వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలిచారు..ఇంకా సీఎం కాలేదు : అధికారుల‌తో స‌మీక్ష‌లు..? : ఆప‌ధ్ద‌ర్మ సీఎం ఏం చేస్తున్నారు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Results 2019 : గెలుపోటములు సహజం... త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ : చంద్రబాబు || Oneindia

ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ సంచ‌ల‌న విష‌యం సాధించింది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత మెజార్టీ సాధించి చ‌రిత్ర తిర‌గ రాసింది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ, సాంకేతికంగా కాలేదు. ఈ నెల 30వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేసే వ‌ర‌కూ జ‌గ‌న్ అధికారిక ముఖ్య‌మంత్రి కాదు. అప్ప‌టి వ‌ర‌కూ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబే. కానీ, జ‌గ‌న్ ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుండే అధికారిక స‌మీక్ష‌లు చేస్తున్నారు. అంశాల వారీగా ఆరా తీస్తున్నారు. అధికారుల‌త ప్ర‌త్యేకంగా స‌మావేశం అవుతున్నారు. మ‌రి..ఇలా చేయ‌వ‌చ్చా.. వివాదానికి దారి తీస్తుందా...

రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్ రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్

అప్పుడే స‌మీక్ష‌లు ప్రారంభం..
ఎన్నిక‌ల్లో గెలిచిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఈనెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌లు ఎన్నుకున్నారు..కానీ, ముఖ్య‌మంత్రి అవ్వ‌లేదు. ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాతనే ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి హోదా వ‌స్తుంది. అయితే, ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌యిన వెంట‌నే సీఎస్ మొద‌లు అధికారులు జ‌గ‌న్ వద్ద‌కు వ‌చ్చారు. జ‌గ‌న్ సైతం వారితో రాష్ట్రంలోని పాల‌నా ప‌రిస్థితుల గురించి ఆరా తీసారు.

Jagan started Reviews with officials is became discussion in AP..

రాష్ట్ర ఆర్దిక ప‌రిస్థితి గురించి అధికారులు వివ‌రించారు. రాష్ట్రంలో 20 వేల కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సిన‌వి పెండింగ్‌లో ఉన్నాయ‌న జ‌గ‌న్ దృష్టికి తీసుకొచ్చారు. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో పాల‌నా ప‌రంగా తీసుకోబోయే నిర్ణ‌యాల గురించి జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో చ‌ర్చించారు. సీఎస్‌గా ఎల్వీనే కొన‌సాగిస్తున్న‌ట్లుగా స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు. కొత్త‌గా రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా అజ‌య్ క‌ళ్లాం నియామ‌కం ప్ర‌క‌టించారు.

ఆప‌ద్ధ‌ర్మ సీఎం ఉండ‌గానే...
ఇక‌, ఈ రోజు ఐఏయ‌స్ అధికారుల‌తో జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా సమావేశం అవుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను..అభిప్రాయాల‌ను తెలుసుకోవ‌టంతో పాటుగా త‌న లక్ష్యాల‌ను వివ‌రించనున్నారు. ఆర్దిక‌-ఇరిగేష‌న్‌-శాంతి భ‌ద్ర‌త‌ల పైన అధికారుల‌తో స‌మీక్ష‌లు చేయ‌నున్నారు. ముందుగానే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో వీటి పైన చ‌ర్చించారు. అధికారులు అంద‌రూ జ‌గ‌న్ వ‌ద్ద‌కు వ‌స్తుండ‌టం..స‌మీక్ష చేయ‌నుండ‌టంతో ఇప్పుడు అస‌లు జ‌గ‌న్‌కు అప్పుడే ఆ అధికారం ఉంటుందా అనే చ‌ర్చ మొద‌లైంది. మ‌రో వైపు ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు రాజీనామా చేసినా..జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసే వ‌ర‌కూ ఆయ‌న ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నారు.

Jagan started Reviews with officials is became discussion in AP..

Jagan started Reviews with officials is became discussion in AP..

ఈ గ్యాప్‌లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి చేయాల్సిన స‌మీక్ష‌లు చేసేస్తున్నారు. దీని పైన చర్చ జ‌రుగుతున్న వేళ‌.. వైసీపీ నేత‌లు ఈ వాద‌న‌తో విభేదిస్తున్నారు. జ‌గ‌న్‌తో అధికారులు కేవ‌లం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌ల‌వటానికి వ‌చ్చిన స‌మయంలో వాక‌బు చేస్తున్న అంశాలే కానీ..వీటిని అధికారిక స‌మీక్ష‌లుగా చూడ‌లేమ‌ని చెప్పుకొస్తున్నారు. అయితే, ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన జ‌గ‌న్‌కు తిరుమ‌ల‌-తిరుప‌తి దేవ‌స్థానం అర్చ‌కులు ఉండ‌వ‌ల్లికి వ‌చ్చి జ‌గ‌న్‌కు ఆశీర్వాదం ఇచ్చారు. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌ముందే ముఖ్య‌మంత్రిగా అధికారాలు వ‌చ్చేసాయి. భ‌ద్ర‌త‌..కొత్త కాన్వాయ్ కేటాయించారు.

English summary
YS Jagan started reviews with Officials on state issues. Jagan decided to sworn as CM 30th this month. But, AP Officials meeting with jagan and discussing on many issues in AP. Now this became controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X