వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన జగన్ -స్థానిక సంస్థల్లో ‘ప్రత్యేక పాలన’ పొడిగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య కొనసాగుతోన్న ఆధిపత్యపోరులో కీలక మలుపు చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల విషయంలో తుది నిర్ణయం నిమ్మగడ్డదేనని, ఎన్నికల నిర్వహణకు జగన్ సర్కారు సహకరించాల్సిందేనని హైకోర్టు కరాకండిగా తీర్పు చెప్పిన తర్వాత కూడా ఎస్ఈసీకి చెక్ పెడుతూ ఏపీ సర్కారు కీలక ఉత్తర్వులు జారీచేసింది.

సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారిసెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి

 మరో 6 నెలలు ప్రత్యేక పాలనే..

మరో 6 నెలలు ప్రత్యేక పాలనే..

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించేందుకు రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌నర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమాయత్తం అవుతుండగా, ఆయన ప్రయత్నాలకు జగన్ సర్కారు చెక్ పెట్టింది. ఎన్నికల విషయంలో ఇరు వ‌ర్గాలు సంప్ర‌దింపుల‌తో ఏకాభిప్రాయానికి రావాల‌ని హైకోర్టు సూచ‌న‌లు ఇచ్చిన‌ప్ప‌టికీ ఎలాంటి స్పందన తెలపని ప్రభుత్వం.. స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొగడిస్తూ శనివారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.

ద్వివేది పేరుతో ఉత్తర్వులు..

ద్వివేది పేరుతో ఉత్తర్వులు..

చంద్రబాబు హయాంలోనే ఏపీలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉండగా, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థలైన గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు ప్రత్యేక అధికారుల పాలన కిందికి వెళ్లాయి. నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు నో చెబుతోన్న ప్రభుత్వం.. ఇప్పుడా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేంది. మండల పరిషత్‌లలో 2021 జూలై 3 వరకు, జిల్లా పరిషత్ లలో ఈఏడాది జూలై 4 వరకు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది పేరుతో శనివారం ఆదేశాలు వెలువడ్డాయి. పంచాయితీలు, మున్పిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనపైనా త్వరలోనే ఆదేశాలు రావొచ్చని తెలుస్తోంది. ఈచర్య ద్వారా..

 జగన్ వర్సెస్ నిమ్మగడ్డ

జగన్ వర్సెస్ నిమ్మగడ్డ

గతేడాది ఫిబ్రవరిలోనే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం కాగా, ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చిలో షెడ్యూల్ కూడా ప్రకటించింది. కానీ కరోనా విలయం నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే, ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆయన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ బాహాటంగా విమర్శలు చేశారు. కొద్ది రోజులకే నిమ్మగడ్డ పదవీకాలాన్ని తగ్గిస్తూ, కొత్త ఎస్ఈసీగా తమిళనాడుకు చెందిన కనగరాజ్ ను ఏపీ సర్కార్ నియమించింది. కానీ ఆ ఉత్తర్వులు కోర్టుల్లో కొట్టుడు పోవడం, తిరిగి ఎస్ఈసీగా నిమ్మగడ్డ కొనసాగడం ఖాయమైపోయింది. ఈఏడాది మార్చిలో నిమ్మగడ్డ పదవీ విరమణ చేయనుండగా...

నిమ్మగడ్డకు మరో షాక్..

నిమ్మగడ్డకు మరో షాక్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు వైసీపీ భయపడటం లేదని, టీడీపీకి వత్తాసుగా వ్యవహరిస్తోన్న నిమ్మగడ్డ రమేశ్ ఆధ్వర్యంలో మాత్రం తాము ఎన్నికలకు వెళ్లబోమని జగన్ కేబినెట్ మంత్రులు చాలా మంది మీడియాకు స్పష్టం చేశారు. అయితే కోర్టులు మాత్రం ఎన్నికల విషయంలో నిమ్మగడ్డదే తుది నిర్ణయమని తీర్పులు చెప్పాయి. ఆఖరికి జగన్ కొవిడ్ వ్యాక్సినేషన్ అస్త్రాన్ని ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. ప్రతిసారి కోర్టుల్లో ఎదురుదెబ్బలు తిన్న జగన్ సర్కారు.. ఒక దశలో కాంప్రమైజ్ అయిందని, ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైందని వార్తు కూడా వచ్చాయి. చివరికి శనివారం నాటి ఉత్తర్వుల ద్వారా జగన్ తన పంతాన్ని వీడబోరనే ఉద్దేశాన్ని తెలిపినట్లయింది. ఇక..

కొత్త జడ్జిల నుంచి కొత్త తీర్పులు?

కొత్త జడ్జిల నుంచి కొత్త తీర్పులు?

స్థానిక ఎన్నికల విషయంలో ఇన్నాళ్లూ ఎస్ఈసీ నిమ్మగడ్డకు అనుకూలంగా ఏపీ హైకోర్టులో తీర్పులు వచ్చాయి. కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సహా కీలక న్యాయమూర్తులు పలువురు బదీలీపై, రిటైర్మెంట్ పై వెళ్లిపోయారు. వారి స్థానంలో కొత్తగా ఇతర న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టనున్నాయి. ఇప్పటికే జడ్జిలపై ఏపీ సీఎం జగన్ ఫిర్యాదులు చేసిన నేపథ్యం, ఫిర్యాదు లేఖ ద్వారా జగన్ అనుచిత లబ్ది పొందుతున్నారని మాజీ జడ్జి రాకేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన దరిమిలా.. స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించిన నిర్ణయంపై నిమ్మగడ్డ మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తే గనుక ఎలాంటి తీర్పులు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ సర్కారు తాజా ఉత్తర్వులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ స్పందించాల్సి ఉంది.

కన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతోకన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతో

English summary
though ap high court orders to conduct local body elections, AP cm jagan gives another shock to ap sec nimmagadda ramesh kumar. ap govt has extended the term of special officers ruling in local bodies for six more months. The GO was issued by Gopal Krishna Dwivedi, Principal Secretary of the Panchayat Raj and Rural Development on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X