వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ మార్క్ షాక్ ట్రీట్‌మెంట్ : డ‌బ్బు తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే: సీఎం నిర్ణ‌యంతో షేక్‌..!

|
Google Oneindia TeluguNews

అవినీతి విష‌యంలో తన మార్క్ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో చూపించారు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతి కి పాల్ప‌డితే పార్టీ అధినేత‌గా..ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ఎలా రియాక్ట అయ్యారో తెలుసా. ఇప్పుడు ఇదే విష‌యం ఏపీ సచి వాల‌యంతో పాటుగా వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత అవినీతికి దూరంగా ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ మంత్రులు..ఎమ్మెల్యేల‌ను ఆదేశించారు. అయితే, బ‌దిలీల‌కు తెర లేవ‌టంతో కొంద‌రి వ్య‌వ‌హా ర శైలి సీఎం దృష్టికి వ‌చ్చింది. దీంతో..కొద్ది రోజుల క్రితం మంత్రుల‌కు క్లాస్ తీసుకున్నీ సీఎం..ఇప్పుడు త‌న పార్టీకే చెందిన ఎమ్మెల్యే విష‌యం షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో..ఆ ఎమ్మెల్యే షేక్ అయ్యారు..

 సీఐ బ‌దిలీ కోసం ఎమ్మెల్యేకు సొమ్ము..

సీఐ బ‌దిలీ కోసం ఎమ్మెల్యేకు సొమ్ము..

ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత పోలీసు శాఖ‌లో భారీగా బ‌దిలీలు జ‌రిగాయి. ఐపిఎస్ అధికారుల‌ను సీఎం తో చ‌ర్చించి డీజీపీ బ‌దిలీల పైన నిర్న‌యం తీసుకున్నారు. అదే స‌మ‌యంలో ఏపీలోని ప‌లు జిల్లాలోని సీఐల‌ను బ‌దిలీ చేస్తూ ఐజీలు..డీఐజీలు ఉత్త‌ర్వులు జారీ చేసారు. అయితే, వైసీపీ అధికారంలోకి రావ‌టంతో త‌మ‌కు కావాల్సిన చోట పోస్టింగ్ కోసం కొంద‌రు సీఐలు అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖ‌ల‌తో త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేసుకున్నారు. ఇదే ర‌కంగా ప్ర‌కాశం జిల్లాలో పోస్టింగ్ కోసం ఒక సీఐ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే..ముఖ్య‌మంత్రికి స‌న్నిహి తంగా ఉండే వ్య‌క్తి కావ‌టంతో ఆయ‌న ద్వారా ప్ర‌య‌త్నాలు చేసారు. అందు కోసం ప‌ది ల‌క్ష‌ల రూపాయాలు అడ్వాన్స్‌గా ఇచ్చుకున్నారు. దీంతో..ఆ ఎమ్మెల్యే త‌మ రేంజ్ ఐజీ ద్వారా ఆ సీఐ పోస్టింగ్ కోసం లాబీయింగ్ చేసి ఎట్ట‌కేల‌కు కోరిన విధంగా బ‌దిలీ చేయించారు. సీఐ అడిగిన ప‌ని అయిపోయింది.. ఎమ్మెల్యే చేసిన సిఫార్సు అమ‌లైంది. ఇద్ద‌రూ తాము కోరుకున్న విధంగా జ‌ర‌గ‌టంతో ఊపిరి పీల్చుకున్నారు.

సీఎం పిలుపు..ఆదేశంతో ఎమ్మెల్యే షేక్‌..

సీఎం పిలుపు..ఆదేశంతో ఎమ్మెల్యే షేక్‌..

ఇది జ‌రిగిన రెండు రోజులుకు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుండి ఆ ఎమ్మెల్యేకు ఫోన్ వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ‌చ్చి క‌ల‌వ‌మంటున్నార‌నేది ఆ ఫోన్ సారాంశం. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి పిల‌వటంతో ఆ ఎమ్మెల్యే వెంనే ఉండ‌వ‌ల్లి కి వెళ్లారు. ముఖ్య‌మంత్రిని క‌లిసారు. జ‌గ‌న్ త‌న దైన శైలిలో ప‌ల‌క‌రించి..అస‌లు విష‌యానికి వ‌చ్చారు. అధికారంలోకి రాగానే ప్ర‌భుత్వం..పార్టీలో నిర్ణ‌యం తీసుకున్నాం..నీవు చేస్తుంది ఏంటీ అని ప్ర‌శ్నించారు. నేరుగా ఎమ్మెల్యే సిఫార్సు చేసిన సీఐ విష‌యం..అదే సీఐ నుండి ప‌ది ల‌క్ష‌లు తీసుకున్న వ్య‌వ‌హారాన్ని ముఖ్య‌మంత్రి ఆ ఎమ్మెల్యేతో సూటిగా ప్ర‌శ్నించారు. ఇంత ఖ‌చ్చిత‌మైన స‌మాచారంతో ముఖ్య‌మంత్రి వ‌ర‌కు ఈ విష‌యం ఎలా వెళ్లిందంటూ షాక్ అయ్యారు. వెంట‌నే పొర‌పాటు జ‌రిగిందంటూ క్ష‌మాప‌ణ చెప్పారు. ఆ వెంట‌నే సీఎం జ‌గ‌న్ సైతం ఇటువంటి పున‌రావృతం అవుతే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేస్తూనే..ఆ ప‌ది ల‌క్ష‌లు సీఐకు తిరిగి ఇచ్చేయాల‌ని ఆదేశించారు. దీంతో..ఎమ్మెల్యే మ‌రో సారి బిత్త‌రపోయారు. సీఎం చెప్పిన విధంగానే ఆ సీఐకు డ‌బ్బు తిరిగి ఇచ్చేసారు.

మొన్న మంత్రులు..నేడు ఎమ్మెల్యే

మొన్న మంత్రులు..నేడు ఎమ్మెల్యే

కొద్ది రోజుల క్రితం ఇదే ర‌కంగా బ‌దిలీల వ్య‌వ‌హారంలో ముగ్గ‌రు మంత్రుల పేషీల్లో సిబ్బంది..మ‌రో మంత్రి వ‌ద్ద స‌మీప బంధువులు చేస్తున్న హ‌డావుడి సీఎం దృష్టికి వ‌చ్చింది. ఇద్ద‌రు మ‌హిళా మంత్రుల‌కు సంబ‌ధించిన మ‌నుషులు బ‌దిలీల పేరుతో త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన వారిని ట్రాప్ చేసి..సొమ్ము చేసుకుంటున్నాని సీఎంకు స‌మాచారం అందింది, వెంట‌నే ఆ మంత్రుల‌ను పిలిచి జ‌గ‌న్ ఘాటుగా హెచ్చ‌రిక చేసారు. ఇక‌, ఇప్పుడు జిల్లాలో జ‌రిగిన ఎమ్మెల్యే డ‌బ్బు తీసు కున్న వ్య‌వ‌హారం సైతం సీఎం దృష్టికి ఎంత సొమ్ము అనే విష‌యం ద‌గ్గ‌ర నుండి పూర్తిగా స‌మాచారం చేరింది. సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా..సీఎం ఎమ్మెల్యేతో తీసుకున్న సొమ్ము తిరిగి ఇప్పించేసారు. అయితే, ముఖ్య‌మంత్రి నిఘా ఇంత బ‌లంగా ఉందా అనే చ‌ర్చ మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ట్రీట్‌మెంట్‌ను కొంద‌రు స్వాగ‌తిస్తుండ‌గా.. మ‌రి కొంద‌రు మాత్రం త‌మ‌కు ఇక సంపాదించుకొనే అవ‌కాశం లేదా అంటూ వాపోతున్నారు.

English summary
CM Jagan serious on Corruption in Govt and in party. Recently MLA form prakasam district took amount from a CI for transfer. CM Jagan called that MLA directed to return that amount. This issue became hot topic in Govt and in Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X