వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌తో ఆ పార్టీలు క‌లిసాయి : చ‌ంద్ర‌బాబు ల‌క్ష్యంగా అడుగులు: వైసీపీ కేంద్రంగా కొత్త స‌మీక‌ర‌ణాలు

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కూ చంద్ర‌బాబు జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతారంటూ ప్ర‌చారం. జ‌గ‌న్ కేవ‌లం కేసీఆర్‌తో మాత్ర‌మే మైత్రి. ఇక‌, ఫ‌లితాలు వ‌చ్చాయి. ఒక్క సారిగా సీన్ మారిపోయింది. జ‌గ‌న్‌కు రాజ‌కీయ మిత్రులు పెరుగుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం కేంద్రంగా కొత్త మిత్ర‌ల‌తో చేతులు క‌లుపుతున్నారు. రాజ‌కీయంగా త‌న బ‌లం మ‌రింత‌గా పెంచుకొనేంద‌కు అడుగులు వేస్తున్నారు. జ‌గ‌న్‌-కేసీఆర్‌- స్టాలిన్ ద‌క్షిణాది రాజ‌కీయాల్లో ఒక్క‌ట‌య్యారు. మ‌రి..చంద్ర‌బాబుకు మిగిలే మిత్రులెవ‌రు..

జ‌గ‌న్ రాజ‌కీయ లౌక్యం..

జ‌గ‌న్ రాజ‌కీయ లౌక్యం..

జ‌గ‌న్ ఏపీలో గెలుస్తూనే త‌న రాజ‌కీయ మిత్రుల‌ను పెంచుకుంటున్నారు. ద‌క్షిణ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కీల‌కంగా ఉండేవారు. ఇప్పుడు ఏకంగా 25 లోక్‌స‌భ స్థానాల్లో 22 సీట్లు గెల‌వ‌టం ద్వారా వైసీపీ జాతీయ రాజకీయాల్లోనూ కీల‌కంగా మారారు. కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న మోదీకి ప్ర‌స్తుతం ఎవ‌రి సాయం అవ‌స‌రం లేక‌పోయినా లోక్‌స‌భ‌లో బీజేపీ, కాంగ్రెస్, డిఎంకె త‌రువాతి స్థానంలో వైసీపీ సంఖ్యా బ‌లం ఉంది. ఇక‌, ఎన్నిక‌ల్లో గెలుపు ఖాయ‌మ‌ని.. జాత‌యీ రాజ‌కీయాల్లోనూ హ‌వా కొన‌సాగించాల‌ని భావించిన చంద్ర‌బాబుకు ఇప్పుడు ఎవ‌రు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌నేది చ‌ర్చ నీయాంశంగా మారింది. 2014 నుండి 2019 వ‌ర‌కూ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యం లో తెలంగాన‌..త‌మిళ‌నాడుతో స‌త్సంబంధాలు లేవు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ తొలి రోజు నుండే చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు భిన్నంగా తెలంగాణ‌..త‌మిళ‌నాడు.. కేంద్ర ప్ర‌భుత్వంతో స‌త్సంబంధాలు కోరుకుంటున్నారు.

ఆ ముగ్గరు క‌లిస్తే..ఏపీకీ మేలు..

ఆ ముగ్గరు క‌లిస్తే..ఏపీకీ మేలు..

ఇక‌, విడివిడిగా పార్టీలు అయినా.. ద‌క్షిణాది పార్టీలుగా వైసీపీ, టిఆర్‌య‌స్, డిఎంకే క‌లిసి ఉంటే ఏపీకీ మేలు జ‌రిగే ఛాన్స్ ఉంటుంద‌ని జ‌గ‌న్ అంచ‌నా వేసారు. ఇందులో భాగంగానే ద‌క్షిణాన ఉన్న త‌మిళ‌నాడు అధిక సీట్లు సాధించిన డిఎంకే అధినేత‌కు ఫోన్ చేసి త‌న ప్ర‌మాణ స్వీకారానికి ఆహ్వానించారు. కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్న ప్ర‌భుత్వం ఉండ‌టంతో ఒక‌రి డిమాండ్ల‌కు మ‌రొక‌రు స‌హ‌కారం అందించుకొనే దిశ‌గా మైత్రి ఫార్ములా వ‌ర్క‌వుట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను సాధించుకోవ‌చ్చ‌న్న‌ది జ‌గ‌న్ వ్యూహం. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా కోసం కేసీఆర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ప‌రిస్థితుల్లో ఇక‌, మ‌రో కీల‌క‌మైన డిఏంకే సైతం మ‌ద్ద‌తు ఇచ్చేలా ఒప్పిస్తే త‌మ బ‌లం 54 స్థానాలు. ఇక‌, కాంగ్రెస్ కూడా ప్ర‌త్యేక హోదాకు అనుకూలంగా ఉండ‌టంతో..బీజేపి పైన ఒత్తిడి పెరుగుతంద‌ని జ‌గ‌న్ అంచ‌నా వేస్తున్నారు.

చంద్ర‌బాబు ల‌క్ష్యంగా..

చంద్ర‌బాబు ల‌క్ష్యంగా..

చంద్ర‌బాబు కంటే మెరుగ్గా అంద‌రితోనూ రాజ‌కీయ బంధాలు పెంచుకొని ఒక‌రికి మరొక‌రు స‌హ‌క‌రించుకంటూ అంద‌రి ప్ర‌యోజ‌నా సాధ‌నే లక్ష్యంగా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. రాజ‌కీయ సంబంధాల్లో చంద్ర‌బాబు కంటే జ‌గ‌న్ స‌క్సెస్ అనిపించుకోవాల‌నే జ‌గ‌న్ ల‌క్ష్యం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి..

English summary
Jagan strategically moving his steps to wards relation with southern political parties. Jagan wants to be better than in relations with other parties with credibility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X