వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న‌డి రోడ్డుమీద కాన్వాయ్ ఆపి: అక్క‌డిక‌క్కడే 25 ల‌క్ష‌లు మంజూరు చేసి:మాన‌వత్వం చాటుకున్న జ‌గ‌న్‌..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌లోని మాన‌వత్వాన్ని చాటుకున్నారు. న‌డి రోడ్డు మీద త‌న కాన్వాయ్ ఆపి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన బాధితుల‌కు అండ‌గా నిలిచి నిజ‌మైన రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. ముఖ్య‌మంత్రిగా విశాఖ పర్య‌న‌ట‌కు వెళ్లిన జ‌గ‌న్‌కు అక్క‌డ యువ‌త త‌మ స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యాన‌ర్ ప‌ట్టుకున్నారు. అది చూసి కాన్వాయ్ ఆపి జ‌గ‌న్ వారు కోరుకున్న విధంగా సాయం అందించారు. దీనికి విశాఖ న‌గ‌రం వేదిక అయింది.

న‌డిరోడ్డు మీద కాన్వాయ్ ఆపి...
పాద‌యాత్ర స‌మ‌యంలో ఎవ‌రు బాధ చెప్పుకున్నా..విని ఓదార్చిన జ‌గ‌న్‌..ఇప్పుడు ముఖ్య‌మంత్రిగానూ అదే తీరును కొన‌సాగిస్తున్నారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సీఎం త‌న తిరుగు ప్ర‌యాణంలో భాగంగా ఏయిర్ పోర్టుకు వెళ్తున్నారు. ఆ స‌మ‌యంలో విశాఖ న‌గ‌రరోడ్డు మీద కొంద‌రు యువ‌త బ్ల‌డ్ కేన్స‌ర్‌లో బాధ‌ప‌డుతున్న మా స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యాన‌ర్ ప‌ట్టుకున్నారు. ఆ యువ‌తీ యువ‌కుల‌ను చూసిన జ‌గ‌న్ వెంట‌నే త‌న‌ కాన్వాయ్ ఆపారు. కేన్స‌ర్‌తో బాధ ప‌డుతున్న త‌మ స్నేహితుడు నీర‌జ్ కుమార్ ఆప‌రేష‌న్‌కు రూ.25 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని..ఈ నెలాఖ‌రులోగా
అత‌డికి ఆప‌రేష‌న్ చేయించాల‌ని సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించారు. వారి మాట‌ల‌ను విన్న సీఎం జ‌గ‌న్ వెంట‌నే ఆప‌రేష‌న్ కు వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ భాస్క‌ర్‌ను ఆదేశించారు. అక్క‌డిక‌క్క‌డే అవ‌స‌ర‌మైన సాయం చేయాల‌ని త‌న కార్యాల‌య అధికారుల‌ను ఆదేశించారు.

Jagan shows his humanity in helping cancer patient about rs 25 lakhs in Vizag on road

చేతులెత్తి యువ‌త న‌మ‌స్కారం..
త‌మ మిత్రుడు గురించి చెప్ప‌గానే న‌డి రోడ్డు మీద ముఖ్య‌మంత్రి స్పందించి వెంట‌నే సాయం చేయ‌టం తో వారు సీఎం జ‌గ‌న్‌కు చేతుతెత్తి న‌మ‌స్క‌రించారు. ఇప్పుడు ఈ విష‌యం పైన సోష‌ల్ మీడియాలో నెటిజెన్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో..ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్పిన విధంగా వెయ్యి రూపాయాలు దాటిన ప్ర‌తీ ఒక్క‌రికీ ఆరోగ్య శ్రీ కింద సేవ‌లు అందిస్తామ‌ని..అది ఎంత మొత్తంలో ఉన్నా చికిత్స అయ్యే వ‌ర‌కూ వారికి ఉప‌శ‌మ‌నం కోసం కొంత న‌గ‌దు అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు దీని పైన సీయంఓ కార్యాల‌య అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. జూలై 8న వైయ‌స్సార్ జ‌న్మ‌దినం నాడు ఈ కార్య‌క్ర‌మాన్ని అధికారికంగా ప్రారంభించాల‌నే యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు.

English summary
AP CM Jagan shows his humanity in helping cancer patient about rs 25 lakhs in Vizag on road. CM Jagan when he returns from vizag to Amaravati some students stand with banner need help. Jagan approached them and sanctioned amount.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X