వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సంచలనం .. అధికారంలోకి వచ్చాక ఆపని చెయ్యకుంటే రాజీనామా చేస్తా

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయాలు సంచలనాలకు కేరాఫ్ గా మారిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా పోరు జరుగుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోటానికి హామీల వర్షం కురుస్తుంది. నేతల మాటలు, ఇస్తున్న వాగ్దానాలు షాక్ కు గురి చేస్తున్నాయి.

 వైసీపీ అభ్యర్థి వింత చేష్టలు .. పీక్స్ టైమ్ లో వైసీపీ కి తలనొప్పులు వైసీపీ అభ్యర్థి వింత చేష్టలు .. పీక్స్ టైమ్ లో వైసీపీ కి తలనొప్పులు

అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేస్తా

అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేస్తా

ప్రధానంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య పోరు తీవ్రంగా నడుస్తోంది. ఇక ప్రచార పర్వంలో దూసుకుపోతున్న వైసీపీ అధినేత జగన్ కర్నూల్ ప్రచార సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని జగన్ సభాముఖంగా ప్రకటించారు .

 చంద్రబాబు పై ఫైర్ అయిన జగన్

చంద్రబాబు పై ఫైర్ అయిన జగన్

ఇక చంద్రబాబుపై ఫైర్ అయిన జగన్ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పేదల బతుకులు ఏ మాత్రం మారలేదన్న జగన్ ముఖ్యమంత్రిగా రైతులకు, నిరుద్యోగులను అండగా వుండాల్సింది పోయి ప్రజల సొమ్ముని దోచుకున్నారని ఆరోపించారు. రైతు సంకేశం కోసం బాబు చేసింది ఏమీ లేదని కేవలం మభ్యపెట్టే పనిలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు.

 కర్నూలు సభలో జగన్ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్

కర్నూలు సభలో జగన్ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్

వైసీపీ అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన పార్టీ హామీ నెరవేరుస్తామని , మొదటి సంవత్సరంలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని అన్నారు జగన్ . తాము అధికారంలోకి వస్తే 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టుల పనులన్నీ నత్త నడకన సాగుతున్నాయని, రైతులపై రుణ భారం వేస్తున్న టీడీపీ వైఖరితో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. మొత్తానికి కర్నూలు సభలో జగన్ చేసిన రాజీనామా ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

English summary
Jagan Mohan Reddy, the YCP President is in the campaign during the election. He made sensational comments at the election campaign in Kurnool district. The sensational announcement that if they come to power and if the assurances given to the public were not made then he will resign . It's become the hot topic in the AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X