అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు..క‌ర‌క‌ట్ట కింద ప్ర‌కంప‌న‌లు : వ్య‌తిరేక మీడియాను వ‌దళ్లేదు : కొత్త సీఎం దూకుడు.

|
Google Oneindia TeluguNews

రాజ‌ధానిలో చాలా పెద్ద స్కాం జ‌రిగింది. దీని పైన విచార‌ణ చేస్తాం. కాంట్రాక్టుల్లో అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న వాటిని విచారిస్తాం..అవ‌స‌ర‌మైతే కాంట్రాక్టులు ర‌ద్దు చేస్తాం. ప్ర‌భుత్వం పైన ఇష్టానుసారం వార్త‌లు రాసే వ్య‌తిరేక మీడియాను వ‌దిలేదు లేదు. అన్ని ఆధారాలు ఇస్తాం..అప్ప‌టికీ అలాగే చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..ఇది ఢిల్లీ వేదిక‌గా ఏపి నూత‌న సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు. ఇప్పుడు ఇవి క‌ర‌క‌ట్ట కింద టీడీపీ నేత‌ల్లో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. నిజంగా అవినీతి జ‌రిగిందా..దీనిని రుజువు చేయ‌గ‌ల‌రా..ఎటువంటి చ‌ర్య‌లు దిగుతున్నారనే ఉత్కంఠ వారితో క‌నిపిస్తోంది.

రాజ‌ధాని భారీ స్కాం...

రాజ‌ధాని భారీ స్కాం...

జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలోనూ...ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలోనూ ఎక్క‌డా అమ‌రావ‌తి గురించి..అక్క‌డ రాజ‌ధాని నిర్మానం గురించి ప్ర‌స్తావించ‌లేదు. ఇక‌, ఫ‌లితాల్లో గెలిచిన త‌రువాత ఢిల్లీ కేంద్రంగా తొలి సారి అమ‌రావ‌తి పేరును జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. ప్ర‌ధాని మోదీతో భేటీ తరువాత ఆయ‌న రాజ‌ధానిలో అవినీతి గురించి కీలక వ్యాఖ్య‌లు చేసారు. అమ‌రావ‌తి భారీ స్కాం అంటూ వ్యాఖ్యానించారు. రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌కు ముందే త‌న అనుయాయులకు మేలు జ‌రిగేలా ఎక్క‌డ రాజ‌ధాని వ‌స్తుందో లీక్ చేసి..రైతుల‌ను మోసం చేసార‌ని ఆరోపించారు. నాటి ప్ర‌భుత్వం ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కు పాల్ప‌డింద‌ని పైర్ అయ్యారు. ఈ మొత్తం వ్య‌వ‌హ‌రం మీద జ‌గ‌న్ విచార‌ణకు నిర్ణ‌యిస్తే..అమ‌రావ‌తి ఇక ముందుకు సాగుతుందా అనే ప్ర‌శ్న‌లూ ఉన్నాయి. అయితే, అక్క‌డ భూములు ద‌క్కించుకున్న వారంతా టీడీపీలోని వారు మ‌ద్ద‌తు దారులే కావటంతో ఇప్పుడు వారిలో టెన్ష‌న్ మొద‌లైంది. జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే ఉత్కంఠ వారిలో క‌నిపిస్తోంది.

మాజీ మంత్రులు..ఎమ్మెల్యేలు..

మాజీ మంత్రులు..ఎమ్మెల్యేలు..

అమ‌రావ‌తి ప్రాంతంలో స్థ‌లాలు కొనుగోలు చేసిన వారిలో నాటి మంత్రులు నారాయ‌ణ‌, దేవినేని ఉమా, ప్ర‌త్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, టీడీపీ సీనియ‌ర్ నేత‌లు పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల న‌రేంద్ర, కొమ్మాలపాటి శ్రీధ‌ర్, జీవి ఆంజ‌నేయులు వంటి వారితో పాటుగా అనేక మంది ముఖ్యులు ఉన్నారు. ఇక‌, రాజ‌ధాని ప్రాంతంలోనే హెరిటేజ్ సంస్థ పేరుతో పెద్ద ఎత్తున స్థ‌లాల‌ను రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు. అసెంబ్లీ వేదిక‌గానే జ‌గ‌న్ దీనిని ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ అంటూ చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకొని ఫైర్ అయ్యారు. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి అదే అంశంలో విచార‌ణకు ఆదేశిస్తే అక్క‌డ భూముల కొనుగోలు చేసిన టీడీపీ నేత‌లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుందా అనే చర్చ మొద‌లైంది. అదే స‌మ‌యంలో కొన్ని బినామీ సంస్థ‌ల‌కు..త‌మకు కావాల్సిన వారికి ఐటీ పాల‌సీని ఆధారంగా చూపించి వేలాది ఎక‌రాల భూముల కేటాయింపుల పైనా జ‌గ‌న్ దృష్టి సారించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

వ్య‌తిరేక మీడియాకు హెచ్చిర‌క‌లు...

వ్య‌తిరేక మీడియాకు హెచ్చిర‌క‌లు...

ఇదే స‌మయంలో త‌న‌న వ్యక్తిగ‌తంగా లక్ష్యంగా చేసుకొని ప్ర‌చారం చేస్తున్న మీడియా సంస్థ‌ల‌కు జ‌గ‌న్ జ‌ల‌క్ ఇచ్చారు.
త‌మ ప్ర‌భుత్వంలో ప్ర‌తీదీ పార‌ద‌ర్శ‌కంగానే ఉంటుంద‌ని..త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ స్ప‌ష్టం చేసారు. ఎవ‌రిక‌నైనా ఎటువంటి డాక్యుమెంట్ అయినా అందుబాటులో ఉంచుతామ‌ని...అయినా, త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ఖ‌చ్చితంగా వారి పైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసారు. జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్ దేశంలో తొలిసారి ఏర్పాటు చేయ‌టం ద్వారా..ప్ర‌తీ నిర్ణ‌యం లోనూ పార‌ద‌ర్శ‌కంగా నిర్ణయాలు ఉంటాయ‌న్నారు. ఇక‌, గ‌త ప్ర‌భుత్వంలో తీసుకున్న నిర్ణ‌యాల పైన విచారణ మొద‌లు పెడితే రాజ‌కీయంగా మ‌రోసారి యుద్దం ఖాయంగా క‌నిపిస్తోంది.

English summary
AP Designated CM Jagan decided to conduct enquiry on Amaravati land scam creating political tension in TDP. Jagan also warned his against media to be transparent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X