వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ టార్గెట్ 2024 : మ‌ంత్రుల్లోనే కాదు..శాఖ‌ల్లోనూ ప‌క్కా స‌మీక‌ర‌ణాలు

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ టార్గెట్ 2024 ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సామాజిక‌-ప్రాంతీయ స‌మ‌తుల్య‌త మంత్రుల కేటాయింపులోనే సాధార‌ణంగా అమ‌లు చేస్తారు. కానీ, జ‌గ‌న్ మాత్రం శాఖ‌ల ఖ‌రారులోనూ ఇదే ఫార్ములాను ప్ర‌యోగించారు. అందులో బాగంగా ప్ర‌ధానంగా తాజా ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ టీడీపీ ఆధిప‌త్యం ఉన్న ప్రాంతాల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. అక్క‌డ ప‌రిస్థితిని పూర్తిగా త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌టానికి ఎత్తులు వేస్తున్నారు. అందులో బాగంగానే జ‌గ‌న్ త‌న మంత్రుల‌కు శాఖ‌లు ఖ‌రారు చేసారు.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు ప్రాధాన్య‌త‌...

ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు ప్రాధాన్య‌త‌...


ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాజా ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప‌ట్టం క‌ట్టిన ఉభయ గోదావ‌రి జిల్లాల్లో ఏ మాత్రం ప‌ట్టు స‌డ‌ల‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మంత్రుల కేటాయింపుతో పాటుగా కీల‌క‌మైన శాఖ‌ల‌ను కేటాయించారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు రెండు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. కీల‌క‌మైన వ్య‌వసాయ శాఖ‌ను కాపు వ‌ర్గానికి చెందిన తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన క‌న్న‌బాబుకు కేటాయించారు. అదే జిల్లాకు చెందిన మ‌రో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన బీసీ నేత పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కు ఉప ముఖ్య‌మంత్రి హోదా ఇచ్చారు. ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఎక్కువ‌గా ఉండే కాపుల‌ను ఆక‌ట్టుకొనేందుకు అదే వ‌ర్గానికి చెందిన ఆళ్ల నానికి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

ఎస్సీ మ‌హిళ‌కు హోం..ఎస్టీ మ‌హిళ‌కు డిప్యూటీ..

ఎస్సీ మ‌హిళ‌కు హోం..ఎస్టీ మ‌హిళ‌కు డిప్యూటీ..

జ‌గ‌న్ త‌న మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపులో భాగంగా మ‌హిళ‌ల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. త‌న తండ్రి త‌ర‌హాలోనే మ‌హిళ‌కు హోం శాఖ ఇచ్చారు. ఎస్సీ ఎమ్మెల్యే సుచ‌రిత‌కు కీల‌కమైన హోం శాఖ కేటాయిస్తూ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. అదే విధంగా విజ‌యన‌గ‌రం జిల్లాకు చెందిన కురుపాం ఎస్టీ ఎమ్మెల్యే పుష్ప‌శ్రీవాణికి డిప్యూటీ ముఖ్య‌మంత్రి హోదా ఇస్తూ గిరిజ‌న సంక్షేమ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మ‌రో మ‌హిళ ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన వ‌న‌తికు మ‌హిళా సంక్షేమం కేటాయించారు. వీటి ద్వారా మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. ఇక‌, మొత్తం అయిదుగురు ఉప ముఖ్య‌మంత్రులు ఉంటే..అందులో ఒక మ‌హిళ‌కు సైతం అవ‌కాశం క‌ల్పించారు.

రాయ‌ల‌సీమ‌కు ప్రాధాన్య‌త ఇలా...

రాయ‌ల‌సీమ‌కు ప్రాధాన్య‌త ఇలా...

ఇక‌, కీల‌క‌మైన ఇరిగేష‌న్ శాఖ‌ను ఎంతో న‌మ్మ‌కంతో య‌వ‌కుడు అనిల్‌కు అప్ప‌గించారు. మ‌రో ముఖ్య‌మైన శాఖ ప‌రిశ్ర‌మలు..ఐటీ శాఖ‌ను గౌతం రెడ్డికి ఇవ్వ‌టం ద్వారా యువ మంత్రుల‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు. రాయ‌ల‌సీమ‌కు చెందిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి కీల‌క‌మైన పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది, మైనింగ్ ను అప్ప‌గించారు. అదే విధంగా బుగ్గ‌న‌కు ఆర్దిక శాఖ ఇవ్వ‌గా..అనంత‌పురం నుండి మంత్రి అయిన శంక‌ర నారాయ‌ణ‌కు బీసీ సంక్షేమం అప్ప‌గించారు. అదే విధంగా రాయ‌ల‌సీమ ప్రాంతం నుండి మైనార్టీ-ఎస్సీ వ‌ర్గాల‌కు ఉప ముఖ్య‌మంత్రి హోదాను క‌ట్ట‌బెట్టారు. అంజ‌ద్ భాషా, నారాయ‌ణ స్వామికి ఈ ప‌దవులు ఇచ్చారు. రాయ‌ల‌సీమ నుండే ముఖ్య‌మంత్రే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా..ఈ స్థాయిలో ప్రాధాన్య‌త ద‌క్కింది.

English summary
Jagan strategically allotted port folios for his cabinet ministers in view of their representing areas. CM Jagan given priority departments for Godavari Dist and Rayalaseema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X