జ‌గ‌న్ త‌న‌ను కేవ‌లం యాక్ట‌ర్‌..పార్ట‌న‌ర్ గా ప్ర‌చారం చేయ‌టాన్ని ప‌వ‌న్ సైతం సీరియ‌స్ గానే తీసుకుంటున్నారు. తాను యాక్ట‌ర్ అనేది వాస్త‌వ‌మే అయినా..జ‌గ‌న్ ఎక్క‌డి నుండి వ‌చ్చారు..జైలు నుండి కాదా అని ప్ర‌శ్నిస్తున్నారు. తాను ఎవ‌రి తో పొత్తు పెట్టుకోవాల‌నుకున్నా నేరుగా పెట్టుకుంటాన‌ని చెబుతున్నారు. అయితే, జ‌గ‌న్ త‌న ప్ర‌చారంలో జ‌న‌సేన బ‌రి లో ఉన్న పార్టీగా కంటే..చంద్ర‌బాబు మ‌ద్ద‌తు పార్టీగా ప్ర‌చారం చేయ‌టం ద్వారా ఓట్ల చీలిక ను సాధ్య‌మైనంత వ‌ర‌కు కంట్రోల్ చేయాల‌నేది జ‌గ‌న్ వ్యూహం గా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు త‌న వ్య‌తిరేక ఓటును ప‌వ‌న్ ద్వారా చీల్చాల‌ని ప్ర య‌త్నం చేస్తున్నార‌ని..అది సాధ్య‌ప‌డ‌కుండా ప‌వ‌న్ ను చంద్ర‌బాబు పార్ట‌న‌ర్ గా ప్ర‌చారం చేయ‌టం ఇప్ప‌టి వ‌ర‌కు మంచి ఫ‌లితాలే ఇచ్చింద‌న్న‌ది వైసిపి నేత‌ల విశ్లేష‌ణ‌.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YCP Cheif Jagan never says pawan as Political party chief and also as Politician. jagan says Pawan in an actor and partner of Chadnra Babu. Pawan also seriously reacting on jagan comments.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more