వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పోలవరం కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారు :దేవినేని

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి దేవినేని ఉమా. ఏపీ సీఎం జగన్ పోలవరంలో కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు.

ఏపీలో గంటా పై దుమారం .. గంటా కూడా జంపే అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్ఏపీలో గంటా పై దుమారం .. గంటా కూడా జంపే అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్

నాడు జగన్ కర్నూలు జలదీక్షలో మాటలు గుర్తు చేసుకోవాలన్న మాజీ మంత్రి దేవినేని

నాడు జగన్ కర్నూలు జలదీక్షలో మాటలు గుర్తు చేసుకోవాలన్న మాజీ మంత్రి దేవినేని

కర్నూలు జలదీక్షలో జగన్ మాట్లాడిన మాటలు అందరూ చూశారని ఆయన అన్నారు. ఆ నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడారో ఒక సారి నెమరువేసుకుంటే మంచిదని ఆయన పేర్కొన్నారు. జలదీక్షలో మీరు కాళేశ్వరం గురించి అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై ప్రజలకి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పట్లో జలదీక్ష చేసిన జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఎపీకి నష్టం జరుగుతుందని అది అక్రమ ప్రాజెక్ట్ అని కేసీఆర్ హిట్లర్ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో అంతరాష్ట్ర జల యుద్ధాలు తప్పవని నాడు పేర్కొన్న జగన్ నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద చాలా సేపు గడిపారని మండిపడ్డారు. ఇప్పుడు ఒకసారి నాడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలని జగన్ కు సూచించారు.

Recommended Video

పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం వద్దు-- దేవినేని
పోలవరంపై జగన్ వ్యాఖ్యలు అర్ధ రహితం ... పోలవరం లో అవినీతి జరగలేదన్న ఉమా

పోలవరంపై జగన్ వ్యాఖ్యలు అర్ధ రహితం ... పోలవరం లో అవినీతి జరగలేదన్న ఉమా

ఇక జగన్ పోలవరం పై జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం అన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా . పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఇంజినీరింగ్‌ నిపుణుల కమిటీ సూచన మేరకే కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెట్టారని పేర్కొన్నారు .అప్పర్ డ్యామ్, లోయర్ డ్యామ్ పనులు అన్ని కూడా 60 శాతం పైగానే పూర్తి అయ్యాయని మాజీ మంత్రి దేవినేని పేర్కొన్నారు. మీరు ప్రమాణ స్వీకారం చేయకుండానే పోలవరం రాష్ట్రానికి ఏం సంబంధం అని కేంద్రానికి అప్ప చెప్తా అన్నారు అని మండిపడ్డారు. 16 జాతీయ ప్రాజెక్ట్ లలో పోలవరాన్ని ఎప్పుడు ఎలా పూర్తి చేయబోతున్నారో అప్పటి కేంద్ర మంత్రి చెప్పటం జరిగిందని చెప్పారు. అప్పటి ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చి 7 ముంపు మండలాలని మన భూభాగం లో కలిపే వరకే పోలవరం కల సాకారం అయిందని పేర్కొన్నారు.

పోలవరం పనులు ఆపొద్దు .. ఏ ఆడిట్ కైనా మేం సిద్ధమే అన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

పోలవరం పనులు ఆపొద్దు .. ఏ ఆడిట్ కైనా మేం సిద్ధమే అన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

మామీద కోపంతోనో ఇంకెవరిమీద కోపంతోనో పోలవరం పనులు ఆపొద్దని అన్నారు మంత్రి దేవినేని. 16 వేల కోట్ల ప్రాజెక్ట్ 55 వేల కోట్లకు పెంచామని దాని మీద ఆడిట్ చేస్తామంటున్నారని ఏ ఆడిట్ లకు తాము భయపడేది లేదని నిస్వార్థంగా పోలవరం పనులు చేశామని పేర్కొన్నారు. నిర్మాణ పనులు అన్ని అక్కడే ఉన్నాయి.చరిత్రని ఎవరూ తిప్పి రాయలేరన్నారు దేవినేని . ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని దేవినేని అన్నారు.

English summary
Former minister Devineni Uma has fired at YCP chief AP CM Jagan Mohan Reddy. Former minister Devineni Uma has criticized AP CM Jagan for spending more time in Kaleshwaram than in Polavaram. Speaking to the media on Saturday, Devineni criticized on CM Jagan Mohan Reddy. Former minister Devineni Uma said that Jagan's comments on Polavaram were meaningless. He added that there was no corruption in the Polavaram project.and also he said to jagan to remind karnool jaladeeksha where Jagan has done his aggitation against Kaleshwaram project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X